రోజుకు ఎంతసేపు బ్రష్ చేయాలో తెలుసా?
ఉదయం లేచి పళ్లు తోముకోవడం ఒక అలవాటు. పళ్లను తోముకోవడం వల్ల నోట్లోని బ్యాక్టీరియా బయటకు పోతుంది. నోరు శుభ్రపడుతుంది. అంతేకాదు ఎన్నో వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అయితే మీరు రోజుకు ఎంతసేపు పళ్లను తోముతున్నారో గమనించారా?
brushing teeth
ప్రతిరోజూ బ్రష్ చేసుకోవడం చాలా అవసరం. ఇది నోటి పరిశుభ్రతను కాపాడుతుంది. అలాగే రోజూ బ్రష్ చేయడం వల్ల దంతాల తెల్లగా ఉంటాయి. దంతాలు, నోరు, నాలుక ఆరోగ్యంగానూ ఉంటాయి. కానీ రోజుకు ఎంతసేపు బ్రష్ చేయాలో ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. అసలు రోజుకు ఎంత సేపు బ్రష్ చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Image: Getty Images
రోజుకు ఎంత సేపు బ్రష్ చేయాలి?
ఒక పరిశోధన ప్రకారం.. దంతాలపై ఫలకం లేదా మురికి గట్టి పొరను ఖచ్చితంగా తొలగించాలి. ఇవి తొలగిపోవాలంటే మాత్రం ప్రతి ఒక్కరూ మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బ్రష్ చేయడం అవసరం. ఇన్ని నిమిషాలు పళ్లు తోమినప్పుడే పళ్లకు పట్టిన మురికి తొలగిపోతుంది.
brushing
బ్రష్ ను ఎలా ఉపయోగించాలి?
1970 సంవత్సరం నుంచే బ్రష్ లను ఉపయోగించడం మొదలుపెట్టారట. దంత నిపుణుల ప్రకారం.. రెండు నిమిషాలు బ్రష్ చేయాలని సిఫార్సు చేసారు. అలాగే ఎప్పుడూ కూడా మృదువైన బ్రష్ నే వాడాలని డాక్టర్లు సూచించారు. అయితే ప్రస్తుత కాలంలో కూడా డాక్టర్లు మృదువైన బ్రష్‌లనే ఉపయోగించాలని చెప్తుంటారు.
2 నిమిషాలు బ్రష్ ఎందుకు?
రెండు నిమిషాల పాటు బ్రష్ చేయడం వల్ల దంతాల్లోని మురికి బాగా తొలగిపోతుందని ఈ అధ్యయనాల్లో తేలింది. రెండు నిమిషాల కంటే ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల అదనపు ఫలకం కూడా తొలగిపోతుంది.
దంత క్షయం
రోజూ పళ్లు తోముకుంటే నోటి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే దంతక్షయం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. రెగ్యులర్ గా సరిగ్గా బ్రష్ చేసుకుంటే నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉండదు.
రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేయాలి?
అమెరికన్ డెంటల్ అసోసియేషన్ పెద్దలందరూ రోజుకు 2 సార్లు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ తో బ్రష్ చేయాలని సిఫార్సు చేస్తుంది. ఇది ఆయుష్షును పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం వల్ల ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది.
కావిటీస్ నుంచి రక్షణ
ఎక్కువసేపు బ్రష్ చేయకపోతే పంటి ఎనామెల్ విరిగిపోయి కుహరాలకు కారణమవుతుంది. అందుకే దంతాలను సరిగ్గా శుభ్రపరచడం చాలా ముఖ్యం. సరిగ్గా బ్రష్ చేయడం వల్ల కావిటీవ్ వచ్చే ప్రమాదం ఉండదు.
brushing
2×2 ఫార్ములా
పెద్దలందరూ రోజుకు 2 సార్లు, ప్రతిసారీ కనీసం 2 నిమిషాలు బ్రష్ చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మీరు 2×2 ఫార్ములాను అనుసరిస్తే మీ దంతాలు చాలా కాలం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి.