MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Bread Pakodi: కరకరలాడే బ్రెడ్ పకోడీని నిమిషాల్లో ఇలా చేసేయండి, సాయంత్రం స్నాక్ గా అదిరిపోతుంది

Bread Pakodi: కరకరలాడే బ్రెడ్ పకోడీని నిమిషాల్లో ఇలా చేసేయండి, సాయంత్రం స్నాక్ గా అదిరిపోతుంది

Bread Pakodi: బ్రెడ్ పకోడీ తినాలనిపిస్తే బయటికి వెళ్లి కొంటున్నారా? నిజానికి ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో బ్రెడ్ పకోడీ కరకరలాడేలా వండేయచ్చు.దీన్ని రెసిపీకి ఇక్కడ ఇచ్చాము ఫాలో అయిపోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 24 2026, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
క్రిస్పీ బ్రెడ్ పకోడీ
Image Credit : Dine fresh

క్రిస్పీ బ్రెడ్ పకోడీ

బ్రెడ్ పకోడి పేరు వింటే తినాలనిపిస్తుంది. సాయంత్రం అయితే చాలు... అది వేసవి కాలమైనా, చలికాలం అయినా ఏదో ఒకటి పొట్టలో వేయాలనిపిస్తుంది. ఎక్కువ మంది పకోడీలు, మిర్చి బజ్జీలు వంటివి బయట నుంచి కొని తెచ్చుకుంటారు. ఇంట్లోనే బ్రెడ్ పకోడీలను కరకరలాడేలా రుచికరంగా చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ సమయంలోనే. బ్రెడ్ పకోడీని క్రిస్పీగా ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఇచ్చాము.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బ్రెడ్ పకోడీకు కావాల్సిన పదార్థాలు
Image Credit : Chat gpt

బ్రెడ్ పకోడీకు కావాల్సిన పదార్థాలు

బంగాళదుంపలు - రెండు

ఉల్లిపాయ - ఒకటి

వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ధనియాల పొడి - అర స్పూను

శెనగపిండి - అర కప్పు

వాము - అర స్పూను

నీళ్లు - సరిపడినన్ని

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

బ్రెడ్ - 8 స్లైసులు

కారం - ఒక స్పూను

పసుపు - పావు స్పూను

జీలకర్ర - అర స్పూను

34
బ్రెడ్ పకోడీ రెసిపీ
Image Credit : Kali mirch by smita

బ్రెడ్ పకోడీ రెసిపీ

బ్రెడ్ పకోడీలో పెట్టే కూరే దీనికి ఎక్కువ రుచిని అందిస్తుంది. దీన్నే ముందుగా తయారు చేసుకోవాలి. ఇందుకోసం బంగాళదుంపలను బాగా ఉడకబెట్టి చేతితోనే మెదిపి ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టూ, కారం, పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు శెనగపిండిని తీసుకొని అందులో కొద్దిగా వాము, పసుపు, ఉప్పు, నీళ్లు వేసి పల్చగా కలుపుకోవాలి. ఇది మరీ చిక్కగా ఉంటే బ్రెడ్ పకోడీలు క్రిస్పీగా రావు. శెనగపిండి మిశ్రమంలో ఒక చెంచా నూనె కూడా వేడి చేసి వేస్తే ఇవి మరింత కరకరలాడుతూ వస్తాయి.

44
నూనెలో వేయించి
Image Credit : chat gpt

నూనెలో వేయించి

ఇప్పుడు బ్రెడ్ ని తీసుకొని దానిపైన బంగాళదుంప మిశ్రమాన్ని సమానంగా పరచాలి. దానిపైన మరొక బ్రెడ్ ముక్కను పెట్టి త్రిభుజాకారంలో రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి. నూనె వేడెక్కాక ఈ బ్రెడ్ ముక్కలను శెనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయించాలి. అవి బంగారు రంగులోకి మారిన తర్వాత తీసి టిష్యూ పేపర్ మీద ఉంచుకోవాలి. టిష్యూ పేపర్ అదనపు నూనెను పీల్చేస్తుంది. ఇప్పుడు వీటిని పుదీనా చట్నీతో తింటే అదిరిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మీ పిల్లలు ఎప్పుడూ గొడవ పడుతున్నారా? ఈ 5 చేస్తే వారి మధ్య ప్రేమ పెరగడం పక్కా!
Recommended image2
Ear Cuff Jhumka:చీరలు,లెహంగా మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే ఇయర్ కఫ్ జుంకాలు
Recommended image3
Divorce Survey: విడాకుల తర్వాత మెమోరీస్ దాచుకుంటున్నారట.. మాజీ భాగస్వాములతో హద్దులపై కొత్త సర్వే
Related Stories
Recommended image1
Silver Vaddanam: బంగారు వడ్డాణం కొనలేరా? అయితే వెండి వడ్డాణం కొనేయండి.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో
Recommended image2
Ghee Making: నెయ్యి కాచేటప్పుడు ఒక్క తమలపాకు వేయండి చాలు, ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved