Telugu

Ginger: ఇంట్లో కుండీలోనే అల్లం పెంచొచ్చు, ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు

Telugu

మంచి అల్లం ఎంచుకోవాలి..

అల్లం పెంచడానికి ముందుగా మంచి అల్లం కొమ్మును ఎంచుకోవాలి. అది ఎండిపోకుండా, తాజాగా, మొలకలు వచ్చేందుకు సిద్ధంగా ఉండాలి.

Image credits: instagram
Telugu

నీటిలో నానబెట్టాలి

ఎంచుకున్న అల్లం కొమ్మును 24 గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత దాన్ని 3-4 ముక్కలుగా కోయాలి. ప్రతి ముక్కకు కచ్చితంగా ఓ మొగ్గ (కన్ను) ఉండేలా చూసుకోవాలి.

Image credits: instagram
Telugu

మట్టి, ఎరువు ఎలా కలపాలి?

కుండీలో నింపేందుకు మట్టి మిశ్రమాన్ని ఇలా సిద్ధం చేసుకోవాలి.

40% గార్డెన్ మట్టి

30% కంపోస్ట్

20% కోకోపీట్

10% ఇసుక

Image credits: instagram
Telugu

కుండీలో నాటడం

సిద్ధం చేసుకున్న మట్టి మిశ్రమాన్ని కుండీలో నింపి, అందులో అల్లం ముక్కలను నాటాలి. తర్వాత పైనుంచి కొద్దిగా మట్టితో కప్పేయాలి.

Image credits: instagram
Telugu

నీళ్లు పోయడం

ప్రతిరోజూ తగినన్ని నీళ్లు పోయాలి. కానీ నీళ్లు ఎక్కువగా నిలిచిపోకుండా చూసుకోవాలి. అల్లం పంట చేతికి రావడానికి 8-10 నెలల సమయం పడుతుంది.

Image credits: instagram

Coriander Leaves: ఈ ట్రిక్స్ తో కొత్తిమీరను కుండీలో ఈజీగా పెంచవచ్చు!

Balcony Plants: బాల్కనీ కోసం బెస్ట్ పూల మొక్కలు

Garlic Farming: ఇంట్లోనే వెల్లుల్లి ఇలా సింపుల్‌గా పెంచేయండి

Money Plant: ఇదొక్క పొడి వేస్తే మనీ ప్లాంట్ బాగా పెరుగుతుంది..!