ఈ కిచెన్ లో లభించే వస్తువులతో ఇంటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసా?
కేవలం మన కిచెన్ లో లభించే కొన్ని పదార్థాలతో ఇంటిని మెరిసిపోయేలా క్లీన్ చేయవచ్చని మీకు తెలుసా? ఏ వస్తువులతో ఇంటిని సులభంగా క్లీన్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం...
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనే అందరూ అనుకుంటారు. అయితే. కిచెన్ , ఫ్రిడ్జ్, స్టవ్, హాల్ ఇలా అన్నీ ఎప్పటికప్పుడు తుడుస్తూన్నా కూడా దుమ్ము వచ్చి చేరుతూ ఉంటుంది. ఒక వాటిని క్లీన్ చేయడానికి కూడా ఒక్కోదానికి ఒక్కో క్లీనర్ మార్కెట్లో కొనుగోలు చేస్తూ ఉండాలి. అవి ధర కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే.. అవేమీ కొనకుండానే కేవలం మన కిచెన్ లో లభించే కొన్ని పదార్థాలతో ఇంటిని మెరిసిపోయేలా క్లీన్ చేయవచ్చని మీకు తెలుసా? ఏ వస్తువులతో ఇంటిని సులభంగా క్లీన్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం...
1.బేకింగ్ సోడా..
దాదాపు అందరు ఇళ్లల్లో బేకింగ్ సోడా ఉంటుంది. ఆ బేకింగ్ సోడాతో అదిరిపోయే వంటలు మాత్రమే కాదు... కిచెన్ లోని చాలా ప్రదేశాలను శుభ్రం చేయవచ్చు. ముఖ్యంగా... షింక్, స్టవ్ టాప్స్, కౌంటర్ టాప్స్ పై ఉన్న జిడ్డును సులభంగా వదిలించవచ్చు. వాటిపై వేసి.. స్క్రబ్ చేస్తే సరిపోతుంది.
2.ఉప్పు..
ఉప్పు లేకుండా వంట పూర్తి అవ్వదు. ఆ ఉప్పుని మనం స్క్రబ్బర్ లాగా ఉపయోగించవచ్చు. మఖ్యంగా చాలా రకాల మొండి మరకలను ఉప్పు వదిలిస్తుంది. వంట పాత్రలకు ఉన్న మొండి మరకలను, తప్పు పడితే.. దానిని ఉప్పుతో ఈజీగా వదిలించవచ్చు.
LEMON
3.నిమ్మకాయ..
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. బ్యాక్టీరియాను చంపడంలో, గ్రీజు , జిడ్డు మరకలను తొలగించడంలో నిమ్మకాయ చాలా బాగా పని చేస్తుంది స్టీల్ సామాన్లు, కిచెన్ కౌంటర్ టాప్స్ క్లీన్ చేయడానికి చాలా బాగా పని చేస్తుంది.
4.వైట్ వెనిగర్...
ఈ వైట్ వెనిగర్ సహాయంతో కూడా మనం ఇంటిని మెరిపించవచ్చు. ఇంట్లో ఎక్కడైనా గ్రీజు మరకలు, ఆయిల్ మరకలు ఉంటే... ఆ ప్రదేశంలో ఈ వైట్ వెనిగర్ వేసి కాసేపు అలానే వదిలేసి తర్వాత రుద్దితో ఈజీగా ఆ మరకలు వదులుతాయి.
5.ఆలివ్ ఆయిల్..
నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఆలివ్ ఆయిల్ లో కొద్దిగా నిమ్మరసం, వైట్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని.. ఏవైనా ఫర్నీచర్ ని శుభ్రం చేయడానికి, లేదంటే ఏదైనా సర్ ఫేస్ ని క్లీన్ చేయవచ్చు. మంచి మెరుపును అందిస్తుంది.
6.మొక్క జొన్న పిండి..
మీరు నమ్మకపోయినా ఇది నిజం. మొక్క జొన్న పిండితో కూడా పలు వస్తువులను శుభ్రం చేయవచ్చు. గ్రీజు మరకలు, ఆయిల్ మరకు ఏవైనా దుస్తులు, కార్పెట్ పై పడితే.. వాటిని వదిలించడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ.. మొక్క జొన్న పిండితో దానిని ఈజీగా తొలగించవచ్చు. ఏదైనా ఫర్నీచర్ శుభ్రం చేయడానికి కూడా సహాయపడుతుంది. కిటికీలు కూడా శుభ్రం చేయవచ్చు.
lemon peel
7.నిమ్మ, నారింజ తొక్కలు..
వీటిని మనం సాధారణంగా పడేస్తూ ఉంటాం. కానీ... వీటితో కూడా ఇంటిని చక్కగా శుభ్రం చేయవచ్చు. వీటిని కొద్ది రోజులపాటు వెనిగర్ లో నానపెట్టాలి. తర్వాత.. ఆ వెనిగర్ ని.. ఇంట్లోని పలు ప్రాంతాలను శుభ్రం చేయడానికి వాడొచ్చు. చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.
8.అల్యూమినియం ఫాయిల్..
ఈ అల్యూమినియం ఫాయిల్ ని ఒక చిన్నపాటి బాల్ లాగా చేసి... దానిని ఒక స్క్రబ్బర్ లాగా కూడా వాడొచ్చు. మొండి మరకలను ఈజీగా వదిలిస్తుంది.