Lunch: బరువు తగ్గాలని మధ్యాహ్నం భోజనం మానేస్తున్నారా? ఏమౌతుందో తెలుసా?
Lunch: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది బరువు తగ్గాలనో లేదా పని ఒత్తిడి కారణంగానో మధ్యాహ్న భోజనం మానేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

Skipping Lunch
బరువు తగ్గాలంటే తిండి తినడం మానేయాలి అనే భావన చాలా మందిలో ఉంటుంది. దీనిలో భాగంగా చాలా మంది మధ్యాహ్న భోజనం మానేస్తూ ఉంటారు.కానీ, ఇలా లంచ్ స్కిప్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? ఆయుర్వేదం ఏం చెబుతుందో తెలుసుకుందాం...
జీర్ణ శక్తి ఎక్కువగా ఉండే సమయం...
ఆయుర్వేదం ప్రకారం, పగలు సూర్యుడు నడి నెత్తిపై ఉన్నప్పుడు ( మధ్యాహ్నం 12 నుండి 2 గంటల మధ్య) మన శరీరంలో జీర్ణ వ్యవస్థ అత్యంత బలంగా ఉంటుంది. ఈ సమయంలో తీసుకున్న ఆహారం చాలా వేగంగా, సమర్థవంతంగా జీర్ణమౌతుంది.అందుకే, ఈ సమయంలో భోజనం మానేయడం అంటే, మండుతున్న అగ్నిలో ఇంధనం వేయకపోవడం లాంటిదే. దీని వల్ల శరీరంలో ఎసిడిటీ మొదలౌతుంది.
గ్యాస్, ఎసిడిటీ సమస్యలు...
చాలా సేపు కడుపు ఖాళీగా ఉంచడం వల్ల శరీరంలో వాతం పెరుగుతుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయి. తీవ్రమైన ఎసిడిటీ, గుండెల్లో మంట కూడా వస్తుంది. దీనిని రోజూ కంటిన్యూ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది.
ఎనర్జీ తగ్గిపోతుంది...
మధ్యాహ్న సమయంలో శరీరానికి అత్యధిక శక్తి అవసరం. భోజనం మానేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి, విపరీతమైన నీరసం, తల తిరగడం, పనిపై ఏకాగ్రత దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి.
అతిగా తినే ప్రమాదం (Overeating at Night)
మధ్యాహ్నం ఆకలిని చంపుకోవడం వల్ల, సాయంత్రం లేదా రాత్రి వేళ విపరీతమైన ఆకలి వేస్తుంది. ఫలితంగా రాత్రి సమయంలో అవసరానికి మించి ఆహారం తీసుకుంటారు.ఆయుర్వేదం ప్రకారం రాత్రి పూట జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి రాత్రి పూట ఎక్కువగా తినడం వల్ల బరువు తగ్గకపోగా, మరింత పెరుగుతారు.
ఆయుర్వేదం ఏం చెబుతుంది..?
మధ్యాహ్నం రాజభోజనం: రోజులో తీసుకునే ఆహారంలో మధ్యాహ్న భోజనం కాస్త భారీగా (Heavy) ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే జీర్ణశక్తి అప్పుడు బలంగా ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు.

