MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Nita Ambani: నీతా అంబానీకి జస్ట్ చీర కడితే ఎంత జీతం ఇస్తారో తెలుసా?

Nita Ambani: నీతా అంబానీకి జస్ట్ చీర కడితే ఎంత జీతం ఇస్తారో తెలుసా?

Nita Ambani: నీతా అంబానీ తన కాస్ట్యూమ్స్, మేకప్ తో ఎప్పుడూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. మరి, ఆమె దగ్గర పనిచేసే ఫ్యాషన్ డిజైనర్ కీ, మేకప్ ఆర్టిస్ట్ కి నెల జీతం ఎంత ఇస్తారు..?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 16 2026, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Nita Ambani
Image Credit : instagram@mahesh_videojournalist

Nita Ambani

భారత దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ కి పరిచయం అవసరం లేదు. ఆయన భార్య నీతా అంబానీ ఎప్పుడూ తన రాయల్ లైఫ్ తో నిత్యం వార్తల్లో ఉంటారు. ఆవిడ ధరించే చీరలు, ఆభరణాల నుంచి పర్సనల్ లుక్స్ వరకు ప్రతిదీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్కే. అయితే, నీతా అంబానీని అంత అందంగా, రాయల్ గా ముస్తాబు చేసే మేకప్ ఆర్టిస్టులు, ఫ్యాషన్ డిజైనర్లు నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? ఆ వివరాలు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
డాలీ జైన్..
Image Credit : instagram @elleindia

డాలీ జైన్..

చీరను 325 విభిన్న శైలుల్లో కట్టడంలో ప్రపంచ రికార్డు సృష్టించిన సెలబ్రిటీ శారీ డ్రేపర్ డాలీ జైన్. నీతా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్‌లకు చీరలు, లేహంగాలు స్టైల్ చేసేది ఈమెనే. కేవలం ఒక చీరను డ్రేప్ చేయడానికి ఈమె రూ. 35,000 నుంచి రూ. 2 లక్షల వరకు ఫీజు తీసుకుంటారు.

మేకప్ ఆర్టిస్ట్.. మిక్కీ కాంట్రాక్టర్..

నీతా అంబానీ కి అత్యంత ప్రాణస్నేహితుడు, పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్. బాలీవుడ్ ఐకాన్ల నుంచి అంబానీ కుటుంబం వరకు అందరికీ ఈయనే ఫేవరెట్. ఈయన నీతా అంబానీకి ఒక లుక్ మేకప్ చేయడానికి లేదా ఒక రోజు ముస్తాబు చేయడానికి రూ. 75,000 నుంచి రూ. 1 లక్ష వరకు వసూలు చేస్తారు. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ CEO జీతం కంటే ఇది చాలా ఎక్కువ.

33
ఫ్యాషన్ మాస్ట్రోస్ – మనీష్ మల్హోత్రా ,అబు జానీ-సందీప్ ఖోస్లా
Image Credit : instagram @vogueindia

ఫ్యాషన్ మాస్ట్రోస్ – మనీష్ మల్హోత్రా ,అబు జానీ-సందీప్ ఖోస్లా

నీతా అంబానీ రాయల్ ఈవెంట్స్ , రాయల్ వెడ్డింగ్స్ కోసం ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది భారతదేశపు టాప్ ఫ్యాషన్ డిజైనర్లు మనీష్ మల్హోత్రా, అబు జానీ-సందీప్ ఖోస్లా.

ఆభరణాలు, డ్రెస్సింగ్: ఒక్కో అవుట్‌ఫిట్‌పై రియల్ గోల్డ్, రియల్ డైమండ్స్, జరీ వర్క్‌తో కోట్లాది రూపాయల ఖరీదైన రాయల్ డిజైన్స్‌ను కస్టమైజ్ చేస్తారు. వీరికి ఇచ్చే కస్టమైజేషన్ డిజైనింగ్ ఫీజు మాత్రమే లక్షల్లో ఉంటుంది.

అంతేకాదు.. ఈ పర్సనల్ టీమ్ మెంబర్స్ ప్రయాణించడానికి అంబానీ కుటుంబం ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్ లేదా ఫస్ట్ క్లాస్ ట్రావెల్ సౌకర్యాలు, 7-స్టార్ హోటల్ అకామడేషన్ కూడా ఇస్తారు. ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి లేదా టాప్ ఐటీ ఉద్యోగి వార్షిక ప్యాకేజీ కంటే వీరి ఒక నెల ఆదాయమే చాలా ఎక్కువ ఉండడం గమనార్హం

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Black Beads Chain: 3 గ్రాముల బంగారంలో వచ్చే నల్లపూసల చైన్స్.. ఇవిగో!
Recommended image2
Jhumka designs: పట్టుచీరల మీద అందాన్ని పెంచే టెంపుల్ జ్యూవెలరీ జుంకాలు
Recommended image3
Banana: అరటిపండ్లతో పాటూ మిగతా పండ్లను కలిపి ఎందుకు ఉంచకూడదు?
Related Stories
Recommended image1
Train: వీసా, పాస్ పోర్టు లేకుండా ఈ రైలు ఎక్కనివ్వరు.. మన దేశంలోనే విచిత్రమైన రైల్వే స్టేషన్ ఇది..!
Recommended image2
Kasuri Methi: కూరలో కసూరీ మేథీ ఎందుకు వేయాలి? ఎలా వేస్తే కూరకు రుచి పెరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved