MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Money Tips: జీతం వచ్చిన వెంటనే ఈ 5 పనులు చేస్తే.. చేతి నిండా డబ్బులే..!

Money Tips: జీతం వచ్చిన వెంటనే ఈ 5 పనులు చేస్తే.. చేతి నిండా డబ్బులే..!

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డబ్బు నిర్వహణ ఒకటి. జీతం బాగానే వచ్చినా నెలాఖరికి చేతిలో డబ్బులుండవు. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే జీతం వచ్చిన వెంటనే 5 పనులు చేయడం ద్వారా డబ్బులకు ఇబ్బందే రాదంటున్నారు నిపుణులు. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 09 2026, 06:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Money Saving Tips
Image Credit : Getty

Money Saving Tips

ప్రస్తుతం చాలామందికి మంచి జీతం వచ్చినా నెల చివరికి వచ్చేసరికి చేతిలో రూపాయి కూడా ఉండదు. దానివల్ల జీతం సరిపోవడం లేదు అనుకుంటారు కొందరు. కానీ ఆర్థిక నిపుణుల ప్రకారం సమస్య జీతంలో కాదు… డబ్బు నిర్వహణలో ఉంది. సరైన ప్లానింగ్ లేకపోవడం, అనవసర ఖర్చులు, సేవింగ్స్ చేసే అలవాటు లేకపోవడం వంటి కారణాల వల్ల నెలాఖరికి చేతులు ఖాళీ అయిపోతాయి. అందుకే జీతం వచ్చిన వెంటనే కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే డబ్బు సరిగ్గా ఉపయోగపడటమే కాకుండా సేవింగ్స్ కూడా పెరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

26
బడ్జెట్ ప్లాన్
Image Credit : Getty

బడ్జెట్ ప్లాన్

జీతం వచ్చిన వెంటనే ఆ నెలలో వచ్చే ఖర్చుల గురించి ముందుగానే ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఇంటి అద్దె, కరెంట్ బిల్, కూరగాయలు, పిల్లల చదువు, ప్రయాణ ఖర్చులు వంటి అవసరమైన ఖర్చులను ముందుగానే లిస్ట్ చేసుకుంటే అనవసర ఖర్చులను తగ్గించుకోవచ్చు. చాలామంది ఖర్చు చేసిన తర్వాత మిగిలినదాన్ని సేవ్ చేయాలని ప్రయత్నిస్తారు. కానీ ఆర్థిక నిపుణుల ప్రకారం, ముందుగా ఖర్చులను ప్లాన్ చేసి ఆ తర్వాతే డబ్బు వినియోగించుకోవాలి. ఇలా చేయడం వల్ల డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో స్పష్టంగా తెలుస్తుంది.

Related Articles

Related image1
Dream Astrology: కలలో పదే పదే ఇవి కనిపిస్తే.. మీ అదృష్టం మారిపోవడం పక్కా!
Related image2
Ugadi 2026: ఉగాది తర్వాత ఈ 6 రాశులవారికి రాజయోగం.. జూన్ వరకు పండగే పండగ!
36
సేవింగ్స్ కి మొదట ప్రాధాన్యం
Image Credit : Getty

సేవింగ్స్ కి మొదట ప్రాధాన్యం

నిపుణుల ప్రకారం జీతం వచ్చిన వెంటనే కొంత మొత్తాన్ని సేవింగ్స్ కింద వేరుగా పెట్టుకోవడం చాలా మంచిది. చాలామంది నెల చివరికి మిగిలిన డబ్బును సేవ్ చేయాలని అనుకుంటారు. కానీ వాస్తవానికి అది మంచి పద్ధతి కాదు. జీతం వచ్చిన వెంటనే కనీసం 20 శాతం డబ్బును సేవింగ్స్ అకౌంట్ లేదా పెట్టుబడుల్లో పెట్టడం మంచిది. దీనివల్ల భవిష్యత్తులో అత్యవసర పరిస్థితుల్లో కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

46
అనవసర ఖర్చులు నియంత్రించడం
Image Credit : Asianet News

అనవసర ఖర్చులు నియంత్రించడం

చాలా సార్లు చిన్న చిన్న ఖర్చులే పెద్ద మొత్తంగా మారిపోతాయి. అవసరం లేకపోయినా ఆన్‌లైన్ షాపింగ్ చేయడం, ఎక్కువగా బయట భోజనం చేయడం లేదా ఆఫర్లకు ఆకర్షితులై అవసరం లేని వస్తువులు కొనడం వంటి అలవాట్లు డబ్బును వేగంగా ఖర్చు అయ్యేలా చేస్తాయి. నిపుణుల ప్రకారం ప్రతి ఖర్చుకు ముందు ఇది నిజంగా అవసరమా? అనే ప్రశ్న వేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల అనవసర ఖర్చులు తగ్గి డబ్బు మిగిలే అవకాశం పెరుగుతుంది.

56
అత్యవసర నిధి
Image Credit : Getty

అత్యవసర నిధి

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆకస్మిక వైద్య ఖర్చులు, ఉద్యోగ సమస్యలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎప్పుడు వస్తాయో చెప్పలేము. కాబట్టి మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపడేంత మొత్తాన్ని అత్యవసర నిధిగా వేరుగా ఉంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇది భవిష్యత్తులో పెద్ద ఆర్థిక సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుందని వివరిస్తున్నారు.

66
పెట్టుబడులపై దృష్టి పెట్టడం
Image Credit : Money\Twitter

పెట్టుబడులపై దృష్టి పెట్టడం

సేవింగ్స్ మాత్రమే కాదు.. డబ్బు పెరిగేలా పెట్టుబడులు పెట్టడం కూడా ముఖ్యం. చిన్న మొత్తంతో ప్రారంభించే పెట్టుబడులు చాలా ఉంటాయి. నెలవారీ పెట్టుబడి పద్ధతులు, రికరింగ్ డిపాజిట్లు లేదా ఇతర పెట్టుబడి మార్గాలు ఎంచుకోవాలి. నిపుణుల ప్రకారం చిన్న మొత్తాలు కూడా దీర్ఘకాలంలో పెద్ద సంపదగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా యువత త్వరగా పెట్టుబడులు ప్రారంభిస్తే భవిష్యత్తులో మంచి ఆర్థిక భద్రత పొందవచ్చు. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Carrot: ఇంట్లో కుండీలోనే క్యారెట్ పెంచొచ్చు, ఈ టిప్స్ పాటిస్తే చాలు
Recommended image2
Brain Foods: బాదంతో పాటు ఈ నాలుగు కలిపి తింటే చాలు.. మతిమరుపు మీ దరి చేరదు
Recommended image3
Gold Earrings: 1 గ్రాము బంగారంలో చైన్ డిజైన్ చెవిపోగులు.. చూసేయండి
Related Stories
Recommended image1
Dream Astrology: కలలో పదే పదే ఇవి కనిపిస్తే.. మీ అదృష్టం మారిపోవడం పక్కా!
Recommended image2
Ugadi 2026: ఉగాది తర్వాత ఈ 6 రాశులవారికి రాజయోగం.. జూన్ వరకు పండగే పండగ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved