Ginger : ఇంట్లో కుండీలోనే అల్లం పెంచేయండి ఇలా, సింపుల్ చిట్కాలు
gardening Oct 02 2026
Author: ramya Sridhar Image Credits:Pinterest
Telugu
మంచి అల్లం ఎంచుకోవడం...
మనం అల్లం మొక్క పెంచాలి అంటే.. మంచి స్వచ్ఛమైన అల్లాన్ని ఎంచుకోవాలి. అప్పుడే మొక్క మంచిగా పెరుగుతుంది.
Image credits: Pinterest
Telugu
సరైన కుండీలు లేదా స్థలం
అల్లం లోతుకు కాకుండా పక్కలకు ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి లోతు తక్కువగా, వెడల్పు ఎక్కువగా ఉండే కుండీలు, ప్లాస్టిక్ సంచులను ఎంచుకోవాలి. వాటికి కచ్చితంగా రంధ్రాలు ఉండేలా చూసుకోండి.
Image credits: gemini AI
Telugu
మట్టిని సిద్ధం చేయడం
నీరు నిలిచిపోతే అల్లం కుళ్ళిపోతుంది. అందుకే కోకోపిట్, పశువుల ఎరువు లేదా కంపోస్ట్, తేమగా ఉండే మట్టి, కొద్దిగా ఇసుకను సమానంగా కలిపి పాటింగ్ మిక్స్ సిద్ధం చేసుకోవాలి.
Image credits: Getty
Telugu
నాటే విధానం
అల్లం ముక్కలను మట్టిలో 1 నుంచి 2 అంగుళాల లోతులో మాత్రమే నాటాలి. మొలకలు పైకి చూసేలా పెట్టి, దాని పైన కొద్దిగా మట్టిని కప్పాలి.
Image credits: Getty
Telugu
సూర్యరశ్మి
అల్లం మొక్కకు నేరుగా ఎండ తగలాల్సిన అవసరం లేదు. పాక్షికంగా నీడ ఉండే ప్రదేశాలు అనుకూలం. రోజుకు 2-5 గంటల పాటు ఎండ తగిలే కిటికీలు, బాల్కనీలు లేదా చెట్ల నీడలో వీటిని పెంచడం ఉత్తమం.
Image credits: Our own
Telugu
నీరు పోసే విధానం
మట్టిలో ఎప్పుడూ కొద్దిగా తేమ ఉండాలి కానీ నీరు నిలిచిపోకూడదు. పై పొర ఆరిపోయినప్పుడు మాత్రమే నీరు పోయాలి. ప్రతి నెలా కొద్దిగా సేంద్రియ ఎరువు లేదా బూడిద వేయడం మంచిది.
Image credits: Pinterest
Telugu
మల్చింగ్, దిగుబడి
అల్లం నాటిన తర్వాత పైన ఎండుటాకులు లేదా గడ్డితో కప్పాలి. దీనివల్ల తేమ నిలిచిపోయి కలుపు మొక్కలు పెరగవు. 8-10 నెలల తర్వాత ఆకులు పసుపు రంగులోకి మారితే అల్లాన్ని తవ్వి తీసుకోవచ్చు.