MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైదరాబాద్లో ఇల్లు కొనేందుకు ఈ దీపావళి బెస్ట్ టైమ్.. భారీ తగ్గింపును ఇస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు

హైదరాబాద్లో ఇల్లు కొనేందుకు ఈ దీపావళి బెస్ట్ టైమ్.. భారీ తగ్గింపును ఇస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు

సొంత ఇల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే సొంత ఇల్లు కొనేందుకు బెస్ట్ టైమ్ ఈ దీపావళి పండగనే. పండుగ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తున్నాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 16 2026, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సొంత ఇల్లు కొనడానికి సరైన సమయం
Image Credit : Gemini

సొంత ఇల్లు కొనడానికి సరైన సమయం

సొంత ఇల్లు కొనాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఇల్లు కొనాలనుకుంటే ఈ దీపావళి బెస్ట్ సీజన్ అని చెప్పుకోవాలి. ఇల్లు కొనాలనుకునే వారికి ఈ పండుగ సీజన్‌లో భారీ డిస్కౌంట్లు దొరికే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇళ్ల అమ్మకాల కంటే కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ వేగంగా జరుగుతోంది. దీనివల్ల లక్షలాది ఇళ్లు అమ్ముడుపోకుండా ఖాళీగా పడి ఉన్నాయి. దీంతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు కూడా నెమ్మదించాయి. అందుకే బిల్డర్లు ఈ పండుగ సీజన్‌ను టార్గెట్ చేసి, మిగిలిపోయిన ఇళ్లను త్వరగా అమ్మేయాలని చూస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
హైదరాబాద్ లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య
Image Credit : Gemini

హైదరాబాద్ లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య

మనదేశంలోని చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రధాన మెట్రో నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 12 శాతం పెరిగింది. అంటే 6.31 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 5.62 లక్షలుగా ఉండేది. సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్త ఇళ్ల అమ్మకాలు కేవలం 3 శాతం మాత్రమే పెరిగి 1,00,220 ఇళ్లు అమ్ముడయ్యాయి. కానీ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇళ్ల సంఖ్య 18% పెరిగి 1.14 లక్షలకు చేరింది. అందుకే ఖాళీ ఇళ్ల సంఖ్య అమాంతం పెరిగింది.

33
ఇల్లు కొనడానికి ఇదే సరైన సమయం ఎందుకు?
Image Credit : Gemini

ఇల్లు కొనడానికి ఇదే సరైన సమయం ఎందుకు?

హైదరాబాద్ లో అమ్ముడుపోని ఇళ్లు అధికంగా ఉండడంతో ఈ పండుగ సీజన్‌లో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవ్వడానికి రియల్ ఎస్టేట్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీరు సొంత ఇల్లు కొనాలనుకుంటే ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. అలాగే రెపో రేటు పెంపు వల్ల బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది.

ఇళ్ల ధరలు విపరీతంగా పెరగడమే ఇంటి అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం. ఉదాహరణకు బెంగళూరులో రెండేళ్ల క్రితం రూ.40-75 లక్షలు ఉన్న 2 BHK ఇళ్ల ధరలు ఇప్పుడు రూ.1 కోటి దాటాయి. చెన్నై, ముంబై, హైదరాబాద్‌లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీంతో సామాన్యులు ఇల్లు కొనే ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారు. హైదరాబాద్ లో కూడా ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎంతో మంది ఇల్లు కొనే ఆలోచనను పక్కన పెడుతున్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
తెలంగాణ
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రాబోయేది క‌ష్ట‌కాలం, జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Recommended image2
తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. తేదీలు, రుసుముల పూర్తి వివరాలు
Recommended image3
Dasara Holidays 2026 : దసరా హాలిడేస్ అక్టోబర్ 25 వరకు పొడిగిస్తారా? 13 కాదు 16 రోజులు సెలవులేనా?
Related Stories
Recommended image1
Gold: మనదేశంలోని ఇళ్లల్లో ఉన్న బంగారం ఎన్ని కిలోలు? ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది?
Recommended image2
Dangerous Tree: ప్రమాదకరమైన చెట్టు.. ఆకు నుంచి పండు వరకు అంతా విషమే, నీడలో నిలబడినా ప్రమాదమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved