Ramadan 2022: రంజాన్ మాసంలో ఉపవాసం చేసేవారు ఖర్జూరాలను ఎందుకు తింటారంటే..?
Ramadan 2022: రంజాన్ మాసంలో ఖర్జూరాలకున్న గిరాకీ వేరే వాటికి ఉండదనే చెప్పాలి. ఎందుకంటే ఈ మాసంలో ఉపవాసం చేసేవారంతా ఖచ్చితంగా ఖర్జూరాలను తింటుంటారు. ఇలా తినడానికి కూడా ఓ కారణం ఉంది. అందేంటంటే..
Ramadan 2022: రంజాన్ మాసం వచ్చిందంటే చాలు ఖర్జూరాకు బలే గిరాకీ ఉంటుంది. ఉపవాసం ఉండే ప్రతి ఒక్కరూ ఈ పండ్లను ఖచ్చితంగా తింటుంటారు. ఎందుకంటే ఈ పండ్ల వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి. ఈ పండ్లలో పోషకవిలువలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
ఖర్జూరాలలో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం, జింక్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి ఈ పండ్ల వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి..
కొలెస్ట్రాల్ తక్కువ.. ఖర్జూరాలను తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయన్న భయం లేదు. ఎందుకంటే వీటిలో కొలెస్ట్రాల్ ఉండదు. ముఖ్యంగా ఈ ఎండు పండ్లలో కొవ్వు కంటెంట్ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి చాలా మంది వీటిని స్నాక్స్ గా తీసుకుంటారు.
చక్కెరకు బదులుగా.. చక్కెర మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. షుగర్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే డాక్టర్లు షుగర్ వాడకాన్ని తగ్గించాలని చెబుతుంటారు. అయితే ఈ చక్కెరకు బదులుగా ఖర్జూరాలు ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఖర్జూరాలను నానబెట్టాలి. ఆ నీళ్లని పాయసం, జ్యూస్ లు, లడ్డూల తయారీలో వాడుకోవచ్చు. వీటితో తయారు చేసిన ఆహారాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఆ తేడా మీకు ఇట్టే తెలిసిపోతుంది కూడా.
విటమిన్స్.. ఖర్జూరా పండ్లలో విటమిన్ ఎ1, విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5 లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీ శరీరానికి ఎంతో అవసరం కూడా. ఈ పండు ఒక్కటి తింటే చాలు.. మీకు ఆ రోజుకు మరే పోషకాలు అవసరం లేదు. వీటివల్ల మీ ఎనర్జీ లెవెల్స్ ఇట్టే పెరిగిపోతాయి. అందుకే ఉపవాసం చేసే సమయాల్లో వీటిని ఎక్కువగా తింటుంటారు. ఉపవాసం చేస్తున్నప్పుడు నీరసం రాకుండా ఉండేందుకు వీటిని తింటారు.
healthy dates
ఎముకలకు మంచిది.. ఖర్జూరా పండ్లలో మెగ్నీషియం, సెలీనియం, కాపర్, మాంగనీస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా తయారుచేస్తాయి. అలాగే ఆస్టియోపొరాసిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తింటుంటారు.
జీర్ణవ్యవస్థకు మంచిది.. అజీర్థి, మలబద్దకం సమస్యతో బాధపడుతున్నవారికి ఖర్జూరా పండ్లు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. ఇందుకోసం కొన్ని రోజుల పాటు ఖర్జూరా పండ్లను నీటిలో నానబెట్టి తినాల్సి ఉంటుంది.
చర్మానికి మేలు చేస్తుంది.. ఖర్జూర పండులో స్కిన్ ను స్మూత్ గా చేసే గుణముంటుంది. ఈ పండులో ఉండే విటమిన్ డి, సి లు స్కిన్ సాగే గుణాన్నిపెంచుతాయి. అంతేకాదు వయసు మీదపడ్డా మీరు అలా కనిపించకుండా చేస్తాయి.
dates
ఖర్జూరాలు మన ఆరోగ్యానికే కాదు జట్టు, చర్మ సమస్యలను కూడా తగ్గిస్తతాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తినండి. అప్పుడే ఆరోగ్యంగా, అందంగా తయారవుతారు.