MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Electricity Bill : సీలింగ్ ప్యాన్ vs టేబుల్ ప్యాన్ .. మీ కరెంట్ బిల్లు తగ్గాలంటే ఏది బెస్ట్..?

Electricity Bill : సీలింగ్ ప్యాన్ vs టేబుల్ ప్యాన్ .. మీ కరెంట్ బిల్లు తగ్గాలంటే ఏది బెస్ట్..?

సీలింగ్ ప్యాన్ కు, టేబుల్ ప్యాన్ కు  తేడా ఏంటి..? చాలామంది తమ ఇళ్లలో సీలింగ్ ప్యాన్ ను ఉపయోగిస్తుంటారు… కొంతమంది మాత్రమే టేబుల్ ప్యాన్ వాడుతుంటారు. మరి కరెంట్ బిల్లు తక్కువగా వచ్చి డబ్బులు ఆదా అవ్వాలంటే ఏ ప్యాన్ బెటర్..?  

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 14 2026, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సీలింగ్ ప్యాన్ Vs టేబుల్ ప్యాన్
Image Credit : AI Meta

సీలింగ్ ప్యాన్ Vs టేబుల్ ప్యాన్

ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతీ ఇంట్లో ప్యాన్ ఉండాల్సిందే… అది 24 గంటలు తిరగాల్సిందే. ఇలా ప్యాన్ వాడకం పెరగడంతో కరెెంట్ బిల్లు కూడా ఎక్కువ వస్తుంది. అయితే ఈ కరెంట్ ఖర్చులు తగ్గించుకునేందుకు సీలింగ్ ప్యాన్ వాడటం బెస్టా..? టేబుల్ వాడటం బెస్టా..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి ఈ రెండింటిలో దేనికి ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుందో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సీలింగ్ ప్యాన్, టేబుల్ ప్యాన్ కు తేడా ఏంటి..?
Image Credit : AI Meta

సీలింగ్ ప్యాన్, టేబుల్ ప్యాన్ కు తేడా ఏంటి..?

సీలింగ్ ప్యాన్ గది మొత్తానికి సమానంగా గాలిని అందిస్తుంది. పెద్దపెద్ద గదుల్లో అయితే సీలింగ్ ఫ్యాన్ మంచి ఆప్షన్. ఇంట్లోని హాల్, బెడ్రూంలలో చాలామంది ఈ సీలింగ్ ప్యాన్ నే వాడుతుంటారు. 

అయితే చిన్నిచన్న గదులు, పని ప్రదేశాలు, చిన్నచిన్న వ్యాపార సంస్థల్లో సీలింగ్ ప్యాన్ కంటే టేబుల్ ప్యాన్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒకేచోట కూర్చుని పనిచేస్తుంటే లేదా మీకు మాత్రమే గాలి కావాలంటే టేబుల్ ప్యాన్ ఎంచుకోవచ్చు. దీన్ని ఓ చోటు నుండి మరోచోటికి మార్చడం చాలా ఈజీ. 

35
ఏది వాడితే విద్యుత్ ఆదా అవుతుంది..?
Image Credit : AI Meta

ఏది వాడితే విద్యుత్ ఆదా అవుతుంది..?

సాధారణంగా సీలింగ్ ప్యాన్ 60 నుంచి 80 వాట్ల కరెంట్ తీసుకుంటుంది. అదే టేబుల్ ప్యాన్ అయితే కేవలం 30 నుంచి 50 వాట్లతోనే పనిచేస్తుంది. అంటే టేబుల్ ప్యాన్ వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుందన్నమాట. రోజంతా ప్యాన్ వాడేవాళ్లకు టేబుల్ ప్యాన్ మంచిది. కానీ సీలింగ్ ప్యాన్ గది అంతటికీ గాలి ఇస్తే, టేబుల్ ప్యాన్ మాత్రం ఒకే చోటకు గాలినిస్తుంది.

45
టేబుల్ ప్యాన్ ఉపయోగాలివే..
Image Credit : AI Meta

టేబుల్ ప్యాన్ ఉపయోగాలివే..

టేబుల్ ప్యాన్ వాడటంలో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. దీన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా మార్చుకోవచ్చు. వంటగది, బెడ్‌రూమ్, బాల్కనీ, హాల్.. ఇలా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. కానీ సీలింగ్ ప్యాన్ ను ఒకసారి బిగిస్తే అది ఫిక్స్. దాన్ని మార్చడం ఖర్చుతో కూడుకున్న పని.

55
సీలింగ్ ప్యాన్ vs టేబుల్ ప్యాన్... దేని ధర ఎంత..?
Image Credit : AI Meta

సీలింగ్ ప్యాన్ vs టేబుల్ ప్యాన్... దేని ధర ఎంత..?

సీలింగ్ ప్యాన్ల కన్నా టేబుల్ ప్యాన్లు తక్కువ ధరకే దొరుకుతాయి. సీలింగ్ ప్యాన్ బిగించడానికి కూడా డబ్బు ఖర్చు అవుతుంది. సీలింగ్ ప్యాన్ ఎత్తులో ఉండటంతో దాన్ని శుభ్రం చేయడం కష్టం. కానీ టేబుల్ ప్యాన్ ను సులభంగా క్లీన్ చేయొచ్చు.

మొత్తంగా సీలింగ్ ప్యాన్ కంటే టేబుల్ ప్యాన్ వాడటం వల్ల డబ్బులు ఆదా అవుతాయి. కరెంట్ బిల్లు తక్కువగా రావాలంటే చిన్న ఇల్లు కలిగినవారు టేబుల్ ప్యాన్ వాడటం బెస్ట్ ఆప్షన్. ఏ ఫ్యాన్ కావాలో నిర్ణయించుకోవడం పూర్తిగా మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పర్సనల్ పైనాన్స్
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Electricity Bill: కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందా? ఇలా చేస్తే ఎంతో ఆదా
Recommended image2
Electricity Saving Tip: సమ్మర్‌లో బిల్లు డబుల్ అవుతుందా? ఇలా చేస్తే సగానికి తగ్గుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved