- Home
- Life
- Fridge Cleaning: ఈ సూపర్ టిప్ తో ఫ్రిడ్జ్ వెజిటేబుల్ ర్యాక్ క్లీన్ చేసేయండి..ఇకపై బ్యాక్టీరియా రానే రాదు
Fridge Cleaning: ఈ సూపర్ టిప్ తో ఫ్రిడ్జ్ వెజిటేబుల్ ర్యాక్ క్లీన్ చేసేయండి..ఇకపై బ్యాక్టీరియా రానే రాదు
Fridge Cleaning: ఫ్రిడ్జ్‌లో కూరగాయలు పెట్టే డ్రాయర్ నుంచి దుర్వాసన వస్తోందా? తేమ, కూరగాయల వ్యర్థాల వల్ల అందులో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. ఖరీదైన క్లీనర్లు లేకుండానే, ఇంట్లోనే సులభమైన పద్ధతులతో డ్రాయర్‌ను శుభ్రంగా, వాసన లేకుండా పెట్టొచ్చు.

ఫ్రిడ్జ్ వెజిటబుల్ డ్రాయర్‌ను క్లీన్ చేసే టిప్స్
ఫ్రిడ్జ్‌లో కూరగాయలు పెట్టే ర్యాక్ నుంచి దుర్వాసన వస్తోందా? తేమ, కూరగాయల వ్యర్థాల వల్ల అందులో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. దీని కోసం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా శుభ్రంగా, వాసన లేకుండా క్లీన్ చేయొచ్చు. 2023లో 'ఫుడ్ మైక్రోబయాలజీ' జర్నల్ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. మనం ఇళ్లలో వాడే ఫ్రిడ్జ్ వెజిటబుల్ ర్యాక్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుందని ఆ స్టడీ తేల్చింది. కాబట్టి, ఫ్రిడ్జ్ ర్యాక్ ను కేవలం ఒక గుడ్డతో తుడిచేసి వదిలేయకూడదు. దాన్ని పక్కాగా క్లీన్ చేయాలి.
ఇంట్లో ఉండే వస్తువులే చాలు
ఖరీదైన కెమికల్స్ అవసరం లేకుండా, మన వంటగదిలో ఉండే వస్తువులతోనే ఫ్రిడ్జ్ ర్యాక్ ను ఈజీగా క్లీన్ చేయొచ్చు. ముందుగా అందులో ఉన్న కూరగాయలు, పండ్లను బయటకు తీయండి. కుళ్లిపోయిన వాటిని చెత్తబుట్టలో వేయండి. నెమ్మదిగా బయటకు తీయండి. రాకపోతే బలవంతంగా లాగకండి.
కొద్దిగా గోరువెచ్చని నీటిలో డిష్ వాష్ లిక్విడ్ కలపండి. మైక్రోఫైబర్ క్లాత్ లేదా సాఫ్ట్ స్పాంజ్ తీసుకుని ర్యాక్ లోపల, అడుగు భాగం అంతా తుడవండి. జిడ్డు మరకలు ఉంటే, సబ్బు నీటిలో ముంచిన గుడ్డను కాసేపు ఆ మరకలపై ఉంచి ఆ తర్వాత తుడిస్తే ఈజీగా పోతాయి.
బేకింగ్ సోడాతో చెక్
కూరగాయలు, పండ్ల వ్యర్థాల వల్ల వచ్చే చెడు వాసనను బేకింగ్ సోడా ఇట్టే మాయం చేస్తుంది. గోరువెచ్చని నీటిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా కలిపి, ఆ నీటితో ర్యాక్ ను తుడవండి. మొండి మరకలను నెమ్మదిగా రుద్ది, ఆ తర్వాత సబ్బు పోయేలా శుభ్రమైన నీటితో కడగాలి.
ర్యాక్ హ్యాండిల్స్, మూలల్లో మురికి ఈజీగా దాక్కుంటుంది. వీటిని క్లీన్ చేయడానికి పాత టూత్ బ్రష్ లేదా సాఫ్ట్ బ్రష్ వాడటం బెస్ట్. గట్టి మరకలపై సబ్బు నీరు రాసి కాసేపు నాననిచ్చి రుద్దండి. కానీ పదునైన వస్తువులతో అస్సలు గీకకండి.
కేవలం కడిగి వదిలేస్తే సరిపోదు. అది ఉండే ఫ్రిడ్జ్ అడుగు భాగం, పక్క గోడలపై కూడా మురికి ఉంటుంది. గోరువెచ్చని సబ్బు నీటితో ఆ ప్రదేశాలను తుడిచి, ఆ తర్వాత తడి గుడ్డతో క్లీన్ చేయండి.
ఇలా చేస్తున్నప్పుడు ఫ్రిడ్జ్ ఎలక్ట్రికల్ పార్ట్స్, గాలి వచ్చే రంధ్రాల్లోకి నీళ్లు వెళ్లకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. చివరగా పొడి గుడ్డతో తడి లేకుండా పూర్తిగా తుడిచేయాలి.
ఆరబెట్టడం, రెగ్యులర్ మెయింటెనెన్స్
కడిగిన ర్యాక్ ను తడి ఆరకముందే ఫ్రిడ్జ్‌లో పెడితే ఫంగస్ పెరగడానికి మనమే ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. శుభ్రమైన గుడ్డతో తుడిచి, గాలి తగిలే చోట పూర్తిగా ఆరబెట్టాలి. ఫ్రిడ్జ్ లోపల, డ్రాయర్ పూర్తిగా ఆరిన తర్వాతే మళ్లీ సెట్ చేయాలి.
నెలకు ఒక్కసారైనా ఇలా పూర్తిగా క్లీన్ చేయడం అలవాటు చేసుకోండి. కడిగిన కూరగాయలను తడి ఆరకముందే ర్యాక్లో ఎక్కువసేపు ఉంచకండి. ఫ్రిడ్జ్‌లో ఏదైనా ఒలికిపోతే వెంటనే గోరువెచ్చని సబ్బు నీటితో తుడిచేయాలని ఫుడ్ సేఫ్టీ నిపుణులు చెబుతున్నారు.

