రస్క్ లను మరీ ఎక్కువగా తింటే రిస్క్ లో పడతారు జాగ్రత్త..
రస్క్ లు తెలియని వారుండరు. ఉదయం కప్పు కాఫీలో లేదా టీ లేదా పాలలో ముంచుకుని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వీటిని మరీ ఎక్కువగా తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలొస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రస్క్ అదే టోస్ట్ లను ఇష్టంగా తినే వారు చాలా మందే ఉన్నారు. ఉదయం సాయంత్రం వేలల్లో కప్పు కాఫీ లేదా టీలో ముంచుకుని తింటుంటారు. ఇదొక సర్వ సాధారణ అలవాటు కూడాను. ఈ రస్క్ లల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనిలో ఉండే ఎన్నో పదార్థాలు వీటిని టేస్టీగా చేస్తాయి. తియ్యగా, రుచిగా అనిపించినప్పటికీ.. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్, సంకలనాలు, చక్కెర, గ్లూటెయిన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీవక్రియ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. జర్నల్ ఆఫ్ మాయో క్లినిక్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. బ్రెడ్ లో కంటే రస్క్ లో ఎక్కువ కేలరీలు ఉంటాయి. 100 గ్రాముల రస్క్ లల్లో 407 కిలో కేలరీలు ఉంటాయి. మనమనుకున్నట్టు ఈ బిస్కెట్లు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే..
ఒక నివేదిక ప్రకారం.. రస్క్ లను ఎక్కువగా పాత బ్రెడ్ లతోనే తయారుచేస్తారు. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. రస్క్ బిస్కెట్లను తయారుచేయడానికి ఉపయోగించే ప్రధాన పదార్థాలలో ఈస్ట్, చక్కెర, నూనె, పిండి పదార్థాలు ఉంటాయి. కానీ గడువుతీరిన బ్రెడ్ తో వీటిని తయారుచేయడం వల్ల వీటిలో ఎన్నో వ్యాధికారకాలు ఉండొచ్చు. వీటిని ఎక్కువగా తినడం వల్ల మలబద్దకం, విరేచనాలు, ఫుడ్ ఫాయిజన్ వంటి సమస్యలు వస్తాయి.
రస్క్ లలో గ్లూటెన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని మన శరీరం జీర్ణించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఉదరకుహర వ్యాధి ఉన్నవారు రస్క్ లను మొత్తమే తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి అప్పుడప్పుడు ఉబ్బరం, నొప్పి, విరేచనాలు, అసౌకర్యం వంటి సమస్యలను పెంచుతాయి.
రస్క్ లల్లో ఎక్కువ మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది మన రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు వీటిని తినకపోవడమే మంచిది. వీటిని ఎక్కువగా తినడం వల్ల మధుమేహం, ఊబకాయం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి.
రస్క్ లల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పిండి మన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఈ రస్క్ లను మిల్క్ టీతో తీసుకంటే రస్క్ కేలరీల సంఖ్య బాగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా వీటిని తింటే జీవక్రియ ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి. ఈ టోస్ట్ లు మీ జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తాయి. ఇవి గుండె జబ్బులు, ఊబకాయానికి దారితీస్తాయి.
రస్క్ లు రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా బాగా పెంచుతాయి. వీటిని తినేటప్పుడు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. రస్క్ లు పేగు బొబ్బల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ఉబ్బరం, అజీర్ణం, పేలవమైన జీర్ణక్రియ, మలబద్ధకంతో పాటుగా ఎన్నో ఇతర సమస్యలకు దారితీస్తుంది.