MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cooking Oil: పదే పదే వాడిన నూనెను హోటల్ వాళ్లు ఎలా క్లీన్ చేస్తారో తెలుసా?

Cooking Oil: పదే పదే వాడిన నూనెను హోటల్ వాళ్లు ఎలా క్లీన్ చేస్తారో తెలుసా?

Cooking Oil: ఇళ్లల్లో బజ్జీలు, పకోడీలు, ఫిష్ ఫ్రై..చేస్తుంటాం. మిగిలిన నూనె వాడకూడదని, నల్లగా అయిపోయిందని ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అంత నూనె బయట పడేయాలంటే మనసురాదు. అయితే ఒకసారి ఇలా బ్రెడ్ ఫిల్టరింగ్ చేసి చూడండి. ఆ మ్యాజిక్ మీకే కనిపిస్తుంది. 

2 Min read
Author : Nandini Arava
Published : Jun 06 2026, 06:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వాడిన నూనె పదేపదే వాడటం ఆరోగ్యానికి హానికరం
Image Credit : AI Image

వాడిన నూనె పదేపదే వాడటం ఆరోగ్యానికి హానికరం

మన ఇళ్లల్లో అప్పుడప్పుడు ఏ పూరీలో, బజ్జీలో, సమోసాలో, చికెన్ పకోడీనే చేసుకుంటూ ఉంటాం. పనయ్యాక నూనె నల్లగా అయిపోతుందని, ఒకసారి వాడిన నూనె మరోసారి తినకూడదని అనుకుంటాం. అసలే మధ్యతరగతి కుటుంబాలు. అంతంత నూనె పారేయాలంటే మనసు రాదు. కొందరైతే నల్లగా ఉన్న నూనెను కూడా వాడేస్తుంటారు. కానీ ఈ చిన్న మ్యాజిక్ ట్రై చేస్తే...బ్లాక్‍గా ఉన్న ఆయిల్‍ను క్షణాల్లో శుభ్రం చేయొచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వేయించిన తర్వాత నూనె ఎందుకు నల్లగా మారుతుంది?
Image Credit : our own

వేయించిన తర్వాత నూనె ఎందుకు నల్లగా మారుతుంది?

నూనెలో వేయించినప్పుడు పూరీలు, బొండాలు, బజ్జీలు, పకోడీల చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి. ఆ వేడికి ఆ ముక్కులు నల్లగా మాడిపోతాయి. దీనివల్ల నూనె రంగు ఎర్రగా లేదా నల్లగా కనిపిస్తుంది. అందుకే ఒకటి రెండుసార్లు వాడిన తర్వాత నూనె శుభ్రంగా కనిపించదు. ఇలా నల్లగా మారిన నూనెను శుభ్రం చేసి మళ్లీ వాడుకోవచ్చు.

34
ఈ ట్రిక్ వాడితే సెకన్లలో నూనె శుభ్రం
Image Credit : pexels

ఈ ట్రిక్ వాడితే సెకన్లలో నూనె శుభ్రం

చాలా మంది చెఫ్‌లు ఈ బ్రెడ్ ట్రిక్‌ను వాడతారు. దీనికోసం నూనెను కొద్దిగా వేడి చేసి, అందులో ఒక చిన్న బ్రెడ్ ముక్కను వేయాలి. బ్రెడ్ నూనెలోని మాడిన నలకలను, మురికిని పీల్చుకుంటుంది. కొన్ని సెకన్ల తర్వాత బ్రెడ్‌ను బయటకు తీసేయాలి. దీంతో నూనె ముందులాగా శుభ్రంగా కనిపిస్తుంది. నూనె చల్లారిన తర్వాత, టీ వడపోసే జల్లెడ, మస్లిన్ క్లాత్, కాఫీ ఫిల్టర్‌తో వడకట్టాలి. ఇలా చేస్తే నూనెలోని మిగిలిన నలకలు కూడా పోయి, నూనె మరింత శుభ్రంగా కనిపిస్తుంది.

44
ఈ నూనెను పదేపదే వాడటం సరైనదేనా?
Image Credit : pinterest

ఈ నూనెను పదేపదే వాడటం సరైనదేనా?

ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఒకే నూనెను అధిక ఉష్ణోగ్రత వద్ద పదేపదే వేడి చేయడం మంచిది కాదు. అలా చేయడం వల్ల నూనెలో హానికరమైన కాంపౌండ్స్ (compounds) ఏర్పడతాయి. నూనె నుండి ఘాటైన వాసన వచ్చినా, పొగ ఎక్కువగా వస్తున్నా, లేదా రంగు చాలా ముదురుగా మారినా దాన్ని మళ్లీ వాడొద్దు. బ్రెడ్, ఫిల్టరింగ్ ట్రిక్స్‌తో నూనెను కొంతవరకు శుభ్రం చేయొచ్చు. కానీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, చాలా పాత లేదా పదేపదే వేడి చేసిన నూనెను వాడకపోవడమే మంచిది. సురక్షితంగా, సమతుల్యంగా వాడటమే ఉత్తమమైన మార్గం. ఈ ట్రిక్ పనిచేసినంత మాత్రాన…వాడిన నూనె నెలలతరబడి వాడితే ఆరోగ్యానికి ప్రమాదకరం. సమస్యలు రావొచ్చు. గుర్తుంచుకోండి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇదెక్కడి వింత ఆచారం! పెళ్లి తర్వాత వధూవరులు టాయిలెట్‌కు వెళ్లకూడదా!!
Recommended image2
Cloves: దిండు కింద లవంగాలు పెట్టుకొని పడుకుంటే ఏమౌతుంది?
Recommended image3
Apple: కట్ చేసిన యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!
Related Stories
Recommended image1
Hibiscus Tea: ఈ టీ తాగితే క్షణాల్లో పీరియడ్ నొప్పి ఇట్టే పోతుంది
Recommended image2
Home Decor: మీ జేబులో రూ.500 ఉంటే చాలు..మీ ఇంటికి లగ్జరీ లుక్ పక్కా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved