Horse Gram Benefits: ఉలువలు చేసే మేలు గురించి తెలిస్తే వాటిని అస్సలు వదిలిపెట్టరు..
Horse Gram Benefits: మన దేశంలో ఉలవల గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరేమో. ఎందుకంటే ఈ ఉలవలు తెలుగు వారికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి. వీటిని ఉడకబెట్టుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. అంతే కాదు ఉలవల చారు కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే ఉలవలు కేవలం రుచికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయన్న విషయం మీకు తెలుసా..
- FB
- TW
- Linkdin
Follow Us
)
Horse Gram Benefits: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మాంసం కంటే ఎక్కువ పోషకాలు ఉలవల్లోనే లభిస్తాయని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఈ ఉలవలు ఎన్నో ఔషద గుణాలను కలిగి ఉన్నాయి. అంతేకాదు అన్ని పప్పు దినుసుల్లో కంటే ఉలవల్లోనే (Horse Gram) ఎక్కువ ప్రోటీన్లు నిండి ఉన్నాయి. ఈ పప్పుల్లో పాస్ఫరస్, ఐరన్, కాల్షియం, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు ఈ ఉలవలు మనం ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఎంతో సహాయపడతాయి. మరి ఉలవలను తినడం వల్ల కలిగే లాభాలేంటో (Health Benefits) ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం: ప్రస్తుత కాలంలో మధుమేహం సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ సమస్య ఉన్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మధుమేహం సమస్యతో బాధపడేవారు తమ రోజు వారి ఆహారంలో ఉలవలను చేర్చుకుంటే ఎంతో మంచిది. ఎందుకంటే ఈ ఉలవలు రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రించగల లక్షణాలను కలిగి ఉంటాయి. .
కిడ్నీలో రాల్లు: కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉలవలు బాగా ఉపయోగపడతాయి. వీటిని కొన్ని రోజుల పాటు ప్రతి రోజూ తినడం వల్ల కిడ్నీలోని రాళ్లు పగిలి పోయి శరీరం నుంచి పూర్తిగా తొలగింపబటానికి ఉలవలు సహాయపడతాయి.
అధిక బరువు: ఉలవల్లో ఫైబర్, ప్రోటీన్లు , ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాగా కార్బోహైడ్రేట్లు మాత్రం తక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఇవి బరువు తగ్గాలనుకునే వారికి చక్కటి ఔషదంలా ఉపయోగపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక బరువును ఈజీగా కోల్పోవచ్చు.
సంతానోత్పత్తి : సంతాన లేమి సమస్యను ఎదుర్కొనే వారికి ఉలవలు మంచి మేలు చేస్తాయి. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న మగవారికి ఉలవలు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ పప్పులు మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెరిగేలా చేస్తాయి. అయితే వీటిని తీసుకునే ముందు ఒక సారి వైద్యులను సంప్రదించి.. తినడం మంచిది.
బలహీనత: ఉలవల్లో ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు, ఫాస్పరస్, ఐరన్, కాల్షియం ఉంటాయి. ఇవి మనిషిని బలంగా, ధ్రుడంగా చేస్తాయి. అయితే ఎవరైతే చిన్న చిన్న పనులను చేసినా తొందరగా అలసిపోతారో అటువంటి వారు కొన్నిరోజుల పాటు క్రమం తప్పకుండా మీ రోజు వారి ఆహారంలో ఉలవలను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే శరీరంలో రక్తం తక్కువగా ఉన్న వారికి కూడా ఉలవలు బాగా ఉపయోగపడతాయి.
ఎదిగే పిల్లలకు బలమైన పోషకవిలువలున్న ఆహారం ఎంతో అవసరం. అందుకే వారికి పోషకవిలువలు సమృద్ధిగా ఉండే ఉలవలు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు.. పిల్లల శరీర నిర్మాణానికి కూడా ఇవి ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా ఉలవల్లో ఆకలిని పెంచే గుణాలుంటాయి. అలాగే మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది.
ఉలవలు అల్సర్ల సమస్యను కూడా తగ్గిస్తాయి. పావు కప్పు ఉలవలను తీసుకుని అందులో పావు టీస్పూన్ అల్లం పేస్ట్, చిటికెడు పొంగించిన ఇంగువ, అతిమధురం వేరు చూర్ణం పావు టీ స్పూన్ వేసుకోవాలి. వాటన్నింటిని నీటిలో వేసి బాగా ఉడికించాలి. దీనిని తేనెతో కలిపి నెల రోజుల పాటు తీసుకోవాలి. ఇది అల్సర్ల సమస్య తొందరగా దూరం చేస్తుంది.