MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Gas Cylinder: కంపోజిట్ గ్యాస్ సిలిండ‌ర్ అంటే ఏంటి? మ‌నం వాడే సిలిండ‌ర్ దీనికి తేడా ఏంటో తెలుసా?

Gas Cylinder: కంపోజిట్ గ్యాస్ సిలిండ‌ర్ అంటే ఏంటి? మ‌నం వాడే సిలిండ‌ర్ దీనికి తేడా ఏంటో తెలుసా?

Gas Cylinder: యుద్ధం కార‌ణంగా గ్యాస్ సిలిండ‌ర్ల‌కు సంబంధించిన చ‌ర్చ పెద్ద ఎత్తున న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా కంపోజిట్ గ్యాస్ సిలిండ‌ర్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఇంత‌కీ కంపోజిట్ గ్యాస్ సిలిండ‌ర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 28 2026, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కంపోజిట్ గ్యాస్ సిలిండర్ అంటే ఏమిటి?
Image Credit : Gemini AI

కంపోజిట్ గ్యాస్ సిలిండర్ అంటే ఏమిటి?

గ్యాస్ సిలిండర్లలో ఇప్పుడు కొత్త రకం టెక్నాలజీ వ‌చ్చింది. అదే కంపోజిట్ గ్యాస్ సిలిండర్. ఇవి సంప్రదాయ స్టీల్ సిలిండర్లకు భిన్నంగా ఉంటాయి. ఈ సిలిండర్లను ఫైబర్ గ్లాస్, హై డెన్సిటీ ప్లాస్టిక్ వంటి పదార్థాల పొరలతో తయారు చేస్తారు. లోహంతో తయారు చేసే సాధారణ సిలిండర్లకు బదులుగా ఈ సిలిండర్లను బలమైన పొరలతో రూపొందిస్తారు. దీని వల్ల ఇవి బలంగా, తేలికగా, సురక్షితంగా ఉంటాయి. అందుకే ఇవి కొత్త తరహా గ్యాస్ సిలిండర్లుగా భావిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సాధారణ సిలిండర్‌తో తేడా ఏమిటి?
Image Credit : Chat gpt

సాధారణ సిలిండర్‌తో తేడా ఏమిటి?

కంపోజిట్ సిలిండర్, సాధారణ స్టీల్ సిలిండర్ మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కంపోజిట్ సిలిండర్లు సుమారు 50% వరకు తేలికగా ఉంటాయి. ఒకచోట నుంచి మరోచోటికి తీసుకెళ్లడం సులభం, ఇళ్లలో వాడటానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. స్టీల్ సిలిండర్‌లా భారీగా ఉండదు, అలాగే బ‌రువు కూడా ఉండ‌దు. ఈ కారణాల వల్ల నగరాల్లో, చిన్న కుటుంబాల్లో వీటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు.

35
భద్రత పరంగా ఏవి మంచివి.?
Image Credit : Getty

భద్రత పరంగా ఏవి మంచివి.?

భద్రత విషయానికి వస్తే కంపోజిట్ సిలిండర్లు ప్రత్యేకంగా డిజైన్ చేశారు. స్టీల్ సిలిండర్‌లలో ప్రమాదం జరిగితే పేలే అవకాశం ఉంటుంది. కానీ కంపోజిట్ సిలిండర్‌లలో అలాంటి ప్రమాదం తక్కువ. ఎక్కువ వేడి లేదా అగ్ని తగిలినా ఇవి పేలకుండా నెమ్మదిగా గ్యాస్ విడుదల అయ్యేలా తయారు చేస్తారు. అందువల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది.

45
ప్ర‌త్యేక ఫీచ‌ర్
Image Credit : Getty

ప్ర‌త్యేక ఫీచ‌ర్

కంపోజిట్ సిలిండర్‌లో ఉన్న ప్రత్యేక ఫీచర్ సెమీ ట్రాన్స్‌పరెంట్ బాడీ. దీని వల్ల సిలిండర్ లోపల ఎంత గ్యాస్ మిగిలి ఉందో కంటితోనే చూడవచ్చు. సాధారణ సిలిండర్‌లో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో ముందుగా తెలియదు. కానీ ఈ సిలిండర్‌తో ఆ సమస్య ఉండదు. వంట చేస్తుండగా గ్యాస్ అకస్మాత్తుగా అయిపోవడం తగ్గుతుంది.

55
ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తారు?
Image Credit : Getty

ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తారు?

కంపోజిట్ సిలిండర్లు కేవలం ఇళ్లలో మాత్రమే కాదు. మరెన్నో చోట్ల ఉపయోగిస్తున్నారు. ఇళ్ల వంటగదులు, క్యాంపింగ్ ట్రిప్స్, పిక్నిక్‌లు, బార్బెక్యూ వంట‌కాలు, అవుట్‌డోర్ వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నారు. ఇవి తేలికగా ఉండటం వల్ల బయట కార్యక్రమాలకు చాలా అనుకూలంగా ఉంటాయి. అంతేకాదు, స్టీల్ సిలిండర్‌లలా జంగ్ పడదు. అందుకే ఇవి ఆధునిక గృహాలకు సరిపోయే కొత్త తరహా గ్యాస్ సిలిండర్లుగా మారుతున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Lunch Box Recipes: నిమిషాల్లో తయారయ్యే లంచ్ బాక్స్ రెసిపీలు.. టేస్ట్ అదుర్స్!
Recommended image2
Sarees: ఎవరికైనా నప్పే టాప్ ట్రెండింగ్ చీరలు ఇవిగో
Recommended image3
Gold Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే బంగారు నల్లపూసలు
Related Stories
Recommended image1
Mini AC: కిర్రాక్ ఆఫ‌ర్‌.. రూ. 2 వేల‌కే ఏసీ. ఈ స‌మ్మ‌ర్‌లో కూల్ కూల్‌గా
Recommended image2
TATA Tiago: క్ల‌చ్ నొక్కి నొక్కి కాలు నొప్పి పుడుతుందా.? ఈ కారు కొంటే బిందాస్‌.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved