బ్లౌజ్ వెనుక భాగంలో పువ్వు ఆకారంలో డిజైన్ చేసి, గోల్డ్ పూసల లైన్లతో రూపొందించిన మోడరన్ కటౌట్ డిజైన్. ప్లెయిన్ లేదా కాంట్రాస్ట్ శారీలపైకి స్టైలిష్ అండ్ ఎలిగెంట్ లుక్‌ని ఇస్తుంది.
సాఫ్ట్ లావెండర్ కలర్ ఫ్యాబ్రిక్‌పై ఓవల్ కటౌట్ ఇచ్చి, చుట్టూ ముత్యాల హ్యాంగింగ్స్‌తో తీర్చిదిద్దిన బ్లౌజ్.సింపుల్ పార్టీవేర్ సారీస్‌పైకి రిచ్ అండ్ క్లాసీ వైబ్‌ని ఇస్తుంది.
రాయల్ ఎంబ్రాయిడరీ, వి షేప్ కటౌట్ పైన, కింద డోరీ టాజిల్స్‌తో రూపుదిద్దుకున్న గ్రాండ్ బ్లౌజ్. లేహంగాలు, హెవీ డిజైనర్ శారీలకు ఇది పర్ఫెక్ట్ ఎంపిక.
వెనుక డోరీలను క్రాస్ మోడల్‌లో కడుతూ గోల్డ్ లెస్, పఫ్ హ్యాండ్స్‌తో డిజైన్ చేసిన రాయల్ పర్పుల్ బ్లౌజ్.ట్రెడిషనల్ అండ్ ఫ్యాషనబుల్ లుక్ రెండూ కోరుకునే వారికి పర్ఫెక్ట్ చాయిస్.
హ్యాండ్స్‌కి మిర్రర్ వర్క్ ఎంబ్రాయిడరీ, వెనుక భాగంలో డబుల్ డోరీలు, ఫ్యాబ్రిక్ టాజిల్స్‌తో ఉన్న గ్రాండ్ డిజైన్.పండుగలు వివాహ వేడుకల్లో ధరించడానికి ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
హై-నెక్ కాలర్ శైలిలో వెనుక భాగంలో ట్రయాంగిల్ కటౌట్‌తో వచ్చిన ఐకట్ ప్రింటెడ్ బ్లౌజ్. కాటన్, హ్యాండ్‌లూమ్ సారీస్‌పైకి సోబర్ అండ్ ఎలిగెంట్ లుక్‌ని ఇస్తుంది.
సాంప్రదాయ బ్రోకేడ్ జరీ బోర్డర్‌తో వెనుక వి-షేప్ కటౌట్ ఇచ్చిన క్లాసిక్ పట్టు బ్లౌజ్. కాంజీవరం, ఉప్పాడ పట్టు చీరలపైకి రాయల్ ట్రెడిషనల్ లుక్‌ని అందిస్తుంది.
బార్డర్‌లో వైట్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ , కటౌట్ మధ్యలో చిన్న చైన్ హ్యాంగింగ్స్‌తో ఉన్న ఎక్స్‌క్లూజివ్ డిజైన్. కాంట్రాస్ట్ శారీలపైకి ప్రత్యేకమైన ఫ్యాషన్ లుక్‌ని ఇస్తుంది.
ఓర్గాంజా పఫ్ హ్యాండ్స్, వెనుక డిజైనర్ మోటిఫ్ , పూసల లేస్‌తో రూపొందించిన మెరూన్ బ్లౌజ్. రిసెప్షన్లు, సంగీత్ లాంటి ఈవెనింగ్ ఫంక్షన్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.