MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • House Cooling Tips: ఏసీ లేకపోయినా ఇల్లు చల్లబడాలా? ఇదొక్కటి చేస్తే చాలు

House Cooling Tips: ఏసీ లేకపోయినా ఇల్లు చల్లబడాలా? ఇదొక్కటి చేస్తే చాలు

House Cooling Tips:  బయట ఎండలు మండిపోతున్నాయి. కానీ, ఇంట్లో ఏసీ కూడా లేదా? అయినా పర్వాలేదు.. ఏసీ లేకపోయినా మీరు ఇంటిని చల్లగా మార్చుకోవచ్చు. దాని కోసం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 12 2026, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇంట్లో ఏసీ లేదా?
Image Credit : AI

ఇంట్లో ఏసీ లేదా?

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ వేడిని తప్పించుకోవడానికి చాలా మంది ఏసీలపై ఆధారపడుతూ ఉంటారు. కానీ.. ఏసీ కొనుక్కోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.  అయితే.. ఏసీ లేకపోయినా ఇంటిని చల్లగా మార్చుకోవచ్చు. దీని వల్ల రూపాయి అదనంగా కూడా ఖర్చు కాదు. మరి దాని కోసం ఏం చేయాలో  ఇప్పుడు తెలుసుకుందాం…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఫ్యాన్ తో ఇంటిని చల్లగా మార్చవచ్చు...
Image Credit : AI Meta

ఫ్యాన్ తో ఇంటిని చల్లగా మార్చవచ్చు...

సీలింగ్ ఫ్యాన్లు యాంటీ క్లాక్ వైస్ లో తిరిగినప్పుడు చల్లటి గాలి వస్తుంది.  దీని వల్ల ఫ్యాన్ కింద కూడా మీకు చల్లగా అనిపిస్తుంది…

ఐస్ టెక్నిక్..  టేబుల్ ఫ్యాన్ ముందు ఒక గిన్నెలో ఐస్ క్యూబులు వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల టేబుల్ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి..  ఐస్ ముక్కలకు తగిలి… గాలి చల్లగా వస్తుంది.

వేడి గాలి బయటకు పంపడం… ఇంట్లోని వేడి గాలి బయటకు పంపినప్పుడు ఇల్లంతా చల్లగా ఉంటుంది. దీని కోసం మీరు మీ ఇంట్లో కిచెన్, బాత్రూమ్ లోని  ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వాడాలి.

కరెంట్ వాడకం తగ్గించడం…టీవీ, ల్యాప్‌టాప్, పాత బల్బులు ఎక్కువ వేడిని విడుదల చేస్తాయి. అవసరం లేనప్పుడు వాటిని ఆపేయండి. పాత  బల్బుల స్థానంలో తక్కువ వేడినిచ్చే LED లైట్లను వాడండి. మధ్యాహ్నం పూట ఎక్కువ వేడిని పుట్టించే ఓవెన్ వాడకాన్ని, వంటను తగ్గించడం మంచిది.

 ఇంట్లోకి వేడి రాకుండా కిటికీలను సరిగ్గా మూసి ఉంచాలి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల లోపే  కిటికీలు మూసేయండి. ముదురు రంగు కర్టెన్లు వేడిని పీల్చుకుంటాయి, అందుకే లేత రంగు కర్టెన్లనే వాడండి. 'బ్లాక్-అవుట్' కర్టెన్లు లేదా హీట్-రిఫ్లెక్టింగ్ ఫిల్మ్‌లు వాడితే కిటికీల నుంచి వచ్చే వేడి చాలా వరకు తగ్గుతుంది.

34
సహజమైన గాలి వెలుతురు
Image Credit : Pinterest

సహజమైన గాలి వెలుతురు

ఇంట్లో గాలి కదలకుండా ఉండిపోతే ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే, సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు తెరిచి ఉంచి, గాలి ఇంట్లోకి స్వేచ్ఛగా వచ్చి వెళ్లేలా చూడండి. 

 సింథటిక్ దుస్తులకు బదులుగా, గాలి ఆడే కాటన్  దుస్తులు వేసుకోండి. బెడ్‌షీట్లు కూడా కాటన్‌వి అయితే చెమటను పీల్చుకుని, శరీరాన్ని చల్లగా ఉంచడంలో సాయపడతాయి. 

 కలబంద, స్నేక్ ప్లాంట్, అరెకా పామ్ వంటి ఇండోర్ మొక్కలు గాలిలో తేమను పెంచి వేడిని తగ్గిస్తాయి. 

 మధ్యాహ్నం పూట చల్లటి నీటితో ఇల్లు తుడవడం వల్ల నేలపై ఉన్న వేడి తగ్గి, గది ఉష్ణోగ్రత తగ్గుతుంది.

44
టెర్రస్‌ను చల్లగా ఉంచండి
Image Credit : Gemini AI

టెర్రస్‌ను చల్లగా ఉంచండి

ఇంటి పైకప్పు (టెర్రస్) నుంచే ఎక్కువ వేడి కిందికి దిగుతుంది. దీనికి పరిష్కారంగా, వేడిని ప్రతిబింబించే తెల్లటి పెయింట్ (రిఫ్లెక్టివ్ వైట్ పెయింట్) వేయించవచ్చు. వెదురు చాపలు పరచడం లేదా టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేయడం ఉత్తమం. సాయంత్రం పూట టెర్రస్‌పై నీళ్లు చల్లితే, కింది గదులు చాలా త్వరగా చల్లబడతాయి. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Related Stories
Recommended image1
Interesting Facts: చీకట్లో కూడా దోమలకు మనుషులు ఎలా కనిపిస్తారు?
Recommended image2
Mosquito: మీ బాల్కనీ ఈ మొక్కలు ఉంటే... ఇంట్లోకి ఒక్క దోమ కూడా అడుగుపెట్టదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved