MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Chanakya Niti: 30 ఏళ్లు రాకముందే ఇవి నేర్చుకోవాలి, తర్వాత నేర్చుకోవాలన్నా నేర్చుకోలేరు..!

Chanakya Niti: 30 ఏళ్లు రాకముందే ఇవి నేర్చుకోవాలి, తర్వాత నేర్చుకోవాలన్నా నేర్చుకోలేరు..!

 Chanakya Niti: జీవితంలో విజయం సాధించడానికి చాణక్యుడు కొన్ని చిట్కాలు ఇచ్చాడు. ముఖ్యంగా చాణక్యుడి ప్రకారం.. 30 ఏళ్లు దాటకముందే ఐదు విషయాలు కచ్చితంగా నేర్చుకోవాలి. ఆ వయసు దాటిన తర్వాత నేర్చుకోవాలన్నా నేర్చుకోలేరేమో... 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 15 2026, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చాణక్య నీతి ఏం చెబుతోందంటే..
Image Credit : others

చాణక్య నీతి ఏం చెబుతోందంటే..

ఆచార్య చాణక్యుడు భారతదేశపు గొప్ప పండితుల్లో ఒకరు. ఆయన బోధించిన సూత్రాలు, జీవిత పాఠాలు నేటికీ మనకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఒక వ్యక్తి 30 ఏళ్ల వయసు రాకముందే కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటే, వారి భవిష్యత్తు జీవితం చాలా సులభంగా, విజయవంతంగా మారుతుందని చాణక్యుడు చెప్పాడు. మరి, చాణక్య నీతి ప్రకారం 30 దాటక ముందే నేర్చుకోవాల్సిన ఐదు విషయాలేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
  సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం..
Image Credit : chat gpt

సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం..

చాణక్యనీతి ప్రకారం.. సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోలేని వారు జీవితంలో గొప్ప అవకాశాలను వదులుకోవాల్సి వస్తుంది. యవ్వనంలో సమయాన్ని సరిగా వాడుకున్నవారు మాత్రమే.. జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు. తొందరగా విజయం సాధిస్తారు.

డబ్బును సరిగా మేనేజ్ చేయడం...

డబ్బు సంపాదించడమే కాదు, ఆదా చేయడం కూడా చాలా ముఖ్యం. చాణక్య నీతి ప్రకారం, ప్రతి ఒక్కరూ భవిష్యత్తు కోసం తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేయడం చిన్న వయసు నుంచే నేర్చుకోవాలి.మనీ మేనేజ్మెంట్ చేయడం వచ్చిన వారు చిన్న వయసులోనే ఆర్థికంగా గొప్ప స్థాయికి వెళ్లగలరు.

33
మంచి వ్యక్తులతో స్నేహం..
Image Credit : Chatgpt

మంచి వ్యక్తులతో స్నేహం..

మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో.. అదే మన జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఎల్లప్పుడూ మంచివారితో స్నేహం చేయాలి. చెడ్డ వారితో స్నేహం చేసేవారు జీవితంలో విజయాలు సాధించలేరు. ఈ విషయాన్ని చిన్న వయసులో తెలుసుకుంటే జీవితంలో తొందరగా సక్సెస్ అవుతారు.

ఎమోషన్స్ కంట్రోల్ లో ఉంచుకోవడం..

చాలా మందికి ఎమోషన్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవడం సరిగా తెలీదు. ఇలాంటి వారు కూడా లైఫ్ లో తొందరగా సక్సెస్ అవ్వరు. అందుకే.. ఒక వ్యక్తి సరైన సమయంలో తమ ఎమోషన్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవడం నేర్చుకుంటే.. జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. తమ ఎమోషన్స్ ని కంట్రోల్ ఉంచుకునేవారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు

నిరంతరం నేర్చుకోవాలి..

జ్ఞానానికి అంతం లేదు. అందువల్ల, ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. చాణక్యుడు చెప్పినట్లుగా, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము నవీకరించుకునే వారే జీవితంలో పురోగతి సాధించి, సమాజంలో గౌరవాన్ని పొందుతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Safety Pin: మంగళసూత్రానికి పిన్నీసులు పెడుతున్నారా? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడు పెట్టరు!
Recommended image2
Mirror Cleaning: ఇంట్లోని అద్దాలపై పడిన మొండి మరకలను న్యూస్ పేపర్లతో క్లీన్ చేసేయండిలా
Recommended image3
Mushrooms: ఇలాంటి పుట్టగొడగులు తింటే ఎవరూ ఊహించని ప్రయోజనాలు
Related Stories
Recommended image1
Chanakya Niti: మనుషుల నుంచి కాదు.. కాకిని చూసి ఇవి నేర్చుకోండి...
Recommended image2
Chanakya Niti: అందరితో మంచిగా ఉండటం కూడా తప్పేనా? కాస్త కన్నింగ్ గా ఉండాల్సిందేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved