Fried Rice: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ తరచూ తింటున్నారా? అయితే మీకు జరిగేది ఇదే
Fried Rice: చైనీస్ ఫ్రైడ్ రైస్ ఎక్కువ మంది ఇష్టంగా తింటారు. ఉప్పగా, స్పైసీగా ఉండే ఈ వంటకం ఎంతో మందికి నచ్చుతుంది. కానీ దీన్ని తరచూ తింటే మాత్రం కొన్ని రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. వాటి గురించే ఇక్కడ ఇచ్చాము.

ఫ్రైడ్ రైస్ అంటే ఎందుకంత ఇష్టం?
ఫాస్ట్‌ఫుడ్ అంటేనే చెవికోసుకునే వారు ఎక్కువ. రోడ్డుపక్క స్టాళ్లలో, రెస్టారెంట్లలో దీన్ని ఆర్డర్ ఇచ్చి అధికంగా తింటున్నారు. అయితే ఫ్రైడ్ రైస్ అధికంగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉపయోగించే పదార్థాలు కూడా శరీరంపై ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తాయి. వారంలో రెండు మూడు సార్లు ఫ్రైడ్ రైస్ తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు టేస్టీగానే ఉంటుంది. కానీ శరీరంలో చేరాక మాత్రం అనారోగ్య సమస్యలు రాక తప్పవు.
బరువు పెరగడం
చైనీస్ ఫ్రైడ్ రైస్‌ను వండేందుకు ఎక్కువ నూనెను వినియోగిస్తారు. అందుకే కేవలం ఒక ప్లేట్ ఫ్రైడ్ రైస్‌లోనే 400–600 క్యాలరీలు ఉంటాయి. ఇది చాలా ఎక్కువ కేలరీలుగానే చెప్పుకోవాలి. ఇది రోజువారీ అవసరంతో పోలిస్తే ఈ క్యాలరీలు చాలా ఎక్కువ. ఈ ఫ్రైడ్ రైస్ తరచూ తినడం వల్ల శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయి బరువు పెరిగే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో, యువతలో అధికబరువు సమస్యలు పెరిగిపోతుంది. ఇలాంటి ఫాస్ట్‌ఫుడ్ తినడం చాలా ప్రమాదమని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
తలనొప్పి, అలసట
చైనీస్ వంటకాలలో మోనోసోడియం గ్లూటమేట్ (MSG) అనే ఫ్లేవర్ రసాయనాన్ని వాడుతారు. ఇది రుచిని పెంచుతుంది. అందుకే దీన్ని చైనీస్ వంటకాలలో వాడతారు.దీన్ని అధికంగా తీసుకుంటే తలనొప్పి, అలసట, ఛాతిలో మంట, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఇది అలెర్జీ లాంటి సమస్యలకు కూడా కారణం అవుతుంది. రోడ్డుపక్క స్టాళ్లలో అమ్మే ఫ్రైడ్ రైస్ లో ఎంత మోతాదులో ఈ MSG కలుపుతున్నారో మనకు తెలియదు. అందుకే ఇది శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
రక్తపోటు ప్రమాదం
ఫ్రైడ్ రైస్‌లో సోయాసాస్, చిల్లీ సాస్, వెనిగర్ వంటి పదార్థాలు ఎక్కువగా వాడతారు. వీటిలో ఉప్పు అధికంగా వాడతారు. ఇది సోడియం స్థాయిలను పెంచుతుంది. అధిక సోడియం శరీరంలో చేరడం వల్ల నీరు నిల్వ ఉండిపోతుంది. ఇది రక్తపోటును పెంచేస్తుంది. హై బీపీ ఉన్నవారు లేదా కుటుంబంలో బీపీ చరిత్ర ఉన్నవారు ఇలాంటి చైనీస్ ఫుడ్‌ను తినకూడదు. లేకుంటే ఆరోగ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
గుండెకు మంచి కాదు
ఫ్రైడ్ రైస్ నుకొన్నిసార్లు పాత బియ్యాన్ని మళ్లీ వేడి చేసి ఫ్రై చేస్తుంటారు. ఇది జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. అధిక ఆయిల్ వాడకం, మసాలాల వాడకం వలన అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, నొప్పి వంటి ఇబ్బందులు కలగవచ్చు. ఫ్రైడ్ రైస్‌లో వాడే నూనె ఎక్కువసార్లు వేడి చేసి మళ్లీ మళ్లీ ఉపయోగిస్తారు. ఈ విధంగా వేడి చేసిన నూనెలో ట్రాన్స్‌ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. దీనివల్ల గుండెకు హాని కలుగుతుంది. ట్రాన్స్‌ఫ్యాట్స్ అధికంగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. ధమనుల్లో బ్లాకులు ఏర్పడే ప్రమాదం కూడా పెరుగుతుంది. రోడ్డుపక్క చైనీస్ స్టాళ్లలో పరిశుభ్రత పాటించకపోవచ్చు. పాత బియ్యం, చీప్ ఆయిల్, అపరిశుబ్ర పాత్రలు వంటివి వాడడడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది.

