MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • River: మన దేశంలో బంగారం దొరికే ఏకైక నది ఇది, వెతికితే మీకు కూడా దొరుకుతుంది..!

River: మన దేశంలో బంగారం దొరికే ఏకైక నది ఇది, వెతికితే మీకు కూడా దొరుకుతుంది..!

River: నదిలో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని మనకు తెలుసు. కానీ, పుణ్యంతో పాటు బంగారం కూడా దొరికితే ఎలా ఉంటుంది? అన్ని నదుల్లో కాదు కానీ, ఈ నదిలో మాత్రం ఈజీగా బంగారం దొరుకుతుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 04 2026, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బంగారం దొరికే నది...
Image Credit : Gemini ai

బంగారం దొరికే నది...

భారతదేశంలో నదులను మనం దేవతలుగా పూజిస్తాం. సాధారణంగా నదులు అనగానే మనకు నీరు, ఇసుక, చుట్టూ పచ్చని చెట్లే గుర్తుకు వస్తాయి. కానీ, జార్ఖండ్ లో ప్రవహించే ఓ నది మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ నీటిలో కాదు.. నదిలోని ఇసుకలో బంగారం దొరుకుతుంది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఈ నది విశేషాలు ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ నది పేరు ఏంటి? ఈ పేరు ఎలా వచ్చింది..?
Image Credit : Gemini ai

ఈ నది పేరు ఏంటి? ఈ పేరు ఎలా వచ్చింది..?

ఈ అద్భుతమైన నది పేరు స్వర్ణ రేఖ. స్వర్ణం అంటే బంగారం, రేఖ అంటే గీత లేదా ధార అని అర్థం. అంటే, ఈ పేరుకు తగ్గట్టుగానే ఇది ఇసుకలో బంగారు రేణువులు లభిస్తాయి. నదిలో బంగారం దొరుకుతుంది అంటే.. మొత్తం బంగారం ఉంటుందని కాదు. అలా అని పెద్ద పెద్ద బంగారు ముక్కలు దొరుకుతాయి అనుకుంటే కూడా పొరపాటే. నది ఇసుకలో అతి సూక్ష్మమైన పేపర్ గోల్డ్ రూపంలో బంగారు రేణువులు కనిపిస్తాయి. నది ప్రవాహం వల్ల బంగారం కలిగిన రాళ్లు కాలక్రమేనా అరిగిపోతూ ఉంటాయి. అలా విడిపోయిన భారమైన బంగారు కణాలు ఇసుక, మట్టితో కలిసి నది అడుగున పేరుకుపోతాయని పరిశోధకులు చెబుతున్నారు.

33
బంగారం కోసం వేట ఎలా సాగుతుంది..?
Image Credit : Gemini ai

బంగారం కోసం వేట ఎలా సాగుతుంది..?

ఈ నది ఇసుకలో బంగారు కణాలు లభిస్తుండటంతో, స్థానికులు కొందరు సంప్రదాయ పద్ధతుల్లో ఇసుకను వడకట్టి ఈ చిన్న బంగారు రేణువులను వేరు చేసేవారు. కానీ, ఇక్కడ దొరికే బంగారంతో కోటీశ్వరులు అయిపోతాం అనుకుంటే పొరపాటే. అంత ఎక్కువ మొత్తంలో మాత్రం దొరకదు. కానీ, వెతికితే మాత్రం ఎంతో కొంత బంగారం మాత్రం ఈజీగా దొరుకుతుంది.

ఈ నదిలోకి బంగారం ఎలా వచ్చింది..?

జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ ప్రాంతం బంగారం ఖనిజీకరణకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలోని రాళ్లు సహజంగా అరిగిపోవడం వల్ల వాటిలోని బంగారు కణాలు నీటి ప్రవాహంతో కదిలి వచ్చి నది ఇసుకలో చేరుతుంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. నీటిలో బంగారం పారడం కాకపోయినా.. ఇసుకలో సూక్ష్మ బంగారు రేణువులను మోసుకెళ్లే ఈ అద్భుత నది మన దేశంలోనే ఉండటం నిజంగా గ్రేట్ కదూ.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Generic Medicine: జనరిక్ మెడిసిన్ అంటే ఏమిటి? జనరిక్ మందులకు, బ్రాండెడ్ మందులకు తేడా ఏమిటి?
Recommended image2
Lost Rivers India: ఇండియాలో కనిపించకుండా మాయమైపోయిన నదులు ఇవి.. అసలు కారణాలు ఏంటి?
Recommended image3
DMart: సూపర్ మార్కెట్లో క్యారీ బ్యాగ్ కు డబ్బులు కడుతున్నారా? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి
Related Stories
Recommended image1
Snake: ఒకే ఒక్క విషయంలో పక్షిలా ప్రవర్తించే పాము ఏదో తెలుసా?
Recommended image2
Potato: ఆకుపచ్చ గా మారిన బంగాళ దుంపలు తింటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved