Kitchen Hacks: ఈ విషయం తెలిస్తే,ఎండిపోయిన నిమ్మకాయలను అస్సలు పారేయరు..!
Kitchen Hacks: చాలా మంది ఎండిపోయిన నిమ్మకాయలను పారేస్తూ ఉంటారు. కానీ, ఎండిపోయిన నిమ్మకాయలను ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలిస్తే… ఇంకెప్పుడు వాటిని మీరు పారేయరు.

dry lemon
నిమ్మకాయలను మనం రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం. అయితే, ఇవి తాజాగా ఉన్నంత వరకే. అవి ఎండిపోతే ఎందుకూ పనికిరావు. కానీ, వీటిని పారేయడానికి బదులు చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కిచెన్ క్లీనింగ్ నుంచి షూ శుభ్రం చేసే వరకు చాలా రకాలుగా వీటిని వాడొచ్చు. ఎన్ని రకాలుగా వీటిని వాడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం....
సింక్, పాత్రలను శుభ్రం చేయడానికి....
ఎండిన నిమ్మకాయను సహజ క్లీనర్ గా పని చేస్తుంది. ఎండిన నిమ్మకాయ చెక్క మీద ఉప్పు వేసి... స్టీల్ లేదా రాగి పాత్రలను రుద్దాలి. ఇలా చేయడం వల్ల సులభంగా మొండి మరకలను వదిలించవచ్చు. ఇలా నిమ్మకాయతో రుద్దడం వల్ల స్టీల్ పాత్రలు కొత్తవాటిలా మెరుస్తాయి. అంతేకాదు... కిచెన్ సింక్ కూడా దీనితో శుభ్రం చేయవచ్చు. మరకలు ఎలాంటివి అయినా సులభంగా వదులుతాయి. దుర్వాసన కూడా ఉండదు.
జుట్టు సంరక్షణకు నిమ్మకాయ పొడి....
ఎండిపోయిన నిమ్మకాయలను పొడిలా చేసి... జుట్టు సంరక్షణ కోసం వాడొచ్చు. ఈ నిమ్మకాయల పొడిలో కలబంద జెల్ కలిపి హెయిర్ ప్యాక్ లా జుట్టుకు అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు అందంగా మారడమే కాదు... చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది.
షూ నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు...
ఎండిన నిమ్మకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, వాటిని కాటన్ వస్త్రం కట్టలో కట్టి, షూ నిల్వ ప్రదేశంలో ఉంచండి. ఇది తేమ , వాసనలు రెండింటినీ గ్రహిస్తుంది. దీని వల్ల షూ నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.
సహజ ఎయిర్ ఫ్రెషనర్
గ్యాస్ స్టవ్ మీద లేదా మైక్రోవేవ్‌లో ఎండిన నిమ్మకాయను కాసేపు వేడి చేయండి. ఇది వంటగది నుండి దుర్వాసనలను తొలగించే రిఫ్రెషింగ్ నిమ్మకాయ లాంటి సువాసనను విడుదల చేస్తుంది. అంతేకాదు... ఏదైనా మెష్ బ్యాగ్ లో దాల్చిన చెక్క, కర్పూరం, లవంగాలు ల తో పాటు.. ఎండిపోయిన నిమ్మకాయ ముక్కలను కూడా వేయాలి. ఈ బ్యాగ్ ని బాత్రూమ్ లో లేదా.. దుస్తులు ఉండే కబోర్డ్స్ లో పెట్టొచ్చు. దీని వల్ల... సహజంగా సువాసనలు వెద జల్లుతాయి.
కీటకాలు, చీమలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు....
నిమ్మకాయ వాసన చాలా కీటకాలకు ఇష్టం ఉండదు. తలుపుల దగ్గర లేదా వంటగది మూలల్లో ఎండిన నిమ్మకాయలను ఉంచడం వల్ల కీటకాలను దూరంగా ఉంచవచ్చు.

