Radish Benefits: ముల్లంగిని తింటే పైల్స్ నుంచి బరువు తగ్గడం వరకు ఎన్ని రోగాలు తగ్గిపోతాయో తెలుసా..?
Radish Benefits: ముల్లంగి వాసనను చూసి చాలా మంది దీనిని అస్సలు తినరు. నిజానికి ఈ కూరగాయను తినడం వల్ల ఎన్నో రోగాలు తగ్గిపోతాయి.
ముల్లంగి మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వల్ల ఎన్నో రకాల రోగాలు నయమవుతాయి. ఈ కూరగాయ శరీరం నుంచి విషాన్ని తొలగించడమే కాదు పైల్స్, బరువు తగ్గడం, ఒత్తిడి, క్యాన్సర్ వంటి ఎన్నో రోగాలు తగ్గిస్తుంది.
ముల్లంగిని కూరగా లేదా పచ్చిగా కూడా తినొచ్చు. సలాడ్ గా కూడా తీసుకుంటారు. మన సాంప్రదాయ కూరగాయలలో ఒకటైన ముల్లంగి ఎన్నో రుగ్మతలకు నివారణగా కూడా ఉపయోగించబడుతుంది. ముల్లంగి మాత్రమే కాదు.. దీని ఆకు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ముల్లంగి ప్రయోజనాలు
నిర్విషీకరణ (Detoxification)ను మెరుగుపరుస్తుంది: శరీరం నుంచి విషాన్ని తొలగించడాన్నే నిర్విషీకరణ అంటారు. అయితే ముల్లంగిని తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. శరీరం నుంచి వ్యర్థాలు, విషపదార్థాలు బయటకు పోతాయి. కామెర్లు ఉన్న వారికి కూడా ఇది మంచి ఆహారం. ప్రేగులు, కడుపునకు చాలా మంచి ఆహారమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పైల్స్ సమస్యను తగ్గిస్తుంది: పైల్స్ తో బాధపడేవారు వీటిని తింటే మంచిది. ఎందుకంటే దీనిలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనిలో ఉండే నిర్విషీకరణ గుణాలు పైల్స్ లక్షణాలను త్వరగా తగ్గించడంలో సహాయపడతాయి. ముల్లంగులను జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల విసర్జన వ్యవస్థ సులభతరం అవుతుంది. అలాగే చాలా త్వరగా పైల్స్ ప్రాబ్లమ్ నుంచి త్వరగా బయటపడతారు.
బరువు తగ్గడం: ముల్లంగిలో నీటి శాతం, జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇది డైటర్లకు మంచి ఆహారమనే చెప్పాలి. బరువు తగ్గాలని ప్రయత్నించేవారికి ముల్లంగి చక్కటి ఎంపిక. వ్యాయామం చేయడానికి ముందు, చేసిన తర్వాత కొన్ని ముల్లంగి ముక్కలను తింటే సులువుగా బరువు తగ్గుతారు.
క్యాన్సర్ ను నివారిస్తుంది: ముల్లంగిలో ఐసోథియోసైనేట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను తగ్గించడానికి, పూర్తిగా తొలగించడానికి సహాయపడతాయి. వీటిని తింటే క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
ఒత్తిడి: ముల్లంగిలో ఆంథోసైనిన్లు అనే ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఉంటాయి. ఒత్తిడిని తగ్గించడమే కాదు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
చర్మ సంరక్షణ: ముల్లంగి చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే నీరు చర్మంలో ఆరోగ్యకరమైన తేమ స్థాయిలను నిల్వచేయడానికి సహాయపడతాయి. ముల్లంగి మంచి క్లీనర్ గా, ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్ గా పనిచేస్తుంది.
మూత్రపిండాల సమస్య: ముల్లంగిని తినడం వల్ల మూత్రపిండాల సమస్యలు కూడా తొలగిపోతాయి. వీటిని తినడం వల్ల మూత్రవిసర్జన సాఫీగా సాగుతుంది. దీనిలో యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి. ఇవి మూత్రపిండాలను ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతాయి.
కాలేయానికి మంచిది: ముల్లంగి కాలేయం, పిత్తాశయం విధులకు సహాయపడుతుంది. ఇవి Bilirubin, ఆమ్లాలు, ఎంజైమ్‌ల ఉత్పత్తి, ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. ముల్లంగిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయం, పిత్తాశయానికి అంటువ్యాధులు, అల్సర్లు వచ్చే అవకాశం తగ్గుతుంది.