Indian Railway: రైలులో సీట్లు బ్లూ కలర్ లోనే ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనక రీజన్ ఇదే
Indian Railways: ఇప్పటి వరకు మీరు చాలాసార్లు రైలు ఎక్కే ఉంటారు. కానీ.. ఎప్పుడైనా గమనించారా? ఇండియన్ రైళ్లలో చాలా వరకు కోచ్ లలో సీట్లు బ్లూ కలర్ లోనే ఉంటాయి. దీని వెనక ఉన్న కారణం ఏంటో తెలుసా?
రైళ్లలో సీట్లు బ్లూ కలర్ లోనే ఎందుకు ఉంటాయి?
ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తూనే ఉంటారు. మీరు పాసింజర్ రైలు ఎక్కినా, ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కినా.. దాదాపు అన్ని రైళ్లలోనూ సీట్లు నీలం రంగులోనే ఉంటాయి. అసలు.. ఈ కలరే ఎందుకు ఉంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కలర్ ని రైల్వే శాఖ సెలక్ట్ చేసుకోవడానికి వెనక కారణం ఏంటో తెలుసా? స్లీపర్ క్లాస్ నుంచి థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ వరకు చాలా రైళ్లలో సీట్లు బ్లూ కలర్ లోనే ఉంటాయి. కేవలం రైళ్లలోనే కాదు.. చాలా విమానాల్లో సీట్లు కూడా బ్లూ కలర్ లోనే ఉంటాయి. ఈ కలర్ వెనక సైకాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం…

ప్రయాణికుల కోసమే...
రైలుు ప్రయాణాలు గంటల నుంచి రోజుల వరకు కూడా సాగుతాయి. ఇలాంటి లాంగ్ జర్నీలు చేయడం వల్ల ప్రయాణికుల్లో అలసట, చిరాకు రావడం సహజం. అలాంటి చిరాకు కలగకుండా ఉండేందుకు ఈ బ్లూ కలర్ సీట్లు పెడతారు. కలర్ సైకాలజీ ప్రకారం, నీలం రంగు మెదడుపై సానుకూల ప్రభావం చూపుతుంది. మనసును ప్రశాంతంగా ఉంటుంది. ప్రయాణికులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ప్రయాణించడానికి ఈ రంగు సహాయపడుతుంది.
ఇది కూడా ఒక కారణమే...
అంతేకాదు.. రైళ్లలో ప్రతిరోజూ కోట్ల మంది ప్రయాణిస్తూ ఉంటారు. ప్రయాణ సమయంలో సీట్లపై కూర్చోవడం, పడుకోవడం, టీ, కాఫీ లాంటివి పడేయడం చేస్తూ ఉంటారు. ఒకవేళ లైట్ కలర్ సీట్లు అయితే.. ఆ మరకలు వదిలించడం కష్టం. మరకలు కూడా క్లియర్ గా కనపడతాయి. అదే.. నీలం రంగు అయితే.. అంత తొందరగా ప్రయాణికుల కంట కనపడదు. రైల్వే నిర్వహణ అధికారులకు భారాన్ని తగ్గిస్తుంది.
మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఇండియన్ రైళ్లలో చాలా మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. తక్కువ స్థలంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఉక్కిరిబిక్కిరిగా అనిపిస్తూ ఉంటుంది. అదే నీలిరంగు సీట్లు ఉంటే.. రైలు కోచ్ చాలా విశాలంగా ఉన్నా ఫీలింగ్ కలిగిస్తుంది. అందుకే.. ఈ రంగును ఎంచుకుంటారు.
