MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Blood Group: మీ బ్లడ్ గ్రూపును బట్టి మీరు తినాల్సిన ఆహారాలు ఇవిగో.. ఇదే బ్లడ్ గ్రూప్ డైట్

Blood Group: మీ బ్లడ్ గ్రూపును బట్టి మీరు తినాల్సిన ఆహారాలు ఇవిగో.. ఇదే బ్లడ్ గ్రూప్ డైట్

Blood Group: ఒక వ్యక్తి బ్లడ్ గ్రూపును బట్టి ఆయన తినాల్సిన ఆహారాలు ఆధారపడి ఉంటాయి. దాన్నే బ్లడ్ గ్రూప్ డైట్ అంటారు. కానీ దీన్ని పాటిస్తున్న వారు చాలా తక్కువ. నిజానికి ఏ బ్లడ్ గ్రూపు వారు ఏం తినాలో కూడా అవగాహన లేదు.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 18 2026, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బ్లడ్ గ్రూప్ డైట్ అంటే ఏమిటి?
Image Credit : Gemini AI

బ్లడ్ గ్రూప్ డైట్ అంటే ఏమిటి?

శరీరానికి సరైన ఆరోగ్యం లభించాలంటే బ్లడ్ గ్రూప్ ఆధారంగా ఆహారం తీసుకోవాలనే విధానాన్ని 'బ్లడ్ గ్రూప్ డైట్' అంటారు. దీనిని ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ పీటర్ డి అడెమో 1996లో ఒక పుస్తకంలో రాశారు. మనం రోజూ తినే పదార్థాలు మన రక్తంతో సరిగ్గా సరిపోవాలని ఆయన తెలిపారు. ఒకవేళ మనం తీసుకునే తిండి శరీరానికి సరిపడకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. రక్త వర్గానికి తగ్గ ఆహారాన్ని ఎంపిక చేసుకుని తినడం వల్ల దీర్ఘకాలిక రోగాలు రాకుండా చూసుకోవచ్చు. ఏ బ్లడ్ గ్రూపు ఉన్నవారు ఎలాంటి ఆహారాలు తినాలో ఇక్కడ ఇచ్చాము.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బ్లడ్ గ్రూపును బట్టి ఆహారం
Image Credit : Pixabay

బ్లడ్ గ్రూపును బట్టి ఆహారం

బ్లడ్ గ్రూప్ 'A' (A+, A-)

వీరు కిడ్నీ బీన్స్ (రాజ్మా వంటివి) తినకుండా దూరంగా ఉండాలి. ఇతర రకాల బీన్స్ తీసుకోవచ్చు. ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారాన్ని అంటే కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం మంచిది.

బ్లడ్ గ్రూప్ 'O' (O+, O-)

ఇది అత్యంత పురాతనమైన బ్లడ్ గ్రూప్. వీరు తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తింటే అన్ని విధాలా మంచిది.

బ్లడ్ గ్రూప్ 'B' (B+, B-)

సంచార జీవనం, జంతువులను మేపడం ప్రారంభమైన కాలంలో ఈ రక్త వర్గం పుట్టింది. వీరు మాంసాహారం, పాల ఉత్పత్తులను ఆహారంలో ఎక్కువగా తీసుకోవచ్చు.

బ్లడ్ గ్రూప్ 'AB' (AB+, AB-)

ఇది సుమారు 1,000 సంవత్సరాల క్రితం మాత్రమే పుట్టిన కొత్త రక్త వర్గం. వీరు టర్కీ కోడి మాంసం, సోయాతో చేసిన టోఫు, సముద్రపు ఆహారం, రకరకాల కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే మంచిది.

33
పాటించే వారు తక్కువ
Image Credit : Pixabay

పాటించే వారు తక్కువ

ఇలా రక్త వర్గాన్ని బట్టి ఆహారం తినడం అనేది మంచిదే అయినప్పటికీ చాలామంది దీనిని పాటించలేకపోతున్నారు. ఈ డైట్‌లో ఉన్న కఠినమైన ఆంక్షలే ఇందుకు ప్రధాన కారణం. ఉదాహరణకు 'A' గ్రూప్ ఉన్నవారు మాంసాహారాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వీగన్లుగా మారిపోవాల్సి ఉంటుంది. కానీ అలా ఉండేందుకు ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అందుకే చాలామంది ఈ పద్ధతిని మొదలుపెట్టినా మధ్యలోనే వదిలేస్తుంటారు. ఏదేమైనా వైద్యులను సంప్రదించాకే మన శరీర తత్వానికి తగ్గ అలవాట్లను చేసుకోవడం ఉత్తమం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Necklace: తులం బంగారంలో వచ్చే లైట్ వెయిట్ నక్లెస్ డిజైన్లు
Recommended image2
Anxiety Relief Food: బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? ఇవి తింటే మాయం!
Recommended image3
Hair Growth: జుట్టు వేగంగా పెరగాలంటే ప్రతిరోజూ ఇదొక్కటి చేస్తే చాలు
Related Stories
Recommended image1
సుడిగాలి సుధీర్‌కు నిశ్చితార్థం జరిగినా.. పెళ్లి మాత్రం ఎందుకు ఆగిపోయింది?
Recommended image2
Andhra Kashmir: ఆంధ్రాలో మంచు కురిసే ఏకైక ప్రాంతం ఇదే.. అందుకే ఆంధ్రా కాశ్మీర్ పేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved