Mithuna Rashi Phalalu 2026: మిథున రాశి వారికి కొత్త ఏడాది విపరీతంగా కలిసొచ్చే అవకాశం
Mithuna Rashi Phalalu 2026: మిథున రాశి వారికి కొత్త ఏడాది 2026లో విద్య, కెరీర్, కుటుంబం, ఆర్ధిక విషయాలు, ఆరోగ్యం.. ఎలా ఉండబోతోందో ఇక్కడ వివరించాము. మిథునరాశి వారికి వచ్చే ఏడాది శని, గురు గ్రహం వల్ల విపరీతంగా ప్రభావితం అవుతుంది.

మిథున రాశి 2026 ఫలితాలు
మిథున రాశి వారికి 2026 సంవత్సరం మంచి ఫలితాలను ఇచ్చే ఏడాది. అయితే శని ప్రభావం అధికంగా ఉంటుంది. శనీశ్వరుడు మిథున రాశి వారి పదవ ఇల్లు అయినా మీనరాశిలో సంచరిస్తాడు. దీనివల్ల అధిక ఒత్తిడి, అలాగే బాధ్యతలు పెరగడం, కెరీర్ పై విపరీతమైన దృష్టిని పెట్టవలసిన అవసరం వస్తుంది. శని కష్టపడి పని చేయాలని, క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటాడు. ఇక గురు గ్రహం మీకు ఎన్నో బహుమతులను అందిస్తాడు. జూన్ నుండి అక్టోబర్ వరకు మీ రెండవ ఇంట్లో గురుడు ఉచ్ఛ స్థానంలో ఉంటాడు. ఇది ధనయోగాన్ని ఏర్పరుస్తుంది. మీకు సంపాదన, పొదుపు, కుటుంబ సంతోషాన్ని అందిస్తుంది.
ఇక రాహుకేతువులు తెరవెనకే ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. డిసెంబర్ 6 వరకు రాహువు 9వ ఇంట్లో కేతువు మూడవ ఇంట్లో ఉంటారు. తొమ్మిదవ ఇంట్లో ఉన్న రాహువు విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య, ఆధ్యాత్మికత పెంచుతారు. ఇక మూడవ ఇంట్లో ఉన్న కేతువు మీరు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. డిసెంబర్ 6, 2026న రాహువు ఎనిమిదవ ఇంట్లోకి, కేతువు రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆకస్మిక సంఘటనలు ఏవైనా జరిగే అవకాశం ఉంటుంది.
కెరీర్ ఎలా ఉంటుంది?
2026లో కెరీర్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. పదవ ఇంట్లో ఉన్న శని మీకు బాధ్యతలు పెరిగేలా, కఠినమైన పనులు ఎదురయ్యేలా చేస్తాడు. ఇది మీ సామర్థ్యాన్ని పరీక్షించే సమయం. మీ పనితీరును పై అధికారులు గమనిస్తారు. అయినప్పటికీ ఓపికగా, క్రమశిక్షణగా, నిజాయితీగా ఉంటే శని మిమ్మల్ని అనుక్షణం కాపాడుతాడు. ఏప్రిల్ 2 నుండి మే 11 వరకు పరిస్థితి కొంచెం కఠినంగా ఉంటుంది. కుజుడు మీ పదవ ఇంట్లో ప్రవేశించి శనితో కలుస్తాడు. ఈ కలయిక కొన్నిసార్లు అధికారులతో గొడవలకు దారితీస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అహంకారానికి పోకూడదు. ఇక జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు మీ కెరీర్ కు మంచి సమయం. గురుడు రెండవ ఇంట్లో ఉండడం వల్ల మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. పదవ ఇంటిపై గురుడు దృష్టి శని కఠినత్వాన్ని మృదువుగా మార్చేస్తుంది. దీనివల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాల పెంపు వంటివి లభిస్తాయి.
మిథున రాశికి చెందిన కళాకారులు, రచయితలు, మీడియా, కమ్యూనికేషన్ ఉద్యోగాల్లో ఉన్నవారు కష్టపడి పని చేయాల్సిన కాలం ఇది. కానీ గౌరవం పొందుతారు. గురు గ్రహం మీకు సపోర్ట్ ఇస్తాడు. రాజకీయ నాయకులకు, ఉపాధ్యాయులకు శనీశ్వరుడి ప్రభావం అధికంగా ఉంటుంది. మీరు ఎంత నిజాయితీగా ప్రవర్తిస్తే శని మీకు అంత మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ ఏడాది కలిసొచ్చే కాలమే. పదవ ఇంట్లో శని మీ సంస్థను మరింత పటిష్టంగా చేసేందుకు సహాయపడతాడు. జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు గురుడి వల్ల మీకు నగదు ప్రవాహం పెరుగుతుంది. నమ్మకమైన క్లయింట్లను మీరు పొందుతారు. అయితే సెప్టెంబర్ 18 నుండి నవంబర్ 12 మధ్యకాలంలో శక్తివంతమైన నీచ భంగ రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఆర్థిక సంక్షోభం, పెద్ద ఖర్చులు వచ్చే అవకాశం ఉంది.
కుటుంబ జీవితం
2026లో మిథున రాశి వారి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా జూన్ 2- అక్టోబర్ 30 మధ్య గురుడు ఉచ్ఛ స్థానంలో ఉండడం వల్ల ఇంట్లో శాంతి, పరస్పర సహకారం, శుభకార్యాలు వంటివి జరుగుతాయి. కుటుంబంలో వివాహాలు కావడం, గృహప్రవేశం వంటివి జరిగే అవకాశం ఉంది. మీ పదవ ఇంట్లో శనీశ్వరుడు ఉండడం వల్ల మీరు మీ ఉద్యోగానికి లేదా పనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నిరంతరం విధులు, బాధ్యతలు వైపే మీ ఆలోచనలు ఉంటాయి. దీని వల్ల కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మీరు సమతుల్యంగా నెరవేర్చాలి.
ఆరోగ్యం
మానసిక ఆందోళన, అలసట, దీర్ఘకాలిక శ్రమ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పదవ ఇంట్లో శని ఉండటం వల్ల పనిభారం, బాధ్యతలు పెరుగుతాయి. దీనివల్ల విశ్రాంతి తీసుకోవడం తగ్గుతుంది. అలసట, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, మోకాళ్ళ సమస్యలు బలహీనంగా అనిపించడం వంటివి కలగవచ్చు. బరువు పెరగడం, కొవ్వు పదార్థాలు అధికంగా తినడం వంటివి కూడా చేస్తారు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. జూన్ 20 నుండి ఆగస్టు 2 వరకు కుజుడు మీ 12వ ఇంట్లో సంచరిస్తాడు. దీని వల్ల నిద్రలేమి, మానసిక ఆందోళన, ప్రమాదాలు జరగడం, ఆసుపత్రి ఖర్చులు పెరగడం వంటివి జరుగుతాయి. డిసెంబర్ 6 నుండి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన కాలం. రాహువు.. మిధున రాశి వారి ఎనిమిదవ ఇంట్లోకి మారుతాడు. దీనివల్ల ఆకస్మికంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఉన్నత విద్య, విదేశీయానం ఛాన్స్
2026 మిథున రాశి విద్యార్థులకు మంచి సంవత్సరమనే చెప్పాలి. ఉన్నత విద్య కోసం ఈ సంవత్సరం మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. రాహువు వల్ల ఉన్నత విద్య, విదేశీ విద్యాలయాలు, పరిశోధనలు వంటి వాటికి అనుకూలమైన సమయం. మీకు ఉపాధ్యాయుల నుండి సపోర్ట్ కూడా దక్కుతుంది. అక్టోబర్ 31 నుండి గురువు మూడవ ఇంట్లోకి మారుతాడు. దీనివల్ల మీలో ధైర్యం, పోటీ తత్వం పెరుగుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు వంటి వాటిలో ఉత్సాహంగా పాల్గొంటారు. మీకు తెలివితేటలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రయత్న లోపం కనిపిస్తుంది. అందుకే క్రమశిక్షణతో ఉండేందుకు ప్రయత్నించాలి.
చేయాల్సిన పరిహారాలు
10వ ఇంట్లో కర్మ స్థానంలో శని ఉన్నారు. కాబట్టి శని స్తోత్రం క్రమం తప్పకుండా శనివారాల్లో పఠిస్తే మంచిది. లేదా హనుమాన్ చాలీసా పఠించినా మంచిదే. మీ పనిలో క్రమశిక్షణ, నిజాయితీ, వినయం ఉండాలి. చట్ట విరుద్ధమైన పనులను చేయకూడదు. శని ఇలాంటి పనులను తీవ్రంగా పెరగనిస్తాడు. ఇక రాహుకేతువుల కోసం గణేశుడుని పూజించాలి. మీ తండ్రి పెద్దలు, గురువులను గౌరవించాలి. గురు గ్రహం కోసం విష్ణు సహస్రనామాన్ని గురువారాల్లో పఠిస్తే మంచిది.

