అధిక బరువు లేదా ఊబకాయం కాలేయంపై ఒత్తిడి పెంచుతుంది. ఇది ఆహారం నుండి పోషకాలు, విటమిన్లు, శక్తిని ప్రాసెస్ చేయడాన్ని కష్టతరం చేస్తుంది.
ప్యాక్ చేసిన స్నాక్స్, బిస్కెట్లు, ఫాస్ట్ ఫుడ్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెర ఎక్కువగా ఉంటాయి.
సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌తో సహా చక్కెర పానీయాలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి, ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది.
ఆల్కహాల్ తీసుకోవడం కాలేయ పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. కాలక్రమేణా ఫ్యాటీ లివర్, హెపటైటిస్ లేదా సిర్రోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు (వైట్ బ్రెడ్, వైట్ రైస్, వైట్ పాస్తా వంటివి) కాలేయంలో కొవ్వు పెరగడానికి కారణమవుతాయి.
నూనెలో వేయించిన ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కూడా కాలేయ ఆరోగ్యానికి మంచివి కావు.
రెడ్ మీట్‌లోని కొవ్వు కాలేయంలో పేరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి రెడ్ మీట్‌ను అతిగా తినకుండా ఉండండి.