MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cooking Tips: ఇదొక్కటి రెండు చుక్కలు వేస్తే.. బెండకాయ జిగురు లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది..!

Cooking Tips: ఇదొక్కటి రెండు చుక్కలు వేస్తే.. బెండకాయ జిగురు లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది..!

Cooking Tips: బెండకాయ కూర లేదా ఫ్రై చేస్తున్నప్పుడు జిగురుగా మారిపోతుంది. దీని వల్ల.. కూర రుచి తగ్గిపోవడమే కాకుండా, తినడం కూడా చాలా మందికి నచ్చదు. అలా జిగురు రాకుండా బెండకాయ ఫ్రై అవ్వాలంటే సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాలి.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 08 2026, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బెండకాయ జిగురు పోగొట్టేదెలా?
Image Credit : Chat GPt

బెండకాయ జిగురు పోగొట్టేదెలా?

బెండకాయలో చాలా పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు.. తక్కువ సమయంలో వంట పూర్తి అవ్వాలి అంటే.. బెండకాయ బెస్ట్ ఆప్షన్. దీనితో చేసే ఏ వంట అయినా చాలా రుచిగా ఉంటుంది. కానీ వచ్చిన చిక్కల్లా బెండకాయ వండేటప్పుడు వచ్చే జిగురు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా.. బెండకాయ కూర వండేటప్పుడు.. జిగురుగా మారుతుంది. ఇలా జిగురు రాకుండా.. బెండకాయ మంచిగా ఫ్రై అవ్వాలి అంటే... కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బెండకాయను పూర్తిగా ఆరబెట్టాలి..
Image Credit : Getty

బెండకాయను పూర్తిగా ఆరబెట్టాలి..

చాలా మంది చేసే అతి పెద్ద తప్పు ఇది. బెండకాయను కడిగిన వెంటనే కోయకూడదు. కడిగిన బెండకాయపై నీరు లేకుండా.. పూర్తిగా ఆరబెట్టడం చాలా ముఖ్యం. శుభ్రమైన కిచెన్ క్లాత్ తో బెండకాయను బాగా తుడిచి, ఆ తర్వాతే ముక్కులుగా కోయాలి. బెండకాయపై తేమ ఎక్కువగా ఉంటే.. వండే సమయంలో జిగురు వస్తుంది.

వండేటప్పుడు మూత పెట్టకండి..

బెండకాయను పాన్‌లో వండేటప్పుడు దానిపై మూత పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల లోపల ఆవిరి, తేమ నిలిచిపోతాయి. దీంతో బెండకాయ మరింత జిగురుగా మారవచ్చు. అందుకే బెండకాయను వండేటప్పుడు పాన్‌ను ఓపెన్‌గా ఉంచి వండాలి.

33
చివర్లో నిమ్మరసం
Image Credit : stockPhoto

చివర్లో నిమ్మరసం

బెండకాయ ఉడుకుతున్న సమయంలో చివర్లో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఇది బెండకాయలో ఉండే జిగురును తగ్గించడంలో సహాయపడటంతో పాటు, బెండకాయ కొంత క్రిస్పీగా ఉండేలా చేస్తుంది.

బెండకాయ కోసేటప్పుడూ ఈ ట్రిక్..

బెండకాయలో జిగురు సమస్య వంట మొదలైన తర్వాతే కాదు.. కోసేటప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది. కత్తికి జిగురు అంటుకోవడంతో పాటు చేతులకు కూడా అంటుకుంటుంది. దీనిని తగ్గించడానికి బెండకాయ కోయడానికి ముందు ఒక నిమ్మకాయ ముక్కను కత్తికి రెండు వైపులా రుద్దాలి. ఆ తర్వాత బెండకాయను కోస్తే కత్తికి అంటుకునే జిగురు కొంత తగ్గుతుంది.

నిమ్మరసం లేకపోతే పెరుగు..

వంట చేస్తున్న సమయంలో నిమ్మరసం అందుబాటులో లేకపోతే కొద్దిగా పెరుగు కూడా ఉపయోగించవచ్చు. ఇది బెండకాయ టెక్స్చర్‌ను మెరుగుపరచడంలో సహాయపడటంతో పాటు వంటకు స్వల్పంగా పుల్లటి రుచిని కూడా ఇస్తుంది. అందుకే బెండకాయ జిగురుగా మారకూడదంటే.. కడిగిన తర్వాత పూర్తిగా ఆరబెట్టడం, వండేటప్పుడు మూత పెట్టకపోవడం, చివర్లో కొద్దిగా నిమ్మరసం వేయడం వంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Moringa soup: మహిళలు ప్రతి రోజూ ఈ సూప్ కప్పు తాగితే చాలు...వెయ్యి ఏనుగుల బలం వస్తుంది.
Recommended image2
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం కుటుంబంలో ఎవరి మాట వినాలి? ఎవరి మాట పట్టించుకోవద్దు?
Recommended image3
DMart : శని, ఆదివారాలు కాదు, ఈ 2 రోజులు డీమార్ట్ లో షాపింగ్ చేశారో.. 15-20% ఖర్చు సేవ్
Related Stories
Recommended image1
Chana Dal: శనగపప్పు తొందరగా ఉడకడం లేదా? ఈ ఒక్క ట్రిక్ పాటిస్తే 10 నిమిషాల్లో మెత్తగా ఉడికిపోతుంది..!
Recommended image2
Rain: మన దేశంలో సంవత్సరమంతా వర్షం పడే ప్రదేశం ఇది...!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved