Tips and Tricks: ఇదొక్కటి కలిపితే చాలు.. మీ బియ్యం, పప్పులకు పురుగులు పట్టవు..!
మనం డబ్బాల్లో దాచిన పప్పులు, బియ్యం పై కీటకాలు, పురుగులు దాడి చేయడం మొదలుపెడతాయి. అందుకే, ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

బియ్యానికి పురుగులు పట్టాయా?
వర్షాకాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.వాతావరణం ఇలా ఉన్నప్పుడు మనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ, ఈ కాలంలో చాలా రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. కేవలం ఆరోగ్యం విషయంలో మాత్రమే కాదు... ఆహార పదార్థాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. ఈ కాలంలో వాతావరణంలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేమ కారణంగా.. చాలా రకాల ఆహార పదార్థాలు చెడిపోవడం మొదలౌతుంది. ముఖ్యంగా కీటకాల దాడి చాలా ఎక్కువగా ఉంటుంది. మనం డబ్బాల్లో దాచిన పప్పులు, బియ్యం పై కీటకాలు, పురుగులు దాడి చేయడం మొదలుపెడతాయి. అందుకే, ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. మరి.. ఎంత కాలం అయినా.. బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
సింపుల్ చిట్కాలు..
వర్షాకాలంలో బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలలో కీటకాలు పుట్టుకువస్తాయి. ఒక్కసారి పురుగులు పడ్డాయంటే వాటిని తొలగిండచం అంత సులువేమీ కాదు. కానీ, మనం కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. చాలా మంది మార్కెట్లో దొరికే ఏవేవో పౌడర్లు తెచ్చి బియ్యం, పప్పుల్లో వేస్తూ ఉంటారు. కానీ.. అవి ఆహారాన్ని కలుషితం చేస్తాయి. అవి లేకుండా..కూడా సహజంగా మనం ఈ పురుగులను తరిమికొట్టచ్చు.
వర్షాకాలంలో ఆహార ధాన్యాలు చెడిపోకుండా ఎలా కాపాడుకోవాలి?
వర్షాకాలంలో ధాన్యాలు చెడిపోకుండా, పురుగులు , కీటకాల నుండి కాపాడటానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం 10 రూపాయల విలువైన వస్తువు మీ సమస్యను పరిష్కరిస్తుంది. దీని కోసం, మీరు మార్కెట్ నుండి ముడి పసుపు ముద్దను తీసుకురావాలి. ఇప్పుడు ముడి పసుపును ఒక రోజు ఎండలో ఆరబెట్టండి, తద్వారా దాని తేమ బయటకు పోతుంది. తర్వాత మీరు ముడి పసుపు ముక్కలను కోయాలి. దీని తర్వాత, ఒక కాటన్ వస్త్రాన్ని తీసుకొని దానిలో ఓ నాలుగు ముడి పసుపు ముక్కలను వేసి ఒక మూటలాగా కట్టాలి. ఈ మూటలను బియ్యం, గోధుమలు, పప్పుల డబ్బాలలో వేస్తే సరిపోతుంది. ఈ పసుపు వాసనకు బియ్యం, పప్పులకు పురుగులు పట్టవు. ఒకవేళ ఆల్రెడీ పురుగులు ఉన్నా కూడా..వాటి వాసనకు పారిపోతాయి.
ఇతర చిట్కాలు...
మీకు పసుపు అందుబాటులో లేకపోతే.. గళ్ల ఉప్పును బియ్యంలో కలిపినా కూడా మీకు పురుగుల బెడద ఉండదు. అయితే.. ఆ బియ్యాన్ని వాడే సమయంలో ఉప్పు మొత్తం కరిగిపోయే వరకు శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక.. బియ్యం, పప్పులను నిల్వ చేసే డబ్బాలను పొడిగా ఉండేలా చూసుకోవాలి. వాటికి పొరపాటున కూడా తేమ తగలనివ్వకూడదు. ఎండు మిరపకాయలను వేసినా కూడా పురుగులు పారిపోతాయి.