MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Dosa Batter: పిండి పులియబెట్టాల్సిన అవసరం లేకుండా 30 నిమిషాల్లో దోశ పిండి రెడీ

Dosa Batter: పిండి పులియబెట్టాల్సిన అవసరం లేకుండా 30 నిమిషాల్లో దోశ పిండి రెడీ

Dosa Batter: దోశ పిండిని అప్పటిప్పుడు రెడీ చేసుకోవచ్చు. దీన్ని ముందు రాత్రంతా పులియబెట్టాల్సి అవసరం లేదు. కేవలం అరగంటలో కరకరలాడే దోశలు వేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ దోశె పిండి వైరల్ గా మారింది. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 31 2026, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అప్పటికప్పుడు దోశె పిండి
Image Credit : X

అప్పటికప్పుడు దోశె పిండి

అల్పాహారంలో దోశె అంటే ఎంతో ఇష్టంగా ఉంటారు.  ఉదయం టిఫిన్ అయినా, రాత్రి డిన్నర్ అయినా వేడివేడి దోశ తినాలనిపిస్తుంది. ఇంట్లో పర్ఫెక్ట్‌గా దోశ చేయాలంటే  బియ్యం, మినపప్పు నానబెట్టి, రుబ్బి, ఆ పిండిని 12 నుంచి 24 గంటల పాటు పులియబెట్టాలి. ఇదంతా చేయలేక చాలా మంది ఇంట్లో దోశెలు మానేసి బయట నుంచి కొనుక్కుని తెచ్చుకుంటారు. అందుకే, పిండిని పులియబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడే దోశె ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కావాల్సిన పదార్థాలు
Image Credit : social media

కావాల్సిన పదార్థాలు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయితే 'X'లో @JustPunforfun అనే యూజర్ దోశ పిండి రెసిపీని షేర్ చేశారు.  దీనికి కావాల్సిన పదార్థాలన్నీ మీ వంటగదిలోనే సిద్ధంగా ఉంటాయి. బయటి నుంచి ఏమీ కొనాల్సిన పనిలేదు. ఈ పిండి త్వరగా రెడీ అవ్వడమే కాకుండా, దీనితో చేసే దోశలు క్రిస్సీగా వస్తాయి.

ఇన్‌స్టంట్ దోశ పిండి తయారు చేయడానికి ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు సామలు తీసుకోవాలి. అలాగే   రెండు ఉడికించిన బంగాళదుంపలు, రెండు పచ్చిమిరపకాయలు, గుప్పెడు కరివేపాకులు, చిటికెడు ఇంగువ, ఒక చెంచా వాము, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి.  

Related Articles

Related image1
Sofa Cleaning: సోఫా పాతగా మారి మురికి పట్టిందా? ఈ పదార్థాలతో క్లీన్ చేస్తే కొత్తదిలా మెరిసిపోతుంది
Related image2
Rahu Ketu: కలిసివస్తున్న దుష్టగ్రహాలైన రాహుకేతువులు.. ఈ 5 రాశుల వారికి డబ్బే డబ్బు
34
దోశె పిండి ఇలా చేసేయండి
Image Credit : ‍‍X

దోశె పిండి ఇలా చేసేయండి

దోశె పిండిని చేసేందుకు ముందుగా ముందుగా పెసరపప్పు, శనగపప్పు, సామ బియ్యం కలిపి నీటిలో కేవలం 30 నిమిషాలు నానబెట్టాలి.  తరువాత శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లో ఆ మూడింటిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో తీసి వేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలను చేత్తోనే మెత్తగా మెదపాలి. వాటిని కూడా పిండిలో వేసి బాగా కలపాలి. అలాగే పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఇంగువ, వాము, ఉప్పు కలపాలి.  అవసరమైనన్ని నీళ్లు పోసి పిండిని మెత్తగా మళ్లీ ఒకసారి రుబ్బుకోవాలి. పిండి దోశె పిండిలాగా జారుడుగా వచ్చాక పక్కన పెట్టుకోవాలి.

44
వేడి వేడి దోశెలు
Image Credit : ‍‍X

వేడి వేడి దోశెలు

స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి. గరిటెతో పిండిని పల్చగా వేయాలి. రెండు వైపులా కరకరలాడే వరకు కాల్చి, వేడివేడిగా సర్వ్ చేయాలి. దీన్ని పల్లి చట్నీ లేదా టమాటా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Marriage : ఇదెక్కడి విడ్డూరం..! అబ్బాయి మెడలో అమ్మాయి తాళి కట్టి పెళ్ళాడిందా!!
Recommended image2
Oil: కిచెన్ లో స్టవ్ పక్కనే ఆయిల్ డబ్బా పెడుతున్నారా? ఇది తెలిస్తే.. మళ్లీ అక్కడ పెట్టరు..!
Recommended image3
మహిళలు నలభై దాటాక తిండి తగ్గించినా కూడా బరువు తగ్గడం కష్టమే
Related Stories
Recommended image1
Sofa Cleaning: సోఫా పాతగా మారి మురికి పట్టిందా? ఈ పదార్థాలతో క్లీన్ చేస్తే కొత్తదిలా మెరిసిపోతుంది
Recommended image2
Rahu Ketu: కలిసివస్తున్న దుష్టగ్రహాలైన రాహుకేతువులు.. ఈ 5 రాశుల వారికి డబ్బే డబ్బు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved