Childrens Day Speech in Telugu: బాలల దినోత్సవానికి ఇలా సింపుల్ గా స్పీచ్ ఇచ్చేయండి
Childrens Day Speech in Telugu: చిల్డ్రన్స్ డే వచ్చేసింది. ఈ రోజున టీచర్లు, పిల్లలు కూడా స్పీచ్ ఇవ్వాల్సి వస్తుంది. సింపుల్ గా తెలుగులో స్పీచ్ ఎలా ఇవ్వాలో ఇక్కడ ఇచ్చాము.

చిల్డ్రన్స్ డే స్పీచ్ తెలుగులో
బాలల దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 14న నిర్వహించుకుంటాం. మన దేశపు తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా దీన్ని సంబరంగా చేసుకుంటాం. నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టం. అందుకే పిల్లలు ఆయనను ప్రేమగా చాచా నెహ్రూ అని పిలిచేవారు. ఆయన మాటల్లో ఎల్లప్పుడూ పిల్లలే దేశ భవిష్యత్తు అని చెబుతూ ఉండేవారు ఈ రోజు పిల్లల ఆనందం, విద్య, హక్కులు, భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన రోజు. స్కూళ్లలో ఈ రోజు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు సాగుతాయి. ఈరోజున టీచర్లు, పిల్లలు స్పీచ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మేము సింపుల్ స్పీచ్ తెలుగులో ఇచ్చాము.
ప్రసంగం 1
అందరికీ నమస్కారం!
ఈ రోజు నవంబర్ 14, బాలల దినోత్సవం. ఈ రోజు మన తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జన్మదినం. నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే మనం ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా నిర్వహించుకుంటాం. ఆయన చెప్పినట్లుగా మనం బాగా చదివి, మంచివాళ్లమై, మన దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారాలి. ఈ రోజు మన అందరికీ ఎంతో ప్రత్యేకం. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు!
ప్రసంగం 2
గౌరవనీయులైన టీచర్లకు, స్నేహితులకు గుడ్ మార్నింగ్. ప్రతి సంవత్సరం నవంబర్ 14న మనం బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇది చాచా నెహ్రూ గారి జన్మదినం. ఆయనకు పిల్లలు అంటే ప్రాణం. ఆయన ఎప్పుడూ పిల్లలతో నవ్వుతూ, ఆటలు ఆడుతూ ఉండేవారు. ఆయన మనకు మంచి విద్యను, సద్గుణాలను నేర్చుకోవాలని చెప్పేవారు. మనమందరం ఆయన చూపిన దారిలో నడుద్దాం. జై హింద్!
ప్రసంగం 3
నెహ్రూ గారు పిల్లలే దేశ భవిష్యత్తు అని నమ్మేవారు. వారు చదువులో, ఆటలో, మంచి ప్రవర్తనలో ఎదగాలని ఆశించేవారు. ఆయన చెప్పినట్లు మనం బాగా చదవాలి, కష్టపడి నేర్చుకోవాలి, ఇతరులకు సహాయం చేయాలి. ఈ రోజు మనం నెహ్రూ గారి ఆలోచనలను గుర్తు చేసుకోవాలి. పిల్లలందరూ మంచి పౌరులుగా, మన దేశానికి గౌరవం తీసుకువచ్చేలా ఎదగాలి.
బాలల దినోత్సవం కేవలం ఆటపాటల రోజు కాదు, ఇది మన భవిష్యత్తును గుర్తు చేసే రోజు. మనమంతా నెహ్రూ గారిలా ప్రేమతో, దయతో, కృషితో ముందుకు సాగుదాం.
అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే! జై హింద్!
ప్రసంగం 4
పిల్లల కోసం ప్రతి ఏడాది బాలల దినోత్సవం వస్తుంది. నెహ్రూగారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. నెహ్రూ గారు పిల్లలే దేశ భవిష్యత్తు అని చెప్పేవారు. ఆయన ఎప్పుడూ పిల్లలు చదువులో ముందుండాలి, సత్యం, ప్రేమ, శాంతి వంటి విలువలను నేర్చుకోవాలని కోరుకునేవారు. ప్రతి పిల్లవాడు సంతోషంగా జీవించాలి, మంచి విద్య పొందాలి, దేశానికి మేలుచేయాలన్నది ఆయన కల. ఈ రోజు మనం ఆయన ఆశయాలను గుర్తు చేసుకొని, బాగా చదవాలి, మంచి పనులు చేయాలి, మన గురువులను గౌరవించాలి.
మన తల్లిదండ్రులకు ప్రేమ చూపాలి, మన దేశాన్ని గర్వపడేలా చేయాలి. బాలల దినోత్సవం మనకు ఒక అందమైన సందేశం ఇస్తుంది ... పిల్లలు పూలవంటివారు, వాళ్లు నవ్వితే ప్రపంచం అందంగా మారుతుంది.
అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే!
జై హింద్