MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ లోయలోని నీళ్లలో బియ్యం వేస్తే... నిమిషాల్లో అన్నంగా మారుతుంది.. ఆ మ్యాజిక్ ఏంటో తెలుసా?

ఈ లోయలోని నీళ్లలో బియ్యం వేస్తే... నిమిషాల్లో అన్నంగా మారుతుంది.. ఆ మ్యాజిక్ ఏంటో తెలుసా?

స్టవ్ అక్కర్లేదు, గ్యాస్ అక్కర్లేదు, నిప్పు అక్కర్లేదు.. మీ దగ్గర బియ్యం ఉంటే చాలు. కేవలం ఎలాంటి శ్రమ లేకుండా... నిమిషాల్లో అన్నం వండేయచ్చు. ఆ మ్యాజిక్ వాటర్ ఎక్కడ ఉన్నాయి..?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 02 2026, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
ఈ నీటిలో బియ్యం వేస్తే.. అన్నం అయిపోతుంది..
Image Credit : chat gpt

ఈ నీటిలో బియ్యం వేస్తే.. అన్నం అయిపోతుంది..

మనం బియ్యంతో అన్నం వండాలంటే పొయ్యి వెలిగించాలి.. నీళ్లు మరిగించాలి.. అందులో బియ్యం వేస్తే.. అప్పుడు అది అన్నంగా మారుతుంది. కానీ, పొయ్యి, గ్యాస్ ఏమీ లేకుండానే సహజంగా వచ్చే వేడి నీటిలో బియ్యం వేస్తే.. అన్నం ఉడికితే ఎలా ఉంటుంది? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. మన దేశంలోని ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో సహజంగా వేడిగా ఉబికి వచ్చే నీటిని ఉపయోగించి బియ్యం, పప్పు, ఏకంగా కూరగాయలను కూడా ఉడికించేయచ్చు.

ఈ అద్భుతమైన ప్రదేశం ఎక్కడ ఉంది?

ఆ ప్రదేశమే హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో ఉన్న మణికరణ్. పార్వతి నది ఒడ్డున, పార్వతి లోయలో ఉన్న ఈ ప్రాంతం సహజమైన హాట్ స్ప్రింగ్స్‌కు ప్రసిద్ధి. కుల్లు జిల్లా అధికారిక సమాచారం ప్రకారం, ఇక్కడి కొన్ని వేడి నీటి ఊటల ఉంటాయి. ఆ నీటిలో చేతుల పెట్టారో.. మీ చేతులు కూడా కాలిపోతాయి. ఆ నీరు బాగా ఉడికి.. పొగలు కక్కుతూ ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
నీళ్లలో బియ్యం ఎలా ఉడుకుతుంది?
Image Credit : chat gpt

నీళ్లలో బియ్యం ఎలా ఉడుకుతుంది?

మణికరణ్‌లోని హాట్ స్ప్రింగ్స్‌లోకి బియ్యాన్ని నేరుగా పోయరు. బియ్యాన్ని ఒక గుడ్డ సంచిలో లేదా పలుచటి వస్త్రంలో కట్టి, ఆ మూటను వేడి నీటిలో ఉంచుతారు. నీటి నుంచి వచ్చే సహజమైన వేడి కారణంగా బియ్యం క్రమంగా ఉడికి అన్నంగా మారుతుంది.

అక్కడ నీళ్లు ఎందుకంత వేడిగా ఉంటాయి?

ఇది ఏ మాయాజాలం కాదు. భూమి లోపల ఉన్న వేడి కారణంగా భూగర్భ జలాలు వేడెక్కి పైకి రావడమే దీనికి కారణం. ఇలాంటి వాటినే geothermal లేదా thermal springs అంటారు. మణికరణ్‌లో ఒకవైపు చల్లటి పార్వతి నది ప్రవహిస్తుంటే.. దాని సమీపంలోనే భూమి నుంచి వేడి నీరు పైకి వస్తుంది. ఈ చల్లటి నది, వేడి నీటి ఊటలు ఒకే ప్రాంతంలో కనిపించడం కూడా మణికరణ్ ప్రత్యేకతల్లో ఒకటి కావడం గమనార్హం.

మణికరణ్‌లో ప్రసిద్ధ మణికరణ్ సాహిబ్ గురుద్వారా ఉంది. ఇక్కడి సహజ వేడి నీటి ఊటలను లంగర్‌లో ఆహారం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. భారత ప్రభుత్వ పర్యాటక వెబ్‌సైట్ కూడా గురుద్వారాలోని లంగర్‌ కోసం ప్రధానంగా అన్నం వంటి ఆహారాన్ని ఈ సహజ హాట్ స్ప్రింగ్స్ సహాయంతో తయారు చేస్తారని పేర్కొంది. ఇదే ప్రాంతంలో హిందూ ఆలయాలు కూడా ఉన్నాయి. అందుకే మణికరణ్‌ హిందువులు, సిక్కులు ఇద్దరికీ ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా గుర్తింపు పొందింది.

ఒకే చోట చల్లటి నది.. మరిగేంత వేడి నీరు..

మణికరణ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది ఇదే. ఒకవైపు మంచు పర్వతాల మధ్య పార్వతి నది ప్రవహిస్తుంటే.. మరోవైపు భూమి నుంచి అత్యంత వేడి నీరు బయటకు వస్తుంది. ఆ నీటితోనే బియ్యం ఉడికించి అన్నం తయారు చేయడం చూసినప్పుడు ఇది నిజంగా ప్రకృతి అద్భుతంలా అనిపిస్తుంది. అయితే ఇక్కడి వేడి నీటి ఊటల్లో నేరుగా చేతులు పెట్టడం లేదా స్వయంగా వండేందుకు ప్రయత్నించడం ప్రమాదకరం. అధికారిక సమాచారం ప్రకారం నీరు చాలా వేడిగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Recommended image2
Toe Rings: మోడ్రన్ డిజైన్ మెట్టెలు.. వీటితో పాదాలకు రెట్టింపు అందం!
Recommended image3
Pressure Cooker: కుక్కర్ లో అన్నం, పప్పు పొంగుతున్నాయా? ఎంత నీరు పోస్తే సరిగా ఉడుకుతాయో తెలుసా?
Related Stories
Recommended image1
Pressure Cooker: కుక్కర్ లో అన్నం, పప్పు పొంగుతున్నాయా? ఎంత నీరు పోస్తే సరిగా ఉడుకుతాయో తెలుసా?
Recommended image2
Cardamom Powder: మజ్జిగలో చిటికెడు యాలకుల పొడి కలిపి తాగితే ఏం జరుగుతుంది? వచ్చే మార్పులు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved