- Home
- Life
- Nita Ambani Necklace: నీతా అంబానీ రేంజ్ ఇది..ఆమె ఒక్క నక్లెస్ తయారీకే మూడేళ్లు.. ఎంటో అంత స్పెషల్?
Nita Ambani Necklace: నీతా అంబానీ రేంజ్ ఇది..ఆమె ఒక్క నక్లెస్ తయారీకే మూడేళ్లు.. ఎంటో అంత స్పెషల్?
Nita Ambani: నీతా అంబానీ వినాయకచవితికి దగదగ మెరిసిపోయారు. ఆరెంజ్ కలర్ చీరలో, కవచం లాంటి నెక్లెస్ ధరించి మహారాణిలా కనిపించారు. చాలా మంది అది నెక్లెస్సా, బ్లౌజ్ డిజైనా అని సందేహించారు. కానీ దాని వెనుక డిటైయిలింగ్ తెలిస్తే మాత్రం ఆశ్వర్యపోవాల్సిందే.

వినాయక చవితి వేడుకల్లో నీతా స్పెషల్ ఎంట్రీ
నీతా అంబానీ అంటేనే ఒక యూనిక్ స్టైల్. తన కాస్ట్యూమ్స్, చీరలు, మేకప్ తో ఆశ్చర్యపరుస్తుంటారు. ఎప్పుడూ డిఫరెంట్ గా కనిపిస్తారు. ఇంక ఈవెంట్లు, వేడుకలు, పండుగలప్పుడైతే చెప్పనక్కర్లేదు. ఆమెనే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. నీతా అంబానీ ఎప్పటిలాగే ఈసారి వినాయక చవితి వేడుకల్లో రాయల్ లుక్ లో కనిపించారు. ఆరెంజ్, పింక్ కలర్ ఓంబ్రే సిల్క్ చీరను ధరించిన ఆమె..దానికి భారీ సైజులో ఉన్న బంగారు నెక్లెస్ ను జత చేశారు. కవచంలా కనిపించే ఈ నెక్లెస్ ఆమె లుక్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ నెక్లెస్ ప్రత్యేకత ఏంటీ?
ఈ నగను ఆమ్రపాలి భారతం అంటారు. నగ తయారు చేయడానికి 3 ఏళ్లు పట్టిందట. అంతేకాదు 14 మంది స్వర్ణ కారులు తయారు చేశారు. ఎందుకు ఇంత స్పెషల్ అంటే...పై భాగం కేరళ నెక్లెస్ స్టైల్లో ఉంటుంది. కిందనంతా దక్షిణ భారత నగల డిజైన్ ఉంటుంది. ఆ తర్వాత ముత్యాలు, జాతిరత్నాలు పొదిగారు.
సోషల్ మీడియాలో వైరలవుతున్న నీతా అంబానీ నెక్లెస్
ఈ మాస్టర్ పీస్ లో కేరళకు చెందిన పాతకాలపు హారాలు, నత్తలు, జూమర్లు, జుంకాలు, బద్లా, చాంద్ బాలీ వంటి దక్షిణ భారత నగల డిజైన్లను ఉపయోగించారు. వింటేజ్ ఆభరణాల మధ్య ఉన్న ఖాళీలను నింపేందుకు ముత్యాలు, వజ్రాలు, కెంపులు, ఆకుపచ్చ రత్నాలను కూడా పొదిగారు.
నీతా అంబానీ కంటే ముందు బాలీవుడ్ నటి సోమన్ కపూర్ కూడా ఆమ్రపాలి భారతం నెక్లెస్ ధరించారంట. ఇప్పుడు వినాయక చవితి వేడుకల్లో నీతా అంబానీ ధరించడంతో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
దేనికదే ప్రత్యేకత
నీతా అంబానీ వేసుకునే నగలకు ఒక్కో దానికి ప్రత్యేకత ఉంటుంది. దేనికదే అద్భుతమని చెప్పొచ్చు. మహారాష్ట్ర మహిళగా.. దక్షిణ భారత దేశానికి చెందిన నగల శైలిలో నెక్లెస్ ను తయారు చేయించారు. ఈ ఒక్క నగలోనే చరిత్రను చూపించారు. న్యూ మోడల్ లో రూపొందించారు. అటు చరిత్ర, ఇటు స్టైల్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ నెక్లెస్ ను తయారు చేయించారు.

