Telugu

Electricity Bill: కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందా? ఇలా చేస్తే ఎంతో ఆదా

Telugu

ఫ్రిజ్

ప్రతి ఇంట్లోనూ రిఫ్రిజిరేటర్ ఉంటుంది. ఇది సాధారణంగా ఎక్కువ మొత్తంలో విద్యుత్ ను వినియోగిస్తుంది. కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని బాధపడటం కంటే ఎనర్జీ సేవింగ్ ఫ్రిజ్ కొనడం మంచిది.

Image credits: Getty
Telugu

వాషింగ్ మెషిన్

వాషింగ్ మెషిన్ ను తగినలోడ్‌తో వాడాలి. తక్కువ సైకిల్ టైమ్ ఎంచుకోండి. బట్టలు ఆరడానికి ఎలక్ట్రిక్ డ్రయర్లకు బదులు సహజ పద్దతులను వినియోగించడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయొచ్చు.

Image credits: Getty
Telugu

క్లాత్ డ్రైయర్

బట్టలు ఎండలో ఆరేయడం మంచిది. కానీ చాలామంది డ్రైయర్ వాడతారు. వాటి వాడకం తగ్గించడం మంచిది.

Image credits: Getty
Telugu

వాటర్ హీటర్

వాటర్ హీటర్స్ (గీజర్లు) ఎక్కువ సమయం ఉపయోగిస్తే కరెంటు బిల్లు పెరుగుతుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి పవర్ సేవింగ్ సామర్థ్యం ఉన్న హీటర్లను ఎంచుకోవాలి. . 

Image credits: Getty
Telugu

టెలివిజన్

అవసరం లేని టైంలో కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు ఆఫ్ చేయాలి. ఫోన్ ఛార్జింగ్‌‌‌‌ పూర్తయ్యాక ఛార్జర్‌‌‌‌ను ప్లగ్‌‌‌‌ నుంచి తొలగించాలి. ఏ ఎలక్ట్రికల్ వస్తువునైనా అతిగా ఉపయోగించకూడదు.  

Image credits: Getty
Telugu

ఏసీ లు

కరెంటు బిల్లు మోతమోగడానికి ప్రధాన కారణం ఏసీ లు. చాలా మంది ఏసీని 16 నుంచి 20లోపు పెడతారు. కానీ, మన బాడీకి అనువైన ఉష్ణోగ్రత 24 డిగ్రీలు మాత్రమే. అందుకే ఏసీలను 24 నుంచి 29మధ్య వాడాలి.

Image credits: Getty
Telugu

ఓవెన్

ఇటీవలీకాలంలో వంటగదిలో మైక్రోవేవ్‌లు, టోస్టర్‌లు వినియోగం పెరిగింది. వీటిని స్టాండ్‌బై మోడ్‌లో ఉంచినప్పుడు విద్యుత్తు వృధా అవుతుంది. కాబట్టి ఉపయోగించిన తర్వాత ఆఫ్ చేయడం మర్చిపోవద్దు

Image credits: Getty

Fatty Liver: ఫ్యాటీ లివర్ ను తగ్గించే సూపర్ డ్రింక్స్ ఇవే..

Curry Leaves: కరివేపాకును ఇలా నిల్వ చేస్తే.. నెలల తరబడి ఫ్రెష్ గా..

Jeera Water : ఉదయాన్నే జీరా నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Diabetes Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే షుగర్ వచ్చినట్లేనా?