MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Saree Markets: చవకగా చీరలు దొరికే హోల్‌సేల్ శారీ మార్కెట్లు ఇవిగో, రూ.150కే అదిరిపోయే చీరలు

Saree Markets: చవకగా చీరలు దొరికే హోల్‌సేల్ శారీ మార్కెట్లు ఇవిగో, రూ.150కే అదిరిపోయే చీరలు

Saree Markets: భారత్‌లో కొన్ని హోల్ సేల్ మార్కెట్లలో చీరలు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. ఇక్కడ కేవలం రూ.150 ధరకే అద్భుతమైన చీరలు లభిస్తాయి. ఆ మార్కెట్లు మనదేశంలో ఎక్కడున్నాయి? ఆ మార్కెట్ ప్రత్యేకతేంటో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 24 2026, 10:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చీరల హోల్ సేల్ మార్కెట్లు
Image Credit : Getty

చీరల హోల్ సేల్ మార్కెట్లు

మనకు చీరలంటే చాలా ఇష్టం. పండగైనా, పెళ్లైనా, ఆఫీసుకైనా ప్రతి దానికి చీర కట్టేందుకే ఇష్టపడేవారు ఎంతో మంది. చీర కడితే వచ్చే ఆ అందమే వేరు. మంచి క్వాలిటీ చీరలు కొనాలంటే వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు. కానీ మన దేశంలోని కొన్ని హోల్ సేల్ చీరల మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడ చీరలు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. కేవలం 150 రూపాయల నుంచే ఇక్కడ చీరలు లభిస్తాయి. ఇంతకీ ఆ మార్కెట్లు ఎక్కడున్నాయో, వాటి ప్రత్యేకతలేంటో ఇక్కడ తెలుసుకుందాం. మన దేశంలోని కొన్ని చారిత్రక హోల్‌సేల్ మార్కెట్లకు వెళ్తే, మీకు బెనారసీ, కంచిపట్టు, డిజైనర్ చీరలు సగం కన్నా తక్కువ ధరకే దొరుకుతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చాందినీ చౌక్, ఢిల్లీ
Image Credit : Getty

చాందినీ చౌక్, ఢిల్లీ

ఢిల్లీలోని చాందినీ చౌక్ కేవలం స్ట్రీట్ ఫుడ్‌కే కాదు, బట్టలకు కూడా  చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బెనారసీ, పట్టు, కాటన్ నుంచి మొదలుకొని బాలీవుడ్ సెలబ్రిటీలు కట్టుకునే డిజైనర్ చీరల వరకు అన్నీ లభిస్తాయి. అది కూడా చాలా తక్కువ ధరకే. ఇక్కడ చీరల ధర కేవలం 500 రూపాయల నుంచి మొదలవుతుంది. కినారీ బజార్, కత్రా నీల్ వంటి ప్రాంతాల్లో హోల్‌సేల్ ధరకే సింగిల్ పీస్ చీరలు కూడా కొనుక్కోవచ్చు. ఉదం నుంచి పది నుంచి రాత్రి 9 వరకు ఈ మార్కెట్లు నడుస్తాయి. ఆదివారం మాత్రం మార్కెట్ మూసేస్తారు.

Related Articles

Related image1
Bay leaf: బిర్యానీ ఆకును ఇంట్లో కాలిస్తే జరిగే మ్యాజిక్ ఇదే
Related image2
Career Horoscope: ఈ రాశుల వారు 2 నెలల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు, వీరి గోల్డెన్ టైమ్ మొదలు
35
బుర్రా బజార్, కోల్‌కతా
Image Credit : Getty

బుర్రా బజార్, కోల్‌కతా

కోల్ కతాలో ఫేమస్ చీరల మార్కెట్ బుర్రా బజార్. ఇక్క బెంగాలీ చేనేత చీరలు నుంచి ఆఫీస్ వేర్ చీరల వరకు అన్నీ లభిస్తాయి.  ఇక్కడ కేవలం 150 నుంచి 3000 రూపాయల లోపు రోజువారీ, పార్టీ వేర్ చీరలు దొరుకుతాయి. బాంధనీ, సింథటిక్, సాంప్రదాయ బెంగాలీ కాటన్ చీరలకు ఈ మార్కెట్ చాలా ఫేమస్. ఈ మార్కెట్ కూడా ఉదయం పది నుంచి రాత్రి 9 గంటల వరకు నడుస్తుంది. ఆదివారం ఓపెన్ చేయరు.

45
మంగళ్‌దాస్ మార్కెట్, ముంబై
Image Credit : Getty

మంగళ్‌దాస్ మార్కెట్, ముంబై

ముంబైలోని మంగళ్‌దాస్ మార్కెట్ ఎంతో ఫేమస్. ఇక్కడ ఇండో-వెస్ట్రన్, లేటెస్ట్ ప్రింటెడ్ చీరలు చాలా తక్కువ ధరకే  లభిస్తాయి. జార్జెట్, పట్టు, బెనారసీ, ఆఫీస్ వేర్ చీరలలో కొత్త కొత్త డిజైన్లు ఇక్కడ ప్రతిరోజూ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ వందలాది చీరల దుకాణాలు ఉంటాయి.  ఉదయం 10:30 నుంచి రాత్రి 8:00 వరకు ఈ మార్కెట్ పనిచేస్తుంది. ఆదివారం మాత్రం ఉండదు.

55
షాపింగ్ చేసేటప్పుడు ఈ టిప్స్ గుర్తుంచుకోండి
Image Credit : Getty

షాపింగ్ చేసేటప్పుడు ఈ టిప్స్ గుర్తుంచుకోండి

పైన చెప్పిన మార్కెట్లలో చీరల కొనేటప్పుడు కొన్ని టిప్స్ పాటించండి. ఇక్కడ చెప్పిన ధరకే చీరను కొనకూడదు, బేరమాడాలి. వాళ్లు చెప్పిన ధర కన్నా 30 శాతం వరకు తక్కువ ధరకు బేరమాడొచ్చు. ఈ మార్కెట్లు ఎప్పుడూ జనంతో కిక్కిరిసి ఉంటాయి. కాబట్టి ప్రశాంతంగా షాపింగ్ చేయాలంటే ఉదయాన్నే వెళ్లడం మంచిది. ఇక్కడ చిన్న షాపులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆన్ లైన్ పేమెంట్ కన్నా డబ్బులు తీసుకునేందుకు వారు ఇష్టపడతారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ 3 వస్తువులు చాలు.. 3 నెలల్లో ముఖం మీద ఉన్న మొటిమలు మచ్చలు మాయం
Recommended image2
Face pack: రాత్రి పచ్చి పసుపుతో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలు ఉదయానికల్లా ముఖం మెరిసిపోతుంది
Recommended image3
Sun Flower Seeds: రోజూ ఒక స్పూన్ సన్ ఫ్లవర్ సీడ్స్ తింటే జరిగే మ్యాజిక్ ఇదే..
Related Stories
Recommended image1
Bay leaf: బిర్యానీ ఆకును ఇంట్లో కాలిస్తే జరిగే మ్యాజిక్ ఇదే
Recommended image2
Career Horoscope: ఈ రాశుల వారు 2 నెలల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు, వీరి గోల్డెన్ టైమ్ మొదలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved