MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Fish: చేపలకు చెవులు ఉంటాయా? ఎప్పుడైనా చూశారా? 99శాతం మందికి తెలియని నిజం..!

Fish: చేపలకు చెవులు ఉంటాయా? ఎప్పుడైనా చూశారా? 99శాతం మందికి తెలియని నిజం..!

Fish: చేపకు కళ్లు ఉంటాయని తెలుసు.. కానీ.. చేపలకు చెవులు కూడా ఉంటాయా? మీరు ఎప్పుడైనా చూశారా? చేపలకు మనం మాట్లాడే మాటలు కూడా వినపడతాయా?  అసలు చేపలు ఎలా వింటాయి? 

2 Min read
Author : ramya Sridhar
Published : May 20 2026, 12:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
fish
Image Credit : Asianet News

fish

చేపల కూర రుచిలో అద్భుతంగా ఉంటుంది.పులుసు పెట్టినా, ఫ్రై చేసినా.. చేపలను ఇష్టంగా తినేవాళ్లు చాలా మంది ఉంటారు. అయితే... మార్కెట్లో చేపలు కొన్నప్పుడు వాటి కళ్లు మనకు క్లియర్ గా కనిపిస్తూనే ఉంటాయి. కానీ, ఎప్పుడైనా చెవులు చూశారా? అసలు.. చేపలకు చెవులు ఉంటాయా? ఉంటే ఎక్కడ ఉంటాయి? వాటికి మనుషుల్లాగే అన్నీ వినపడతాయా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
చేప చెవులు ఎక్కడ ఉంటాయి?
Image Credit : Asianet News

చేప చెవులు ఎక్కడ ఉంటాయి?

మనకు చేప కళ్లు క్లియర్ గా కనపడతాయి. కానీ, కళ్లు ఉన్నట్లే... చేపలకు చెవులు కూడా ఉంటాయి. కానీ మన మనుషుల్లాగా, ఇతర జంతువుల్లాగా అవి బయటి నుంచి కనపడవు. చేపలకు వాటి తల లోపల, కళ్ల వెనక లోపల రెండు చెవులు ఉంటాయి. చేపలు నీటిలో జీవించే జంతువులు. నీటిలో ధ్వని వేగంగా ప్రయాణిస్తుంది కాబట్టి.. నీటి అడుగున చిన్న చిన్న కదలికలను గమనించడానికి, శబ్దాలను గుర్తించడానికి వాటికి ఈ చెవులు ఉపయోగపడతాయి.

అంతేకాకుండా.. అంతేకాకుండా, చేపల శరీరానికి ఇరువైపులా “లాటరల్ లైన్” (Lateral Line) అనే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఇది నీటిలో ఏర్పడే అలలు, వైబ్రేషన్లను గుర్తిస్తుంది. దూరం నుంచి శత్రువు వస్తున్నాడా? ఎవరైనా ఎర వేస్తున్నారా? చుట్టూ ఇతర చేపలు ఎలా కదులుతున్నాయి? వంటి విషయాలను ఇవి ఈ వ్యవస్థ సహాయంతోనే తెలుసుకుంటాయి.

Related Articles

Related image1
Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?
Related image2
Indian Railway: రైలులో సీట్లు బ్లూ కలర్ లోనే ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనక రీజన్ ఇదే
33
చేపల్లో ఉండే మరో స్పెషాలిటీ...
Image Credit : Asianet News

చేపల్లో ఉండే మరో స్పెషాలిటీ...

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, కొన్ని చేపలు చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలను కూడా వినగలవు. కొన్ని జాతుల చేపలు ఒకదానితో ఒకటి సంకేతాలు ఇచ్చుకునేందుకు శబ్దాలను కూడా ఉపయోగిస్తాయి. ఉదాహరణకు, కొన్ని చేపలు ప్రమాదం వచ్చినప్పుడు ప్రత్యేక వైబ్రేషన్లు విడుదల చేస్తాయి. వాటిని గుర్తించి మిగతా చేపలు వెంటనే అప్రమత్తమవుతాయి.

చేపల చెవుల్లో “ఒటోలిత్స్” (Otoliths) అనే చిన్న రాళ్లలాంటివి ఉంటాయి. ఇవి చేపలకు సమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి. మనుషుల్లో చెవులు శరీర బ్యాలెన్స్‌కు సహాయపడినట్లే, చేపల్లో కూడా ఈ భాగం అదే పని చేస్తుంది. దీంతో చేపలు నీటిలో సులభంగా దిశ మార్చుకుని ఈదగలుగుతాయి.

అంటే చేపలకు బయటికి కనిపించే చెవులు లేకపోయినా, వాటి వినికిడి శక్తి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నీటిలో జీవించడానికి అవసరమైన ప్రతి చిన్న మార్పును గుర్తించేలా ప్రకృతి వాటిని ప్రత్యేకంగా రూపొందించింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Sandal Anklets: అమ్మాయిల చెప్పులకు జతగా పట్టీలు.. అందమైన పాదాల కోసం
Recommended image2
Vastu Tips For Wealth: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే ఈ 5 చేస్తే చాలు!
Recommended image3
Extramarital affair: మీ భర్త ఇలా ప్రవర్తిస్తుంటే అతనికి అక్రమ సంబంధం ఉన్నట్టే.. చెబుతున్న కపుల్స్ థెరపిస్ట్
Related Stories
Recommended image1
Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?
Recommended image2
Indian Railway: రైలులో సీట్లు బ్లూ కలర్ లోనే ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనక రీజన్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved