Tulasi Leaves: తులసి ఆకులను నమలడం ఎంత ప్రమాదకరమో, అంతే పాపం కూడా
Tulasi Leaves: తులసి ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి అందే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే. కానీ ఆ ఆకులను ఎలా తీసుకోవాలో చాలా మందికి సరిగ్గా తెలియదు. తులసి ఆకులను నేరుగా నమిలితే ప్రమాదమని చెబుతున్నారు వైద్యులు.

తులసిని నమలడం తప్పు
ధర్మం, ఆయుర్వేదం, వైద్యం అన్నింటిలోను తులసి మొక్కకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. హిందూమతంలో తులసిని లక్ష్మీదేవిగా కొలుస్తారు. ఇక ఆయుర్వేదం విషయానికి వస్తే తులసిని ఒక మూలికగా చూస్తుంది. తులసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నది నిజమే. అందుకే ఎంతో మంది ఉదయం లేచాక నోరు శుభ్రం చేసుకుని రెండు తులసి ఆకులను తెంపి నోట్లో వేసుకుని నమిలేస్తూ ఉంటారు. ఆ రసాన్ని మింగుతారు. ఈ అలవాటు మీకు ఉంటే వెంటనే మానేయండి. తులసి ఆకులను నమలడం ఆయుర్వేదం, ధర్మం ప్రకారం తప్పు. వైద్యపరంగా కూడా ఆరోగ్యం కాదు.
వైద్య శాస్త్రం ఏం చెబుతోంది?
తులసి ఆకులను నేరుగా నోట్లో వేసుకుని నమలడం మంచి అలవాటు కాదని వైద్యులు చెబుతున్నారు. తులసి ఆకులలో పాదరసం ఉంటుంది. నమిలేటప్పుడు ఈ పాదరసం విడుదలైన దంతాల ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. నమలడం వల్ల ఈ మూలకాలు పళ్లకు అంటుకుని, క్రమంగా దంతాలను పాడు చేస్తాయి. తులసి ఆకులు వేడిని కలుగ జేసే లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని ప్రతిరోజూ నమిలితే పొట్టలో ఎసిడిటీ పెరుగుతుంది. తరచుగా నమలడం వల్ల నోరు, కడుపులో ఆమ్లత్వం పెరుగుతుంది. తులసిలో ఆర్సెనిక్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి అంత మంచివి కావు.
మతపరంగా కూడా ఎందుకు వద్దు?
హిందూమతంలో తులసి మొక్క లక్ష్మీదేవితో సమానం. ఈ మొక్కది ఎంతో పవిత్ర స్థానం ఉంది. తులసి మొక్క ఇంట్లో ఉంటే నెగటివ్ ఎనర్జీ పోతుందని భక్తుల నమ్మకం. అలాగే ఇంటికి సిరిసంపదలు, సంతోషం ఇచ్చే దేవతగా తులసి మొక్కను నమ్ముతారు. దేవతగా భావించే మొక్క ఆకులను తెంపిక నమలడం ఎంతో అగౌరవపరచడమేనని చెబుతారు. ప్రతి ఆకులో లక్ష్మీదేవి ఉంటుందని, వాటిని నమిలితే ఆమెను అవమానించినట్లేనని నమ్మకం. తులసి ఆకులు పాడైనా కూడా పూజకు వాడకూడదని చెబుతారు.
తులసి ఆకులను ఎలా స్వీకరించాలి?
తులసి ఆకులను నమలకూడదని చెప్పారు… మరి వాటిని ఎలా స్వీకరించాలి అనే సందేహం ఎక్కువ మందిలో ఉంటుంది. దానికి ఒక చిట్కా ఉంది. ఆయుర్వేదం ప్రకారం తులసిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి దగ్గు, కఫానికి అద్భుతంగా పనిచేస్తాయి. తులసిలో పాదరసం ఉన్నందున, నిపుణులు ఆకులను నమలకుండా మింగమని సలహా ఇస్తారు. ఆకులను శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీటిలో కలుపుకోవాలి. ఆ నీటితో సహా మింగేయాలి తప్ప నమలకూడదు. కషాయం, టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. లేదా అల్లం, తులసి ఆకులను మరిగించి తేనెతో కలిపి తాగవచ్చు.
తులసి ఆకుల ప్రయోజనాలు
తులసి ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండడం వల్ల శరీరంలో పేరుకుపోయినా కొలెస్ట్రాల్‌ను కూడా కరిగించేస్తుంది. ఇవి జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు చర్మ సమస్యలు రాకుండా అడ్డుకునేందుకు ఉపయోగపడుతుంది. గర్భిణులు, థైరాయిడ్, సర్జరీ అయిన వారు మాత్రం తులసి ఆకులకు దూరంగా ఉండాలి.

