Astrology

వాస్తు ప్రకారం, ఈ రంగు మాత్రం ఇంట్లో వాడకూడదు

గులాబీ రంగు ఎందుకు వాడకూడదు?

గులాబీని మృదువైన అగ్ని అంటారు, అంటే భావోద్వేగాలతో కూడిన కోపం. ఎర్ర రంగు ఉగ్రత, కోపాన్ని సూచిస్తుంది, అలాగే గులాబీ రంగు ఎరుపు రంగులో ఒక భాగం, కాబట్టి దీనికి కూడా కోపంతో సంబంధం ఉంది.

గులాబీ రంగు ప్రభావాలు

నిపుణులు  ప్రకారం, ఎక్కువ గులాబీ రంగు వాడటం వల్ల పెద్ద గొడవలు కాకపోయినా, చిన్న చిన్న తగాదాలు, కోపతాపాలు వస్తూనే ఉంటాయి. 

భావోద్వేగ అస్థిరత పెంచుతుంది

గులాబీ రంగు అతి భావోద్వేగాలు, సున్నితత్వాన్ని పెంచుతుంది. చిన్న చిన్న విషయాలకే బాధపడతారు. సంబంధాలలో అనవసరపు ఒత్తిడి, భావోద్వేగ కలహాలకు దారితీస్తుంది.

అగ్ని తత్వానికి విరుద్ధం

గులాబీ రంగులో అగ్ని తత్వ శక్తి ఉంటుంది. వంటగది లేదా ఆగ్నేయ దిశలో గులాబీ రంగు వాడటం అగ్ని తత్వాన్ని అసమతుల్యం చేస్తుంది. దీని వల్ల కోపం, వివాదాలు, గొడవలు పెరిగే అవకాశం ఉంది.

ఎప్పటికీ నిజం కాని కోరికలు

గులాబీ రంగు తరచుగా ఊహలు, ఆదర్శాలకు చిహ్నం. ఈ రంగు ఎక్కువగా వాడటం వల్ల అవాస్తవిక ఆశలు పెంచుకుంటారు. ఇది నిజ జీవితంలో అసంతృప్తి, నిరాశకు దారితీస్తుంది.

ఆరోగ్య సమస్యలు

గులాబీ రంగు ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని వల్ల ఆందోళన, ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.  గులాబీ రంగు నిద్రకు భంగం కలిగిస్తుంది.

పరిష్కారం ఏమిటి?

గులాబీ రంగును పరిమితంగా, అలంకరణ వస్తువులకు మాత్రమే వాడండి. ఇంటి లేదా ఆఫీసులో ముఖ్యమైన దిశలలో (ఆగ్నేయం, ఉత్తరం వంటివి) దీన్ని వాడకండి.

పిల్లలకు దిష్టి తగలకూడదంటే ఏం చేయాలి?

ఎవరు తొందరగా ధనవంతులు అవుతారో తెలుసా

2025లో ఈ మూడు రాశులకు పట్టిందల్లా బంగారమే

బెడ్ మీద తింటే ఏమౌతుందో తెలుసా