సుడిగాలి సుధీర్‌కు నిశ్చితార్థం జరిగినా.. పెళ్లి మాత్రం ఎందుకు ఆగిపోయింది?
ప్రముఖ బుల్లితెర నటుడు సుడిగాలి సుధీర్ పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాత ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవ్వడంతో సుధీర్ పెళ్లి గురించి చర్చ మొదలైపోయింది. ఎంగేజ్మెంట్ జరిగినా కూడా ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయిందో అని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు.

సుడిగాలి సుధీర్ ఎంగేజ్మెంట్
సుడిగాలి సుధీర్ ఇప్పుడు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. ఆయన పెళ్లి గురించి ఎప్పుడు ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఏకంగా ఓ ఫోటో వైరల్ అవుతోంది. పదేళ్ల క్రితం నాటి ఫోటో అది. ఆ ఫోటోలలో సుధీర్ సాంప్రదాయ దుస్తులు ధరించి, మెడలో పూలదండతో,పక్కన ఒకమ్మాయితో ఉన్నారు.ఆయన పక్కన జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్‌తో పాటు పలువురు టీవీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఈ ఫోటో 2014కు చెందినదని తెలుస్తోంది. అది ఆయన ఎంగేజ్మెంట్ ఫోటో అని సమాచారం. అయితే ఈ ఫోటో చూసి చాలా మంది సుధీర్ కు రహస్యంగా పెళ్లి జరిగిపోయిందని భావిస్తున్నారు. గతంలో రష్మితో ప్రేమ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ అది ప్రేమ కాదని.. ఇద్దరూ తేల్చి చెప్పేశారు. కానీ ఇప్పటి ఫోటో చూస్తే మాత్రం గతంలోనే సుధీర్ పెళ్లి.. ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిందని తెలుస్తోంది.
పెళ్లి ఎందుకు ఆగింది?
తెలిసిన సమాచారం మేరకు 2014లో సుధీర్‌కు కుటుంబ సభ్యులు ఒక సంబంధం చూసి నిశ్చితార్థం మాత్రమే జరిపించారు. ఆ వేడుక సమయంలో రాకింగ్ రాకేష్ తీసుకున్న ఫోటోలు ఇవి. ఆయన పెట్టిన పాత పోస్టుల్లోని ఫోటోలు ఇప్పుడు బయటికి రావడంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సంబంధం పెళ్లి పీటల దాకా వెళ్లకుండానే మధ్యలోనే రద్దయిపోయింది. ఆ పెళ్లి ఇష్టపూర్వకంగానే ఇరువైపుల వారు రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇది కేవలం నిశ్చితార్థం ఫోటోలు మాత్రమే. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు.
ఇప్పటికీ సింగిలే
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాత ఫోటోలు మళ్లీ తెరపైకి వచ్చి విపరీతంగా ట్రెండ్ అవుతున్నప్పటికీ, సుధీర్ వైపు నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఆయన ఇప్పటికీ సింగిల్ గానే కొనసాగుతున్నారు. పాత నిశ్చితార్థం ముచ్చటను కొందరు కావాలనే పెళ్లి వార్తగా మార్చి వైరల్ చేస్తున్నారని స్పష్టమవుతోంది. ఏది ఏమైనా, దాదాపు పదేళ్ల క్రితం ఆగిపోయిన పాత విషయం మళ్లీ తెరపైకి రావడంతో బుల్లితెర వర్గాల్లో ఇది మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై సుధీర్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

