MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Marriage: మీ పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? అయితే మీకు ఈ విషయాల్లో ఇబ్బందులు తప్పవు

Marriage: మీ పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? అయితే మీకు ఈ విషయాల్లో ఇబ్బందులు తప్పవు

Marriage: పెళ్లి చేసుకున్నా కూడా.. ఆ పెళ్లిని రిజిస్ట్రేషన్ చేసుకోని వారే ఎక్కువ. ఇలా చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? వివాహ నమోదు చేయించుకోవడం తప్పనిసరా? సర్టిఫికెట్ లేకపోతే ఏమవుతుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 16 2026, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకోవాలి?
Image Credit : Asianet News

మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకోవాలి?

పెళ్లి అయిపోయిన తరువాత తట్టా బుట్టా సర్దుకుని ఎవరింటికి వారు వెళ్లిపోతారు. ఒక కొత్త జంట హనీమూన్ కు వెళ్లిపోతుంది. కానీ పెళ్లి రిజిస్ట్రేషన్ గురించి మాత్రం ఎవరూ ఆలోచించరు. చాలా మంది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వదిలేస్తారు. అయితే భవిష్యత్తులో చట్టపరమైన, అధికారిక అవసరాల సమయంలో మ్యారేజ్ సర్టిఫికెట్ లేకపోతే మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో వివాహాలను నమోదు చేయడం తప్పనిసరి. కాన్నీ దీన్ని పాటించే వారు చాలా తక్కువ.

ఏవైనా గొడవలు వచ్చినప్పుడు లేదా అవసరమైన సమయంలో భార్యాభర్తల బంధాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే, మ్యారేజ్ సర్టిఫికెట్ ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్‌గా పనిచేస్తుంది. సర్టిఫికెట్ లేనప్పుడు పెళ్లి జరిగిందని నిరూపించడానికి వెడ్డింగ్ కార్డ్, పెళ్లి ఫోటోలు, సాక్షులు లాంటి ఇతర ఆధారాలు అవసరం అవుతాయి.

భార్య లేదా భర్త వివాహ బంధాన్ని వదులుకోవాలనుకుంటే ఆ బంధం నుంచి బయటికి వచ్చేందుకు కూడా మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం. అందుకే పెళ్లి జరిగిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకుని సర్టిఫికెట్ తీసుకోవడం చాలా మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వీసా, ఇన్సూరెన్స్ విషయంలో
Image Credit : Unsplash

వీసా, ఇన్సూరెన్స్ విషయంలో

విదేశాలకు వెళ్లేటప్పుడు జీవిత భాగస్వామికి డిపెండెంట్ వీసా కోసం దరఖాస్తు చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో మ్యారేజ్ సర్టిఫికెట్ అడుగుతారు. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు పొందడానికి కూడా ఇది అవసరం. అప్పుడు మీ దగ్గర సర్టిఫికెట్ లేకపోతే డాక్యుమెంట్లు సేకరించడంలో చాలా ఆలస్యం జరుగుతుంది.

అలాగే, కొన్ని ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ లేదా కుటుంబ సంక్షేమ పథకాలకు కూడా వివాహ బంధాన్ని నిరూపించే ఆధారం అవసరం అవుతుంది. అయితే, అన్ని చోట్లా మ్యారేజ్ సర్టిఫికెట్ మాత్రమే అంగీకరిస్తారని చెప్పలేం. ఆయా సంస్థల నిబంధనలు, ప్రత్యామ్నాయ ఆధారాలను అంగీకరించే విధానాలు వేర్వేరుగా ఉండొచ్చు.

34
కుటుంబ చట్టపరమైన విషయాల్లో...
Image Credit : Unsplash

కుటుంబ చట్టపరమైన విషయాల్లో...

భరణం, వారసత్వం, పిల్లల సంరక్షణ లేదా కుటుంబానికి సంబంధించిన చట్టపరమైన సమస్యలు వచ్చినప్పుడు వివాహ బంధాన్ని నిరూపించుకోవాల్సి వస్తుంది. అప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్ సాక్ష్యంగా పనిచేస్తుంది. కొన్ని కేసుల్లో మీ హక్కులను కాపాడుకోవడానికి ఇది సహాయపడుతుంది.

అయితే, మ్యారేజ్ సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన అన్ని హక్కులూ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయని, సర్టిఫికెట్ లేకపోతే ఎలాంటి హక్కులూ దక్కవని అనుకోకూడదు. సంబంధిత చట్టం, పెళ్లి జరిగిన విధానం, కేసులోని వాస్తవాల ఆధారంగానే కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి.

44
పెళ్లై చాలా ఏళ్లు గడిచినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా?
Image Credit : Pexels

పెళ్లై చాలా ఏళ్లు గడిచినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా?

పెళ్లి జరిగి ఏళ్లు గడుస్తున్నా కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పెళ్లి జరిగినట్లు ఆధారాలు, గుర్తింపు, చిరునామా ధృవీకరణ పత్రాలు లాంటి అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని, పెళ్లి జరిగిన ప్రాంతానికి చెందిన మ్యారేజ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించవచ్చు. ప్రస్తుత డాక్యుమెంట్ల జాబితా, ఫీజు, దరఖాస్తు విధానాన్ని అధికారిక ప్రభుత్వ సేవల వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవడం మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
River: ఒక్కో నది ఒక్కో రంగులో ఎందుకు ఉంటుంది? ఏ రంగు నీరు తాగడం మంచిదో తెలుసా?
Recommended image2
Egg Myths : కోడిగుడ్ల గురించి మీరు నమ్ముతున్న 5 అబద్ధాలు ఇవే..
Recommended image3
Anklets: మీ పాదాలకే అందాన్ని తెచ్చే ఆక్సిడైజ్డ్ సిల్వర్ పట్టీలు.. !
Related Stories
Recommended image1
Golden Tree: పసిఫిక్ మహాసముద్రంలో బంగారు చెట్టు.. కొత్తగా కనిపెట్టిన శాస్త్రవేత్తలు
Recommended image2
హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. భారీ తగ్గింపును ఇస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved