MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Camphor oil: కర్పూరం నూనెతో జుట్టు ఏపుగా పెరగాల్సిందే.. ఎలా తయారు చేయాలో తెలుసుకోండి

Camphor oil: కర్పూరం నూనెతో జుట్టు ఏపుగా పెరగాల్సిందే.. ఎలా తయారు చేయాలో తెలుసుకోండి

Camphor oil: జుట్టు పెరుగుదల కోసం కర్పూరం అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తయారు చేసుకుంటే నెలల తరబడి దీన్ని వాడుకోవచ్చు. ఈ నూనె జుట్టును పొడవుగా, మందంగా పెరిగేలా చేస్తుంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 05 2026, 10:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వేసవిలో జుట్టు రాలిపోతుంది
Image Credit : gemini ai

వేసవిలో జుట్టు రాలిపోతుంది

వేసవి వచ్చిందంటే జుట్టు అధికంగా ఊడిపోతుంది. ఉక్కపూత కారణంగా జుట్టు పై ప్రభావం అధికంగా పడుతుంది. జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంది. అయితే జుట్టు వేగంగా, ఒత్తుగా ఆరోగ్యంగా పెరగాలంటే సింపుల్ చిట్కా ఒకటి ఉంది. అదే కర్పూరం. ఇది శక్తివంతమైన అద్భుతంగా పనిచేసే ఆయుర్వేద చికిత్సగా చెప్పుకోవచ్చు. దీనిని మీరు వంట గదిలో పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో ఇక్కడ ఇచ్చాము.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కర్పూరం నూనెకు ఏం కావాలి?
Image Credit : Getty

కర్పూరం నూనెకు ఏం కావాలి?

కర్పూరం నూనెను తయారు చేయడానికి ముందుగా కొబ్బరి నూనె తీసుకోండి. కొబ్బరి నూనె చర్మానికి పోషణను అందిస్తుంది.ఈ నూనె ప్రోటీన్ నష్టపోకుండా నివారిస్తుంది. కోల్డ్ ప్రెస్ట్ కొబ్బరినూనెను వంద మిల్లీగ్రాములు తీసుకోవాలి. ఇక రెండు నుంచి మూడు గ్రాముల కర్పూరాన్ని తీసుకోవాలి. మొక్కనుండి తీసిన భీమ్సేని కర్పూరం అయితే మంచిది. స్వచ్ఛమైన, తినదగిన భీమ్సేని కర్పూరాన్ని ఎంపిక చేసుకోవాలి. సాధారణ సింథటిక్ కర్పూరం టాబ్లెట్లను వాడితే ఉపయోగం లేదు. అవి కఠినమైన రసాయనాలతో తయారుచేస్తారు. దీని వల్ల తల చర్మానికి కూడా హాని కలుగుతుంది.

Related Articles

Related image1
Costly Dress:ఈ ఒక్క సూట్‌ ధరతో మీ ఏడు తరాలు కూర్చుని తినవచ్చు.. దీని ధర వింటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది
Related image2
Pappu Storage: వేసవిలో వండిన పప్పు రాత్రికల్లా పాడైపోతుందా? ఈ చిన్న చిట్కాతో తాజాగా ఉంటుంది
34
ఇలా తయారు చేయండి
Image Credit : Getty

ఇలా తయారు చేయండి

ఇప్పుడు నూనె తయారు చేయడానికి ఒక గాజు లేదా స్టీల్ గిన్నెలో కొబ్బరి నూనె వేయండి. దాన్ని చిన్న మంట మీద వేడి చేయండి. నూనె కాస్త వెచ్చగా అయ్యాక కర్పూరం పొడిని అందులో వేసి బాగా కలపండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. నూరిన కర్పూరాన్ని గిన్నెలో వేసి పూర్తిగా అది కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండండి. తర్వాత గది ఉష్ణోగ్రత వద్దకు చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక సీసాలో వేసి భద్రపరచుకోండి.

44
ప్యాచ్ టెస్ట్ చేసుకోండి
Image Credit : Getty

ప్యాచ్ టెస్ట్ చేసుకోండి

కొద్దిగా నూనెను తీసుకొని మీ జుట్టు కుదుళ్లకు తగిలేలా మర్దనా చేయండి. తల చర్మం పై, మెడ వెనుక భాగంలో, ఎక్కువ చెమట పట్టే చోట, దురదపెట్టే చోట ఈ నూనెను మర్దనా చేయండి. దాదాపు దాదాపు గంట పాటు అలాగే ఉంచండి. తర్వాత చల్లగా జివ్వుమనిపించే అనుభూతి కలగడం మొదలవుతుంది. ఆ సమయంలో తేలికపాటి, సున్నితమైన షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోండి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇలా చేస్తే సరిపోతుంది. ప్రతిరోజూ దీన్ని పూయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే చర్మం పొడి బారిపోవచ్చు. కర్పూరం చాలా శక్తివంతమైనది కాబట్టి తల మొత్తం పూయడానికి ముందు మీ చెవి వెనక భాగంలో చిన్న ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అక్కడ మీకు మంటగా లేదా తీవ్రమైన ఎరుపు రంగులోకి మారితే వెంటనే కడిగేయండి. అంటే మీకు ఈ నూనె అధికంగా రాస్తే పడదని అర్థం. కనుక కర్పూరం క్వాంటిటీని తగ్గించి వాడడం ఉత్తమం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Time to Workouts : ఉదయం వర్కౌట్స్ చేయడం మంచిదా? లేక సాయంత్రమా?
Recommended image2
Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి!
Related Stories
Recommended image1
Costly Dress:ఈ ఒక్క సూట్‌ ధరతో మీ ఏడు తరాలు కూర్చుని తినవచ్చు.. దీని ధర వింటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది
Recommended image2
Pappu Storage: వేసవిలో వండిన పప్పు రాత్రికల్లా పాడైపోతుందా? ఈ చిన్న చిట్కాతో తాజాగా ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved