MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Smart Watch: స్మార్ట్ వాచ్ రీడింగ్స్ ను నమ్మొచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

Smart Watch: స్మార్ట్ వాచ్ రీడింగ్స్ ను నమ్మొచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

Smart Watch: ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ వాచ్ లు పెట్టుకుంటున్నారు. వాకింగ్, రన్నింగ్..ఇలా ప్రతిదానికి రీడింగ్ చెక్ చేసుకోవడం కోసం వాడతారు. హార్ట్ రేట్‍ను ట్రాక్ చేస్తాయి. మరి గుండె ఆరోగ్యంగా ఉందో లేదో కూడా ఇది చెప్పగలదా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

2 Min read
Author : Nandini Arava
Published : Aug 21 2026, 07:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
స్మార్ట్ వాచ్ హార్ట్ రేట్ ఎలా చెక్ చేస్తుంది?
Image Credit : Getty

స్మార్ట్ వాచ్ హార్ట్ రేట్ ఎలా చెక్ చేస్తుంది?

ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ వాచ్ లు పెట్టుకుంటున్నారు. వాకింగ్, రన్నింగ్..ఇలా ప్రతిదానికి రీడింగ్ చెక్ చేసుకోవడం కోసం వాడతారు. యోగా, ఎక్సర్ సైజ్ చేసేటప్పుడు కూడా స్మార్ట్ వాచ్ ఉండాల్సిందే. హార్ట్ రేట్‍ను ట్రాక్ చేస్తాయి. ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్‌లలో ఉండే సెన్సార్లు మన హార్ట్ రేట్‌ను నిరంతరం ట్రాక్ చేస్తాయి. కొన్ని అడ్వాన్స్‌డ్ మోడల్స్‌లో ECG రికార్డ్ చేసే ఫీచర్ కూడా ఉంది. దీనివల్ల గుండె వేగం సాధారణం కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నా, లయ తప్పినా గమనించవచ్చు. ముఖ్యంగా, కొన్ని వాచ్‌లు ఏట్రియల్ ఫైబ్రిలేషన్ (Atrial Fibrillation - AF) అనే అసాధారణ గుండె లయకు సంబంధించిన సంకేతాలను గుర్తించగలవు. కానీ ఇదే ఫైనల్ మెడికల్ డయాగ్నసిస్ కాదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వాచ్ లో నార్మల్ గా ఉంటే గుండె ఆరోగ్యంగా ఉన్నట్లేనా?
Image Credit : Getty

వాచ్ లో నార్మల్ గా ఉంటే గుండె ఆరోగ్యంగా ఉన్నట్లేనా?

అలా కచ్చితంగా చెప్పలేం. స్మార్ట్‌వాచ్ ఒక నిర్దిష్ట సమయంలో గుండె వేగం, దాని లయ గురించి మాత్రమే సమాచారం ఇస్తుంది. గుండెకు వెళ్లే రక్తనాళాల్లోని బ్లాక్స్, గుండె కవాటాల సమస్యలు లేదా గుండె నిర్మాణంలో ఉండే లోపాలను వాచ్ గుర్తించలేదు. కాబట్టి, వాచ్ ఎప్పుడూ 'నార్మల్' అని చూపించినా, దాన్ని బట్టి గుండె పూర్తి ఆరోగ్యంగా ఉందని నిర్ణయించుకోవడం సరైన పద్ధతి కాదు.
36
స్మార్ట్‌వాచ్ ECGకి, హాస్పిటల్ ECGకి తేడా ఉంటుందా?
Image Credit : Getty

స్మార్ట్‌వాచ్ ECGకి, హాస్పిటల్ ECGకి తేడా ఉంటుందా?

కొన్ని స్మార్ట్‌వాచ్‌లలో ECG ఫీచర్ ఉన్నా, అది హాస్పిటల్‌లో చేసే 12-లీడ్ ECGకి సమానం కాదు. స్మార్ట్‌వాచ్ ECG కేవలం ఒక కోణంలో మాత్రమే గుండె ఎలక్ట్రికల్ యాక్టివిటీని రికార్డ్ చేస్తుంది. కానీ హాస్పిటల్‌లో చేసే ECG, గుండె పనితీరును అనేక కోణాల్లో విశ్లేషిస్తుంది. అందుకే వాచ్ ECG ఇచ్చే సమాచారం చాలా పరిమితంగా ఉంటుంది.
46
వాచ్ తప్పుడు హెచ్చరికలు కూడా ఇవ్వొచ్చు!
Image Credit : Getty

వాచ్ తప్పుడు హెచ్చరికలు కూడా ఇవ్వొచ్చు!

స్మార్ట్‌వాచ్ సెన్సార్ల రీడింగ్స్ ఎప్పుడూ 100 శాతం కరెక్ట్‌గా ఉంటాయని చెప్పలేం. చేతి కదలికలు, వాచ్ సరిగ్గా ఫిట్ అవ్వకపోవడం, చర్మానికి సరిగ్గా టచ్ కాకపోవడం వంటి కారణాల వల్ల కూడా కొన్నిసార్లు తప్పుడు రీడింగ్స్ లేదా ఫాల్స్ అలర్ట్స్ రావచ్చు. అలాగే, కొన్ని గుండె సమస్యలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి కాబట్టి, వాచ్ వాటిని రికార్డ్ చేయకపోవచ్చు. అందుకే, అలర్ట్ రాగానే భయపడటం, అలర్ట్ రాలేదని పూర్తిగా నిశ్చింతగా ఉండటం రెండూ కరెక్ట్ కాదు.

56
వాచ్ హెచ్చరిస్తే ఏం చేయాలి?
Image Credit : Getty

వాచ్ హెచ్చరిస్తే ఏం చేయాలి?

గుండె వేగానికి సంబంధించి వాచ్ పదేపదే అసాధారణ రీడింగ్స్ చూపిస్తే, ఆ డేటాను డాక్టర్‌కు చూపించడం మంచిది. ముఖ్యంగా గుండె దడ, ఛాతీలో అసౌకర్యం, ఆయాసం, తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరాన్ని బట్టి డాక్టర్ ECG, రక్త పరీక్షలు, ఎకోకార్డియోగ్రామ్ (Echocardiogram) లేదా ఇతర టెస్టులు చేయాలని చెప్తారు.

66
స్మార్ట్‌వాచ్‌ను సరిగ్గా ఎలా వాడాలి?
Image Credit : Getty

స్మార్ట్‌వాచ్‌ను సరిగ్గా ఎలా వాడాలి?

స్మార్ట్‌వాచ్‌ను గుండె ఆరోగ్యాన్ని నిర్ధారించే మెడికల్ డివైజ్‌గా కాకుండా, ఒక మానిటరింగ్, ముందస్తు హెచ్చరికల టూల్‌గా వాడాలి. రోజూవారీ హార్ట్ రేట్‌లోని మార్పులను గమనించడానికి, వ్యాయామం చేసేటప్పుడు గుండె వేగాన్ని ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి రక్తపోటు, కొలెస్ట్రాల్, కుటుంబ ఆరోగ్య చరిత్ర, లక్షణాలు, డాక్టర్ పరీక్ష అన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.

స్మార్ట్‌వాచ్ అనేది అలారం లాంటిది మాత్రమే. అది మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో చెప్పే 'సర్టిఫికెట్' కాదు. వాచ్ ఇచ్చే సమాచారం ఉపయోగపడినా, గుండె రోగాలను నిర్ధారించడానికి లేదా లేదని చెప్పడానికి పనికిరాదు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Blouse Designs: తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ లుక్ తెచ్చే బ్లౌజు డిజైన్లు
Recommended image2
Coolest State: భారతదేశంలో అత్యంత చల్లని రాష్ట్రం ఇదే..ఎటు చూసినా మంచే
Recommended image3
Weight Loss Teas: వెయిట్ లాస్ టీ...ఇది తాగితే చాలు ఒంట్లో కొవ్వు అలా కరిగిపోద్ది
Related Stories
Recommended image1
Gold Price Hike: పండుగ రోజే బంగారం షాక్.. ఒక్కరోజులో రూ.1,210 పెరుగుదల
Recommended image2
World Wonders: కళ్లని మాయ చేసే రెయిన్ బో బిల్డింగ్స్..ప్రపంచంలోనే అద్భుత కట్టడాలు ఇవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved