MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Goa Trip: మొద‌టిసారి గోవా వెళ్తున్నారా.? ఈ విష‌యాలు తెలుసుకుంటే మీ ట్రిప్ ఈజీ అవుతుంది

Goa Trip: మొద‌టిసారి గోవా వెళ్తున్నారా.? ఈ విష‌యాలు తెలుసుకుంటే మీ ట్రిప్ ఈజీ అవుతుంది

Goa Trip: గోవా అంటే అందమైన బీచ్‌లు, ఉత్సాహభరితమైన నైట్‌లైఫ్, పోర్చుగీస్ శైలిలో ఉన్న సంస్కృతి అన్నీ కలిసిన ప్రత్యేకమైన టూరిస్ట్ డెస్టినేషన్. మొద‌టిసారి గోవాకు వెళ్లే వారు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య‌మైన విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 29 2026, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గోవా వెళ్లడానికి ఉత్తమ సమయం ఏది?
Image Credit : Gemini AI

గోవా వెళ్లడానికి ఉత్తమ సమయం ఏది?

గోవా ట్రిప్‌కు సరైన సమయం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చాలా చల్లగా, సౌకర్యంగా ఉంటుంది. బీచ్ యాక్టివిటీస్, సైట్‌సీయింగ్ ఇవన్నీ ఈ సీజన్‌లో చాలా ఎంజాయ్ చేయవచ్చు. అలాగే ఈ కాలంలో జరిగే పండుగలు, ఈవెంట్స్ కూడా టూరిస్టులను ఆకర్షిస్తాయి. కాగా వేస‌వి కూడా గోవా బీచ్ అందాల‌ను ఆస్వాదించేందుకు స‌రైన స‌మ‌యంగా చెప్పొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మొద‌టి రోజు గోవాకు చేరుకోవాలి
Image Credit : Gemini AI

మొద‌టి రోజు గోవాకు చేరుకోవాలి

మొదటి రోజు గోవా అంతర్జాతీయ విమానాశ్రయం లేదా మడ్గావ్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి హోటల్‌కి వెళ్లి చెక్-ఇన్ చేయాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత పనాజీ నగరాన్ని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఫోంటైన్హాస్ లాటిన్ క్వార్టర్ ప్రాంతంలో రంగురంగుల ఇళ్లు చాలా ప్రసిద్ధి. సాయంత్రం సమయంలో మండోవి న‌ది ఒడ్డున వాకింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది.

35
Day 2: నార్త్ గోవా టూర్
Image Credit : Gemini AI

Day 2: నార్త్ గోవా టూర్

రెండో రోజు ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నార్త్ గోవా వైపు ప్రయాణం ప్రారంభించండి. కలంగుట్ బీచ్, బాగా బీచ్ వంటి బీచ్‌లు చాలా ఫేమస్. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్, కేఫ్‌లు, ఫుడ్ అన్నీ అందుబాటులో ఉంటాయి. తర్వాత అంజునా ఫ్లీ మార్కెట్‌లో షాపింగ్ చేయొచ్చు. సాయంత్రం హోటల్‌కి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకోవచ్చు.

45
Day 3: గోవా వారసత్వ ప్రదేశాలు
Image Credit : Tripadvisor

Day 3: గోవా వారసత్వ ప్రదేశాలు

మూడో రోజు గోవా చరిత్రను తెలుసుకునేలా ప్లాన్ చేయండి. బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, సీ క్యాథ‌డ్రెల్ వంటి చారిత్రక చర్చిలను సందర్శించండి. తర్వాత గోవా స్టేట్ మ్యూజియంలో గోవా సంస్కృతి గురించి తెలుసుకోవచ్చు. సాయంత్రం మాండోవి నదిపై క్రూయిజ్ ట్రిప్ ఒక మంచి అనుభవం అవుతుంది.

Day 4: సౌత్ గోవా అనుభవం

నాలుగో రోజు సౌత్ గోవా వైపు వెళితే ప్రశాంతమైన బీచ్‌లు కనిపిస్తాయి. కోల్వా బీచ్, బెనౌలిమ్ బీచ్ వంటి ప్రదేశాలు రిలాక్స్ అవ్వడానికి బాగుంటాయి. బీచ్ దగ్గర సీఫుడ్ భోజనం కూడా ట్రై చేయొచ్చు. తర్వాత డోనా పౌలా వ్యూ పాయింట్ సందర్శించి తిరిగి పనాజీకి రావచ్చు.

55
Day 5: షాపింగ్ & తిరుగు ప్రయాణం
Image Credit : Getty

Day 5: షాపింగ్ & తిరుగు ప్రయాణం

చివరి రోజు పనాజి మార్కెట్లలో షాపింగ్ చేయండి. గోవా ప్రత్యేకమైన కాజూ, మసాలాలు, హ్యాండ్‌మేడ్ వస్తువులు కొనుక్కోవచ్చు. తర్వాత హోటల్‌కి వచ్చి చెక్‌అవుట్ చేసి తిరుగు ప్రయాణం ప్రారంభించండి.

గోవాలో ఎక్కడ ఉండటం మంచిది?

గోవాలో ఉండడానికి పనాజీ ఒక మంచి కేంద్ర ప్రాంతం. ఇక్కడి నుంచి బీచ్‌లు, చారిత్రక ప్రదేశాలు సులభంగా చేరుకోవచ్చు. అందుకే ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న హోటళ్ల‌లో స్టే చేస్తే అనుకూలంగా ఉంటుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రయాణం
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఉప్పు డబ్బాలో వీటిని వేస్తే గడ్డ కట్టదు, చెమ్మపట్టదు
Recommended image2
Fashion Tips: ఈ వర్షాకాలంలో ఉన్న వాతావరణానికి ఏ బట్టలు వేసుకోవాలి? ఉక్కపోత తగ్గించే బెస్ట్ ఫ్యాబ్రిక్స్
Recommended image3
Gardening Tips: ఈ మొక్కలను ఇంటి లోపల పెంచకపోవడమే మంచిది!
Related Stories
Recommended image1
Goa Tour: గోవాకు స‌మ్మ‌ర్‌లో వెళ్తేనే అస‌లైన మ‌జా.! త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ ఎంజాయ్
Recommended image2
Atal Pension Yojana: రోజుకు రూ. 10 క‌డితే.. రూ. 5 వేల పెన్ష‌న్‌, త‌ర్వాత రూ. 8 ల‌క్ష‌ల గ్యారెంటీ రిట‌ర్న్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved