MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Interesting Facts: చీకట్లో కూడా దోమలకు మనుషులు ఎలా కనిపిస్తారు?

Interesting Facts: చీకట్లో కూడా దోమలకు మనుషులు ఎలా కనిపిస్తారు?

Interesting Facts: చిమ్మ చీకట్లో మనకు కళ్లు కూడా కనిపించవు. కానీ..ఎంత చీకట్లో అయినా కూడా దోమలు మనల్ని పసిగట్టేస్తాయి. మరి, ఈ చీకట్లో దోమలకు అసలు మనం ఎలా కనిపిస్తాం..? అవి మనల్ని కరెక్ట్ గా ఎలా కుడతాయి? 

2 Min read
Author : ramya Sridhar
Published : May 11 2026, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Mosquito
Image Credit : Asianet News

Mosquito

రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు చెవుల్లో శబ్ధం చేస్తూ... దోమలు తిరుగుతూ ఉంటాయి. మన నిద్ర పాడు చేయ్యడమే కాకుండా.. ఎక్కడ పడితే అక్కడ మనల్ని కుట్టేస్తూ ఉంటాయి. అసలు.. అంత చీకటిలో కూడా ఒక దోమ మనల్ని అంత కచ్చితంగా ఎలా పసిగడుతుంది? చిమ్మ చీకట్లో మనకే కళ్లు సరిగా కనిపించవు.. మరి దోమలకు ఎలా కనిపిస్తాయి? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంతేకాదు.. కొందరిని మాత్రమే దోమలు ఎక్కువగా కుడతాయి. కొందరిని అసలు కుట్టవు.. దీని వెనక కూడా సైంటిఫిక్ రీజన్ ఉందని మీకు తెలుసా? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం....

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
చీకటిలో దోమలు మనల్ని ఎలా గుర్తుపడతాయంటే...
Image Credit : Pixabay

చీకటిలో దోమలు మనల్ని ఎలా గుర్తుపడతాయంటే...

మనం శ్వాస తీసుకున్న ప్రతిసారీ కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తాం. చీకటిలో దోమలకు కూడా మనం కనిపించకపోయినా.. మనం విడుదల చేసే కార్బన్ డైయాక్సైడ్ ని మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తాయి. దీని కారణంగా.. ఈ దోమలు మనల్ని చాలా ఈజీగా పసిగట్టేస్తాయి. వెంటనే వచ్చి మనల్ని కుట్టి.. రక్తం తాగేస్తాయి.

శరీర ఉష్ణోగ్రత...

దోమలకు కొన్ని ప్రత్యేక సెన్సార్లు ఉంటాయి. ఆ సెన్సార్లను ఉపయోగించి.. మన శరీరంలో వేడిని అవి గుర్తుపడతాయి. చీకటిలో కూడా మన శరీరం నుంచి వెలువడే వేడిని దోమలు పసిగడతాయి. అందుకే..వెంటనే వచ్చి ఈజీగా మనల్ని కుట్టగలవు.

శరీరం నుంచి వెలువడే కెమికల్స్...

మన మనుషుల చర్మం నుంచి దోమలకు నచ్చే రసాయనాలు కొన్ని విడుదల అవుతాయి. అవి లాక్టిక్ యాసిడ్, అమ్మోనియా, ఇతర సహజ సమ్మేళనాల ద్వారా ఈ దోమలను మనల్ని ఈజీగా గుర్తుపడతాయి. ప్రతి వ్యక్తికీ కొద్దిగా భిన్నమైన శరీర వాసన ఉంటుంది. ఆ వాసనను ఆధారం చేసుకొని దోమలు మనుషులను కుడతాయి.

Related Articles

Related image1
Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు
Related image2
Alcohol: మందు బాటిల్ ఒక్కసారి తెరిస్తే...ఎన్ని రోజుల్లో తాగేయాలో తెలుసా?
33
 కొందరిని మాత్రమే ఎందుకు ఎక్కువగా కుడతాయి..?
Image Credit : Pixabay

కొందరిని మాత్రమే ఎందుకు ఎక్కువగా కుడతాయి..?

దోమలు అందరినీ ఒకే విధంగా ఆకర్షించవు. ఒక్కొక్కరి శరీరం నుంచి ఒక్కో ప్రత్యేకమైన వాసన ఉంటుంది. చమట, ఇతర రసాయనాల ద్వారా మనల్ని చాలా సులభంగా ఆకర్షిస్తాయి. మన శరీరంలోని ఇన్ఫెక్షన్లు వాటి వల్ల కూడా మన శరీర వాసన మారుతుంది. వాటి ఆధారంగా.. ఆ వాసనలు కనుక దోమలకు బాగా నచ్చితే.. వారిని ఎక్కువగా కుడతాయి.

రాత్రిపూటే దోమలు ఎక్కువగా ఎందుకు కుడతాయి..?

చాలా రకాల దోమల రకాలు పగటి కంటే.. రాత్రిపూటే ఎక్కువగా చురుకుగా ఉంటాయి. మనుషులు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు... వారి శరీరం నుంచి ఆహారం తీసుకోవడానికి దోమలు చాలా ఎక్కువగా ఇష్టపడతాయి. ఆ సమయంలో మనుషులు కదలకుండా ఉంటారు కాబట్టి.. వాటికి ఆహారం తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అందుకే.. పగలు కంటే రాత్రిపూట ఎక్కువగా కుడతాయి. అయితే.. ఈ దోమ కాటును ఈజీగా తీసుకోకూడదు. వీటి వల్ల మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే.. దోమలు నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
lemon Chia Drink: ప్రతిరోజు నిమ్మరసంలో ఒక స్పూను చియా గింజలు వేసి తాగండి, ఇది ఒక మ్యాజిక్ డ్రింక్
Recommended image2
Gold Earrings: 3 గ్రాముల్లో బంగారు కమ్మలు.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్!
Recommended image3
Green Tea: 14 రోజులు గ్రీన్ టీ తాగితే జరిగే మ్యాజిక్ ఇదే
Related Stories
Recommended image1
Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు
Recommended image2
Alcohol: మందు బాటిల్ ఒక్కసారి తెరిస్తే...ఎన్ని రోజుల్లో తాగేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved