MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • lemon Chia Drink: ప్రతిరోజు నిమ్మరసంలో ఒక స్పూను చియా గింజలు వేసి తాగండి, ఇది ఒక మ్యాజిక్ డ్రింక్

lemon Chia Drink: ప్రతిరోజు నిమ్మరసంలో ఒక స్పూను చియా గింజలు వేసి తాగండి, ఇది ఒక మ్యాజిక్ డ్రింక్

lemon Chia Drink: చియా గింజలను సూపర్ ఫుడ్ గా చెప్పుకుంటారు. ఇక నిమ్మరసంలో ఉండే ఆరోగ్యమైన లక్షణాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రెండింటి కాంబినేషన్లో ప్రతిరోజు డ్రింక్ చేసుకుని తాగితే ఏమవుతుందో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 11 2026, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నిమ్మ చియా మ్యాజిక్ డ్రింక్
Image Credit : Getty

నిమ్మ చియా మ్యాజిక్ డ్రింక్

నిమ్మరసం, చియా గింజలు.. ఈ రెండూ కలిసిన మిశ్రమాన్ని సూపర్ డ్రింక్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కేవలం శరీరానికి విశ్రాంతినివ్వడమే కాదు శరీరాన్ని లోపల నుండి డీటాక్సిఫికేషన్ చేస్తుంది. ప్రతిరోజు ఒక గ్లాసు నిమ్మరసంలో ఒక స్పూన్ చియా గింజలు కలుపుకొని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చియా గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫైబర్ ప్రోటీన్లు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని సూపర్ ఫుడ్ అని పిలుచుకుంటారు. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలంగా మారుస్తుంది. ప్రతిరోజు నిమ్మరసంలో ఒక స్పూను గింజలు కలుపుకొని నానబెట్టి తాగితే మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నిమ్మ, చియాలోని పోషకాలు
Image Credit : Getty

నిమ్మ, చియాలోని పోషకాలు

బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మరసం, చియా గింజల పానీయం ఒక వరం. చియా గింజల్లో పీచు అధికంగా ఉంటుంది. వీటిని నీటిలో నానబెట్టేటప్పుడు పది నుండి 12 రెట్లు నీటిని పీల్చుకొని జెల్ లాగా మారుతాయి. దీన్ని తాగడం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. అతిగా తినాలని కూడా అనిపించదు. ఇక నిమ్మకాయ నిమ్మరసంలోని గుణాలు శరీర జీవక్రియ వేగవంతం చేసి కొవ్వును కరిగిస్తాయి.

Related Articles

Related image1
Planetary transits: మే 22 నుంచి గ్రహ సంచారం వల్ల ఈ రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Related image2
AC Water: ఏసీ నీళ్లను పారబోయకుండా.. ఇన్ని రకాలుగా ఉపయోగించుకోండి
34
నిమ్మ చియా డ్రింకు తాగడం వల్ల లాభాలు
Image Credit : Getty

నిమ్మ చియా డ్రింకు తాగడం వల్ల లాభాలు

ఇప్పటి జీవితాల్లో మలబద్ధకం, అజీర్ణం సమస్యలు ఎక్కువైపోతున్నాయి. చియా గింజల్లో కరగని ఫైబర్ కూడా ఉంటుంది. ఇది మలవిసర్జనను సులభంగా చేస్తుంది. పేగులను శుభ్రపరుస్తుంది. నిమ్మరసం జీర్ణ సమయంలో ఎంజైమ్ ల ఉత్పత్తిని పెంచి ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మొత్తంగా పొట్ట ఆరోగ్యాన్ని ఈ పానీయం కాపాడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. ఇది కాలేయాన్ని బాగా పనిచేసేలా చేస్తుంది. శరీరం నుండి విష పదార్ధాలను తొలగించేలా చేస్తాయి. చియా గింజలతో కలిపి నిమ్మరసాన్ని తీసుకున్నప్పుడు రక్తాన్ని శుద్ధి చేసి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

44
చియా గింజలు వెరీ స్పెషల్
Image Credit : Getty

చియా గింజలు వెరీ స్పెషల్

చియా గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే హైబీపీని నియంత్రించడంలో కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. గుండె జబ్బులు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. నిమ్మరసం కలిపిన చియా గింజలను తాగడం వల్ల ఒక ఎలక్ట్రోలైట్ లాగా ఇది పనిచేసి.. వెంటనే శరీరానికి విశ్రాంతినిస్తాయి. చియా గింజలు నెమ్మదిగా శక్తిని విడుదల చేసి రోజంతా చురుకుగా ఉండేలా ఉంచుతాయి. ముఖ్యంగా జిమ్ కు వెళ్లే వారికి ఇది సూపర్ డ్రింక్ గా చెప్పుకోవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Recommended image2
Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!
Recommended image3
Sleep Problems: నిద్రలో పదేపదే మెలకువ వస్తోందా? ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి!
Related Stories
Recommended image1
Planetary transits: మే 22 నుంచి గ్రహ సంచారం వల్ల ఈ రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image2
AC Water: ఏసీ నీళ్లను పారబోయకుండా.. ఇన్ని రకాలుగా ఉపయోగించుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved