MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pressure Cooker: కుక్కర్ లో అన్నం, పప్పు పొంగుతున్నాయా? ఎంత నీరు పోస్తే సరిగా ఉడుకుతాయో తెలుసా?

Pressure Cooker: కుక్కర్ లో అన్నం, పప్పు పొంగుతున్నాయా? ఎంత నీరు పోస్తే సరిగా ఉడుకుతాయో తెలుసా?

Pressure Cooker: కుక్కర్ లో పప్పు కానీ, అన్నం కానీ వండుతున్నప్పుడు ఒక్కోసారి వాటర్ లీక్ అయ్యి.. స్టవ్ మొత్తం పడిపోతుంది. కిచెన్ మొత్తం పాడైపోతుంది. ఒక్కోసారి పప్పు కూడా ఉడకదు.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 02 2026, 01:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కుక్కర్ పొంగుతోందా?
Image Credit : Pixabay

కుక్కర్ పొంగుతోందా?

ప్రెజర్ కుక్కర్ లో వంట చేయడం చాలా సులభం. కానీ, పప్పు లేదా అన్నం కుక్కర్ లో వండినప్పుడు పొంగిపోతుంది. దాని వల్ల స్టవ్ అంతా పాడైపోతుంది. అసలు కుక్కర్ ఎందుకు పొంగుతుంది? పప్పుకీ, అన్నానికీ నీళ్లు ఎంత పోయాలి? ఎలా వండితే.. కుక్కర్ పొంగకుండా సరిగా ఉడుకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

కుక్కర్ లో అన్నం, పప్పు ఎందుకు పొంగుతాయి..?

చాలా మంది కుక్కర్ లో అన్నం లేదా పప్పు వండుతున్నప్పుడు గిన్నె నిండా నీళ్లు పోస్తూ ఉంటారు. ప్రెజర్ కుక్కర్ లో ఆవిరి లోపలే బంధించి పీడనాన్ని సృష్టిస్తుంది. కాబట్టి, సాధారణ పాత్రలో వండినప్పుడు ఎంత నీరు అవసరం అవుతుందో.. అంత నీరు.. ప్రెజర్ కుక్కర్ లో అవసరం రాదు. కాస్త తక్కువ నీరు సరిపోతుంది. ఇది తెలియక నార్మల్ గా నీరు ఎక్కువ పోయడం వల్ల.. విజిల్ లేదా రబ్బర్ దగ్గర అడ్డంకులు ఉండటం వల్ల ఆవిరి తో పాటు నీరు బయటకు వచ్చేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అన్నం వండటానికి ఎంత నీరు పోయాలి?
Image Credit : Instagram

అన్నం వండటానికి ఎంత నీరు పోయాలి?

అన్నం మెత్తగా అవ్వకుండా, పలుకుగా, పొడి పొడిగా ఉడకాలంటే... నీరు పోసేటప్పుడు జాగ్రత్త పడాలి. దాని కోసం.. ఒక కప్పు తెల్ల బియ్యానికి సుమారు 1.5 నుంచి 2 కప్పుల నీరు సరిపోతుంది. బాస్మతీ రైస్ అయితే ఇంకాస్త నీరు తక్కువ అవసరం అవుతుంది. మీరు ముందుగానే బియ్యం నానపెట్టినా కూడా నీళ్లు తక్కువగా అవసరం అవుతాయి. అన్నం వండేటప్పుడు పొంగకుడా ఉండాలంటే.. బియ్యంలో కొద్దిగా నూనె లేదా నెయ్యి కొన్ని చుక్కలు వేస్తే సరిపోతుంది.

పప్పు వండేటప్పుడు ఎంత నీరు పోయాలి?

పప్పు ఉడికేటప్పుడు ఎక్కువ నురుగు వస్తుంది కాబట్టి ఇది ఎక్కువగా పొంగుతుంది. దీన్ని నివారించడానికి, పప్పును వండేటప్పుడు, దాని పరిమాణానికి తగినట్లుగా నీటిని మితంగా పోయాలి. పప్పును ముందుగానే నానబెట్టినట్లయితే, ఉడకడానికి తక్కువ నీరు పడుతుంది కాబట్టి నీటి పరిమాణాన్ని కొద్దిగా తగ్గించాలి. నురుగు వచ్చి పొంగకుండా ఉండటానికి పప్పు ఉడికించే కుక్కర్లో కొద్దిగా నూనె లేదా కొద్దిగా నెయ్యి వేస్తే సరిపోతుంది.

33
అన్నం, పప్పు పొంగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Image Credit : stockPhoto

అన్నం, పప్పు పొంగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఎక్కువ నీరు పోయవద్దు: ప్రెషర్ కుక్కర్‌కు సాధారణ గిన్నెలలా ఎక్కువ నీరు అవసరం లేదు, కాబట్టి మోతాదు మించకండి.

నిండుగా నింపకండి: కుక్కర్‌ను ఎప్పుడూ దాని గరిష్ట సామర్థ్యానికి మించి నింపకూడదు. ముఖ్యంగా పొంగే పదార్థాలు వండేటప్పుడు సగం కంటే తక్కువగానే ఉంచాలి.

మంటను అదుపులో ఉంచండి: కుక్కర్‌ను నిరంతరం అధిక మంట మీద ఉంచడం వల్ల లోపల వేగంగా నురుగు వచ్చి విజిల్ ద్వారా బయటకు వస్తుంది. మీడియం మంటపై ఉడికించడం ఉత్తమం.

శుభ్రత ముఖ్యం: విజిల్ ప్రాంతం, గాస్కెట్ ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tamannaah: తల్లిగా తన కోరికని బయట పెట్టిన తమన్నా.. అమ్మలా అస్సలు ఉండనంటూ బోల్డ్ స్టేట్ మెంట్
Recommended image2
శివుడు పార్వతీ దేవి ఒడిలో నిద్రిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
Recommended image3
రాత్రిపూట బొప్పాయి తినకూడదా? తింటే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
Motivational Story: నాలో ఒక్క టాలెంట్ కూడా లేదు అని ఫీల్ అవుతున్నారా? మీ కళ్లు తెరిపించే కథ ఇది
Recommended image2
సముద్రం మధ్యలో శివాలయం... దేవుడి దర్శనం ఎలా చేసుకుంటారో తెలుసా? ఈ ఆలయం ఎక్కడుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved