MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Chapati: పిండి కలిపేటప్పుడు ఈ చిన్న పనులు చేస్తే చాలు.. మెత్తటి చపాతీలు రెడీ!

Chapati: పిండి కలిపేటప్పుడు ఈ చిన్న పనులు చేస్తే చాలు.. మెత్తటి చపాతీలు రెడీ!

Chapati: చపాతీలు చేసిన ప్రతిసారి గట్టిగా వస్తున్నాయా? అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసమే. వీటిని పాటిస్తే హోటల్ స్టైల్‌ దూదిలాంటి మెత్తటి చపాతీలను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి చపాతీ మెత్తగా రావడానికి పిండిని ఎలా కలపాలో, ఏం వేయాలో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Oct 02 2026, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హోటల్ స్టైల్ సాఫ్ట్ చపాతీ
Image Credit : Pinterest

హోటల్ స్టైల్ సాఫ్ట్ చపాతీ

మెత్తటి దూదిలాంటి చపాతీలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నచ్చిన కర్రీతో చపాతీలు తింటే ఆ ఫీలింగే వేరు. కానీ చాలామందికి ఎంత ట్రై చేసినా సాఫ్ట్ చపాతీలు చేయడం రాకపోవచ్చు. మరి హోటల్ స్టైల్లో మెత్తటి చపాతీలను ఈజీగా చేయాలంటే ఏం చేయాలో, ముఖ్యంగా పిండిని ఎలా కలపాలో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కావాల్సిన పదార్థాలు
Image Credit : Pinterest

కావాల్సిన పదార్థాలు

గోధుమ పిండి - 2 కప్పులు

గోరువెచ్చని నీళ్లు - తగినన్ని

పాలు - 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు

నూనె లేదా నెయ్యి - 1 టీస్పూన్

ఉప్పు - తగినంత

చపాతీ కాల్చడానికి నూనె లేదా నెయ్యి - తగినంత

35
పిండి కలిపే విధానం
Image Credit : Pinterest

పిండి కలిపే విధానం

  • ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అందులో ఒకేసారి నీళ్లు పోయకుండా, కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోస్తూ పిండిని కలపడం మొదలుపెట్టాలి.
  • చపాతీలు మరింత సాఫ్ట్‌గా రావాలంటే నీళ్లతో పాటు కొద్దిగా పాలు కూడా కలుపుకోవచ్చు.
  • పిండి ముద్దలా అయ్యాక ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేసి బాగా కలపాలి.
  • పిండి మరీ గట్టిగా ఉండకూడదు. అలాగని చేతికి అంటుకునేలా కాకుండా మెత్తగా ఉండాలి.
45
పిండిని నాననివ్వడం
Image Credit : Pinterest

పిండిని నాననివ్వడం

  • పిండి కలిపిన వెంటనే చపాతీలు చేయకూడదు. దానిపై కొద్దిగా నూనె రాసి మూతపెట్టి 15 - 20 నిమిషాలు పక్కన పెట్టాలి. దీనివల్ల పిండి బాగా సెట్ అయి చపాతీలు మెత్తగా వస్తాయి.
  • ఆ తర్వాత పిండిని సమాన సైజులో ఉండలుగా చేసుకోవాలి. పొడి పిండి చల్లుతూ పల్చగా రుద్దాలి. రుద్దిన చపాతీని నాలుగు మడతలుగా మడిచి, మళ్లీ నెమ్మదిగా రుద్దాలి.
  • ఇలా మడిచి మళ్లీ రుద్దడం వల్ల లోపల పొరలు ఏర్పడతాయి. చపాతీ కాల్చేటప్పుడు పొరలు పొరలుగా, మెత్తగా పొంగుతూ వస్తుంది.
55
సాఫ్ట్ చపాతీ రెడీ
Image Credit : Pinterest

సాఫ్ట్ చపాతీ రెడీ

  • పెనాన్ని బాగా వేడి చేసి, చపాతీని వేయాలి. ఒకవైపు చిన్న బుడగలు రాగానే చపాతీని తిరగేయాలి.
  • రెండో వైపు కూడా కాలాక మళ్లీ తిరగేసి, తేలికగా ఒత్తాలి. దీంతో చపాతీ బాగా పొంగుతుంది.
  • పొయ్యి మీద నుంచి తీయగానే కొద్దిగా నెయ్యి రాసి, మూత ఉన్న గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే చపాతీలు ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి. మరి ఆలస్యమెందుకు నెక్ట్స్ టైం చపాతీలు చేసినప్పుడు ఈ టిప్స్ కచ్చితంగా ట్రై చేసి చూడండి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ginger : ఇంట్లో కుండీలోనే అల్లం పెంచేయండి ఇలా, సింపుల్ చిట్కాలు
Recommended image2
Overnight Trips: భారతీయులు ఎక్కువగా ప్రయాణించేది వీటి కోసమే.. 48% ట్రిప్పులు వాటికే
Recommended image3
ఈ లోయలోని నీళ్లలో బియ్యం వేస్తే... నిమిషాల్లో అన్నంగా మారుతుంది.. ఆ మ్యాజిక్ ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Gold: హాల్‌మార్క్ చూసి గోల్డ్ కొంటున్నారా? అది ఫేక్ కావచ్చు.. ఈ 5 కచ్చితంగా చూడండి!
Recommended image2
Telugu Saying: చారాన కోడికి బారాన మసాలా.. మన పెద్దలు ఈ సామెత ఊరికే చెప్పలేదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved