MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Extramarital affair: మీ భర్త ఇలా ప్రవర్తిస్తుంటే అతనికి అక్రమ సంబంధం ఉన్నట్టే.. చెబుతున్న కపుల్స్ థెరపిస్ట్

Extramarital affair: మీ భర్త ఇలా ప్రవర్తిస్తుంటే అతనికి అక్రమ సంబంధం ఉన్నట్టే.. చెబుతున్న కపుల్స్ థెరపిస్ట్

Extramarital affair:  కొందరు భర్తలు తమ భార్యకు తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. భర్తలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే అతనికి వివాహేతర సంబంధం ఉందని అనుమానించాల్సిందేనని చెబుతున్నారు ప్రముఖ కపుల్స్ థెరపిస్టు. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 20 2026, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భర్త వివాహేతర సంబంధం పెట్టుకుంటే..
Image Credit : Chat gpt

భర్త వివాహేతర సంబంధం పెట్టుకుంటే..

వివాహ బంధం నిలిచేది నమ్మకం అనే పునాది పైనే. కానీ కొన్నిసార్లు జీవిత భాగస్వామి మోసం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లోనే ఉండే భార్య.. భర్త బయట పెట్టుకునే వివాహేతర సంబంధాల గురించి తెలుసుకోలేకపోవచ్చు. కొన్నిసార్లు భర్త ప్రవర్తనలో కనిపించే చిన్న చిన్న మార్పులే ఆ విషయాన్ని తెలియజేస్తాయి. తాజాగా ప్రముఖ కపుల్స్ థెరపిస్టు కేరెన్ డోహెర్టీ కొన్ని లక్షణాలను చెప్పారు. ఈ లక్షణాలు భర్తలో కనిపిస్తే అతడిని అనుమానించాల్సిందేనని ఆవిడ వివరిస్తున్నారు. చాలామంది మహిళలు భర్తలో కనిపించే కొన్ని మార్పులను సాధారణంగా తీసుకుంటారు. కానీ అవి వివాహేతర సంబంధానికి సంకేతాలు కావచ్చని అంటున్నారు కపుల్స్ థెరపిస్ట్. ముఖ్యంగా మధ్య వయస్సులో ఉన్న దంపతుల్లో ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత సమస్యల కారణంగా భావోద్వేగ దూరం పెరుగుతుంది. వారే ఎక్కువగా వివహేతర సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే
Image Credit : Getty

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే

కపుల్స్ థెరపిస్ట్ చెప్పిన ప్రకారం భర్త, భార్యకు భావోద్వేగా పరంగా దూరంగా ఉంటున్నాడంటే అతనిపై ఒక కన్నెసి ఉంచాలి. భర్త ఇంట్లో ఉన్నా, కుటుంబంతో కలిసిమెలిసి మాట్లాడినా.. మనసు మాత్రం ఎక్కడో ఉన్నట్టు ప్రవర్తిస్తాడు. భార్య మాట్లాడుతున్నప్పుడు ఆసక్తిగా వినడు, సరదాగా మాట్లాడడు. భార్యపై ఆసక్తి తగ్గినట్టు కనిపిస్తుంది. అలాగే కొంతమంది చీటికిమాటికి భార్యని విమర్శిస్తూ ఉంటారు. భార్య కనిపించే విధానం, మాట్లాడే విధానం, పనిచేసే విధానం పై తరచూ అసహనం వ్యక్తం చేస్తూ ఉంటాడు భర్త. ఈ ప్రవర్తన భర్తలో కనిపిస్తే కచ్చితంగా అతడి కి ఏదైనా వివాహేతర సంబంధం ఉందేమోనని ఆరా తీయాల్సిందే.

34
శారీరకంగా దూరం
Image Credit : Getty

శారీరకంగా దూరం

భర్త చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు పెట్టుకోవడం కూడా ఒక లక్షణంగానే చెప్పుకోవాలి. సాధారణంగా దంపతుల మధ్య వాదనలు జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రతి విషయానికి భార్యను విమర్శించడం, వ్యంగ్యంగా మాట్లాడడం, గౌరవం ఇవ్వకపోవడం వంటి వాటివల్ల సంబంధం బలహీనపడుతుంది. ఆరోగ్యకరమైన వాతావరణంలో మాట్లాడుకోవడం తగ్గించి, నిరంతరం భర్త తగాదాలు పెట్టుకుంటూ ఉంటే ఆ భర్తను అనుమానించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో శారీరక సాన్నిహిత్యం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. భర్త .. భార్యపై శారీరకంగా ఆసక్తి చూపించకపోయినా, ప్రేమగా మాట్లాడకపోయినా, చేతులు పట్టుకోవడం, శరీరాన్ని తాకడం వంటివన్నీ తగ్గించినా కూడా అతడిని అనుమానించాల్సిందే.

44
ఓపెన్ గా మాట్లాడండి
Image Credit : Getty

ఓపెన్ గా మాట్లాడండి

ఒకప్పుడు ఇద్దరికీ నచ్చిన విషయాలు ఇప్పుడు భర్తకు నచ్చకుండా చిరాకు తెప్పిస్తున్నా కూడా అతడు వేరే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడేమోనని భార్య అనుమానించాల్సిన అవసరం ఉంది. సరదాగా మాట్లాడుకోవడం, జోకులు వేసుకోవడం అనేది దంపతుల మధ్య భావోద్వేగ బంధాన్ని బలపరుస్తుంది. అది పూర్తిగా తగ్గిపోతే ఆ బంధం బలహీన పడుతుంది. ఉద్యోగ ఒత్తిడి, మానసిక ఆందోళన, కుటుంబ సమస్యలు కూడా భర్తలో మార్పులకు కారణం కావచ్చు. అవేవీ లేకపోయినా భర్తలో పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తున్నాయంటే అతనితో ఓపెన్ గా మాట్లాడడం మంచిది. అవసరమైతే కౌన్సిలింగ్ కూడా తీసుకోవాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Earrings: ఈ వెండి కమ్మలు చూస్తే మనసు పారేసుకుంటారు అంతే!
Recommended image2
Flax Seeds: అవిసెగింజలు ఎలా తినాలి? రోజూ ఒక స్పూన్ తింటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Recommended image3
Empty Stomach Foods: ఉదయం ఖాళీ కడుపుతో ఏం తినొచ్చు? వేటిని అస్సలు తినకూడదు?
Related Stories
Recommended image1
Haunted Mumbai: ముంబై వెళితే ఈ ప్రదేశాలకు రాత్రిపూట ఒంటరిగా వెళ్లకండి.. భయంతో గుండె ఆగిపోతుంది
Recommended image2
Sun disappearance: సూర్యుడు హఠాత్తుగా మాయమైపోతే మనుషులు ఎన్నాళ్లు బతకగలరు? ఏ దేశం సూర్యుడు లేకున్నా సేఫ్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved