MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Electricity Saving Tip: సమ్మర్‌లో బిల్లు డబుల్ అవుతుందా? ఇలా చేస్తే సగానికి తగ్గుతుంది

Electricity Saving Tip: సమ్మర్‌లో బిల్లు డబుల్ అవుతుందా? ఇలా చేస్తే సగానికి తగ్గుతుంది

Electricity Saving Tip: సమ్మర్ వచ్చిందంటే చాలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఫుల్ స్పీడ్‌లో తిరుగుతుంటాయి. వచ్చే కరెంటు బిల్లు చూస్తే గుండె ఆగినంత పని అవుతుంది. అయితే చిన్న చిన్న మార్పులతో మీ విద్యుత్ బిల్లును 30% నుంచి 50% వరకు తగ్గించుకోవచ్చు. 

2 Min read
Author : Nandini Arava
Published : Mar 20 2026, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కరెంటు బిల్లు డబుల్ అవుతోందా?
Image Credit : Getty

కరెంటు బిల్లు డబుల్ అవుతోందా?

మీ కరెంటు బిల్లు డబుల్ అవుతోందా? కంగారు పడకండి. మీ ఇంట్లోనే మీరు చేసే చిన్న చిన్న తప్పులే మీ బిల్లు పెరగడానికి కారణం. వేసవిలో ఏసీలు, కూలర్లు వాడకం ఎక్కువగా ఉంటుంది. కానీ అవే మన నెలవారీ బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. చాలామంది ఏసీని 16 డిగ్రీల్లో పెట్టి లేదా పాత కాలపు ఫ్యాన్లు వాడి అనవసరంగా కరెంటును వృథా చేస్తుంటారు. మరి బిల్ కూల్‍గా ఉంటూనే బిల్ తగ్గించొచ్చు. అయితే ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలి? ఏ ఫ్యాన్లు వాడితే కరెంటు ఆదా అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఏసీ (Air Conditioner) వాడకంలో జాగ్రత్తలు
Image Credit : Getty

ఏసీ (Air Conditioner) వాడకంలో జాగ్రత్తలు

చాలామంది ఏసీని 16°C లేదా 18°C దగ్గర పెడతారు. దీనివల్ల కంప్రెషర్ మీద లోడ్ పడి కరెంటు ఎక్కువగా కాలుతుంది. ఏసీని ఎప్పుడూ 24°C నుంచి 26°C మధ్య ఉంచుకోవాలి. ఇది శరీరానికి సౌకర్యంగా ఉంటుంది, విద్యుత్ ఆదా అవుతుంది.

రాత్రంతా ఏసీ అవసరం ఉండదు. తెల్లవారుజామున ఆగిపోయేలా టైమర్ పెట్టుకోండి. ఏసీ ఫిల్టర్లను నెలకు ఒకసారి క్లీన్ చేస్తే కూలింగ్ త్వరగా వస్తుంది.

Related Articles

Related image1
Electricity Bill: కరెంట్ బిల్లు తగ్గాలంటే ఈ తప్పులు మాత్రం చేయకండి..!
Related image2
Telangana Electricity Tariff Hike : తెలంగాణలో కరెంట్ బిల్లులు పెరుగుతాయా? ఇక వాచిపోవడం ఖాయమేనాా?
36
కూలర్ ఉపయోగించే వారు
Image Credit : our own

కూలర్ ఉపయోగించే వారు

కూలర్‌ను మూసి ఉన్న గదిలో కాకుండా, కిటికీ దగ్గర ఉంచండి. గదిలో గాలి బయటకు వెళ్లేలా (Ventilation) ఉంటేనే కూలర్ బాగా పనిచేస్తుంది. హనీకోంబ్ ప్యాడ్స్‌లో దుమ్ము పేరుకుపోతే మోటార్‌పై భారం పడుతుంది. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి.

46
లైట్లు, ఫ్యాన్లు
Image Credit : our own

లైట్లు, ఫ్యాన్లు

LED వైపు మారండి. సాధారణ బల్బుల కంటే LED బల్బులు 80% తక్కువ విద్యుత్తును వాడుకుంటాయి. పాత ఫ్యాన్ల కంటే BLDC ఫ్యాన్లు తక్కువ కరెంటుతో ఎక్కువ గాలిని ఇస్తాయి. వీలైతే వీటిని అమర్చుకోండి. పగటిపూట కిటికీలు తెరిచి ఉంచండి. అనవసరంగా లైట్లు వేయకండి.

56
మాటిమాటికీ డోర్ తీయోద్దు
Image Credit : our own

మాటిమాటికీ డోర్ తీయోద్దు

ఫ్రిజ్‌ను గోడకు అతుక్కొని ఉంచకూడదు. కనీసం 6 అంగుళాల గ్యాప్ ఉండాలి. వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకండి. అది చల్లబడటానికి ఫ్రిజ్ ఎక్కువ విద్యుత్‍ను తీసుకుంటుంది. ఫ్రిజ్ డోర్ మాటిమాటికీ తీయడం వల్ల లోపల కూలింగ్ తగ్గి, కంప్రెషర్ మళ్లీ రన్ అవ్వాల్సి వస్తుంది. 

66
ఉపయోగించని ప్లగ్స్ తీసేయండి
Image Credit : Getty

ఉపయోగించని ప్లగ్స్ తీసేయండి

టీవీ, కంప్యూటర్ లేదా మొబైల్ ఛార్జర్లను స్విచ్ ఆఫ్ చేసినా, ప్లగ్ సాకెట్‌లో ఉంటే స్వల్పంగా విద్యుత్ ఖర్చవుతుంది. పని పూర్తయ్యాక ప్లగ్‌లను తీసేయడం మంచిది.

ఇంటి పైకప్పుపై వైట్ పెయింట్ లేదా కూలింగ్ టైల్స్ వేయడం వల్ల గది ఉష్ణోగ్రత 4-5 డిగ్రీలు తగ్గుతుంది. దీనివల్ల ఏసీ వాడకం తక్కువగా ఉంటుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Electricity Bill: కరెంట్ బిల్లు తగ్గాలంటే ఈ తప్పులు మాత్రం చేయకండి..!
Recommended image2
Telangana Electricity Tariff Hike : తెలంగాణలో కరెంట్ బిల్లులు పెరుగుతాయా? ఇక వాచిపోవడం ఖాయమేనాా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved