కోవిడ్ -19 వ్యాక్సిన్లలో ఎన్నిరకాలున్నాయో.. ఎలా పనిచేస్తాయో తెలుసా?
టీకాలు ఎలా పనిచేస్తాయి అంటే.. రోగనిరోధక శక్తిని పెంచే కణాలను, అణువులను ప్రేరేపించడం ద్వారా భవిష్యత్తులో అంటువ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడం టీకాలు చేసే పని. కోవిడ్ 19 వ్యాక్సిన్ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్రెండింగ్ అంటే కరోనావైరస్, వ్యాక్సిన్ ఇవి రెండే. అయితే గతేడాది నుంచి కోవిడ్ 19ను ఎదుర్కునేందుకు ఎన్నో రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మొదట్లో వీటిమీద అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఇప్పుడు మహమ్మారి కట్టడికి ఇదే ఓ మేలైన మార్గం అని నమ్ముతున్నారు.
ఇక ఇప్పుడు అన్ని దేశాలూ.. తమ ప్రజలందరికీ టీకాలు వేయాలనే దిశగా చర్యలు వేగవంతం చేశాయి. అయితే ఈ క్రమంలో ఆమోదించబడిన వివిధ రకాలైన వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయి. వాటి సమ్మేళనం ఏమిటి అనే విషయాలు తెలిసి ఉండడం మంచిది.
అసలు టీకాలు ఎలా పనిచేస్తాయి అంటే.. రోగనిరోధక శక్తిని పెంచే కణాలను, అణువులను ప్రేరేపించడం ద్వారా భవిష్యత్తులో అంటువ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడం టీకాలు చేసే పని. కోవిడ్ 19 వ్యాక్సిన్ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది.
ముఖ్యంగా COVID-19 వ్యాక్సిన్లను నాలుగు ప్రధాన రకాలుగా విభజించవచ్చు. శరీరం మీద ఎలా పనిచేస్తాయనే విషయంలో మాత్రమే ఇవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.
అవే
1. హోల్ వైరస్
2. వైరల్ వెక్టర్
3. RNA / MRNA
4. ప్రోటీన్ సబ్యూనిట్
హోల్ వైరస్ వ్యాక్సిన్ల రకాల్లో ఇప్పటివరకు ఆమోదించబడినవి.. కోవాక్సిన్, సినోఫార్మ్, సినోవాక్, కరోనావాక్, కోవివాక్, మిన్హై, కజ్వాక్.
ఇవన్నీ రెండు డోసుల్లో తీసుకోవాల్సినవే.
ఈ టీకాలు శరీరంలోకి చేరిన తరువాత వైరస్ కణాలను బలహీనపరిచే, లేదా పనిచేయకుండా చేసే మెకానిజాన్ని ప్రేరేపిస్తుంది. దీని వల్ల శరీరం రోగనిరోధక శక్తి పెరుగుతుంది. టీకాలతో శరీరంలోకి వచ్చే పాథోజెన్స్ మన కణాల మీద ప్రభావం చూపడం, తమ అసలు నేచర్ ను ప్రతిబింబించడం చేయవు. ఇవి కూడా రెండు రకాలుగా ఉంటాయి.
- ఇందులో వైరస్ కణాలు సజీవంగా ఉంటాయి.. కానీ బలహీనమైనంగా ఉంటాయి. కాబట్టి రిప్లికేట్ అవుతాయి. కానీ ఎలాంటి అనారోగ్యం కలిగించవు.
- ఇంకోరకం నిష్క్రియాత్మక వైరస్. వీటిల్లో జన్యు పదార్ధం నాశనం అయినందున రిప్లికేట్ అవ్వవు. కానీ, రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది.
అయితే ఈ విధానం కొత్తదేం కాదు.. గతంలో హెపటైటిస్ ఎ, పోలియో, రాబిస్ వ్యాక్సిన్ల కోసం ఉపయోగించబడిందే. ఇది ఇప్పటికే ప్రయత్నించిన, పరీక్షించిన పద్ధతి కాబట్టి, దీనిని తయారు చేయడం చాలా సులభం. అంతేకాకుండా వ్యక్తులపై ప్రయోగించడం సులభం. అయితే, ఈ టీకాకు బూస్టర్ షాట్లు అవసరం కావచ్చు.
RNA లేదా mRNA టీకాలు
ఆమోదించబడిన వ్యాక్సిన్లు : ఫైజర్-బయోఎంటెక్, మోడరనా
ఇవి కూడా రెండు డోసుల్లో తీసుకోవాల్సినవే.
ఇంతకు ముందు ఉపయోగించని వ్యాక్సిన్లతో పోల్చుకుంటే ఇది కొత్త టెక్నాలజీ. అయినప్పటికీ, జికా, రాబిస్ వంటి అనేక ఇతర వైరస్ల కోసం గతంలో వీటిని విస్తృతంగా అధ్యయనం చేశారు.
యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, "పరిశోధకులు దశాబ్దాలుగా mRNA వ్యాక్సిన్ల మీద అధ్యయనం చేస్తున్నారు. వీటిమీద పనిచేస్తున్నారు. దీంతో ఈ వ్యాక్సిన్లపై ఆసక్తి పెరిగింది. కారణం వీటిని అందుబాటులో ఉన్న పదార్థాలను ఉపయోగించి ప్రయోగశాలలో అభివృద్ధి చేయవచ్చు. అంటే ఈ ప్రక్రియలో టీకాలు తయారుచేసే సాంప్రదాయ పద్ధతుల కంటే వ్యాక్సిన్ అభివృద్ధి వేగంగా తయారుచేయవచ్చు.
ఈ టీకాలు RNA లేదా DNA జన్యు పదార్ధాలను ప్రేరేపించడం ద్వారా యాంటీజెన్ ఉత్తత్పి అయ్యేలా చేస్తాయి. COVID-19 వ్యాక్సిన్ల విషయంలో, ఇది వైరస్ స్పైక్ ప్రోటీన్.
ఇది మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, కణాల ప్రోటీన్ కారకాన్ని ఉపయోగించుకుని యాంటిజెన్ తయారు చేస్తుంది. దీంతో శరీరం వైరస్ ను కనిపెట్టడంలో సిద్ధమవుతుంది. భవిష్యత్తులో వైరస్ దాడి చేస్తే ప్రతిభావంతగా ఎదుర్కొంటుంది.
ఈ టీకాల్లో సజీవ వైరస్ ఉండదు కాబట్టి ఎలాంటి వైరస్ ను ప్రేరేపించదు. దీనికి భిన్నంగా రక్షణ అందజేస్తుంది. అయితే వీటిని నిల్వచేయడం కష్టమైన పని.
వైరల్ వెక్టర్ టీకాలు
ఆమోదించబడిన వ్యాక్సిన్లు : స్పుత్నిక్ వి, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా, కాన్విడెసియా, జాన్సన్ అండ్ జాన్సన్
ఇవి కూడా రెండు డోసుల్లో తీసుకోవాల్సినవే.
రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించే జెనెటిక్ కోడ్ ను ఉత్పత్తి చేసే వెక్టర్ అనే వైరస్ ను ఈ టీకాలు ఉత్పత్తి చేస్తాయి. ఇవి సురక్షితమైన, మాడిఫైడ్ వెర్షన్ అయిన వెక్టర్ వైరస్ ను కలిగిఉంటాయి. యాంటిజెన్లను ఉత్పత్తి చేయడానికి కణాలకు జన్యు సూచనలు ఇవ్వడం ద్వారా కూడా ఈ టీకాలు పనిచేస్తాయి.
దీనికోసం హానికారకం కాని వైరస్ సమ్మేళనాల ద్వారా కణాలకు సూచనలు అందజేస్తాయి. ఈ టైప్ వ్యాక్సిన్లలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది అడెనోవైరస్. ఈ టీకాలు న్యాచురల్ వైరల్ ఇన్ఫెక్షన్ ను అనుకరిస్తాయి. తద్వారా బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి.
ఇది ఎస్టాబ్లిష్డ్ టెక్నాలజీ. గతంలో ఎబోలా వైరస్ కోసం ఉపయోగించారు. ఇవి మన శరీరంలోని B కణాలు, T కణాలు రెండింటినీ కలిగి ఉన్న బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. అయితే, గతంలో, మీరు వెక్టార్కు ఎక్స్ పోజ్ అయితే.. అది ప్రభావాన్ని తగ్గిస్తుంది.
ప్రోటీన్ సబ్యూనిట్
ఆమోదించబడిన వ్యాక్సిన్లు : ఎపివాకోరోనా, జిఫివాక్స్, నోవావాక్స్
ఇవి కూడా రెండు డోసుల్లో తీసుకోవాల్సినవే.
ఈ టీకాలు పాథోజెన్ ల సబ్ యూనిట్లను ఉపయోగించి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. కరోనావైరస్ కోసం ఈ వ్యాక్సిన్ పాథోజెన్ ల ప్యూరిఫైడ్ ముక్కలను ఉపయోగిస్తాయి. కాబట్టి అవి రోగనిరోధక శక్తిని మొత్తం వ్యాధికారకానికి పరిమితం చేస్తాయి. దీంతో దుష్ప్రభావాలను తగ్గిస్తాయి, ఇదే సమయంలో రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి.
ఈ టీకా సాంకేతిక పరిజ్ఞానం హెపటైటిస్ బి, మెనింగోకాకల్ డిసీజ్, న్యుమోకాకల్ డిసీజ్ మరియు షింగిల్స్లో ఇంతకుముందు ఉపయోగించబడింది. వీటిని రాజీపడే రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి ఉపయోగించవచ్చు.
అయితే ఈ టీకాలు తయారీ కొంచెం క్లిష్టంగా ఉంటుంది. వీటిని వాడడానికి బూస్టర్ షాట్లు అవసరం కావచ్చు.